ఈ ఉద్యోగులకు శుభవార్త: వేతనాల పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్ఇ) ఉద్యోగులకు శుభవార్త. 3 వ పే కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయించింది. దీని ప్రకారం సీపీఎస్ఈ ఉద్యోగుల వేతనాలు 15శాతం పెరగనున్నాయి. ఇప్పటివరకు ఇదే అత్యల్ప పెరుగుదలగా నమోదైంది.
సెంట్రల్ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 15 శాతం పెంపు కమిషన్ ముందు ప్రతిపాదించగా, ఈ సిఫారసులను కేంద్ర క్యాబినెట్ బుధవారం . ఆమోదించింది. ఈ పెరిగిన జీతాలు జనవరి 1, 2017 నుంచి అమలు చేయనున్నామని తెలిపింది.
కాగా మొదటి కమిషన్ సిఫారసుల మేరకు 24-30శాతం వేతనాలు పెరగగా, రెండవ కమిషన్ సిఫారసులతో 2007లో 37.2 శాతం వేతనాలు పెరగడం గమనార్హం.