సీఎన్ఎన్తోటీవీ18 ఒప్పందానికి ముగింపు
వచ్చే ఏడాది జనవరితో...
న్యూఢిల్లీ: కేబుల్ న్యూస్ నెట్వర్క్(సీఎన్ఎన్)తో టీవీ18 బ్రాడ్కాస్ట్ కుదుర్చుకున్న పదే ళ్ల ఒప్పందం వచ్చే ఏడాది జనవరితో పూర్తి కానున్నది. ఈ ఒప్పందాన్ని పొడిగించే ఉద్దేశమేదీ లేదని నెట్వర్క్18 గ్రూప్ సీఈఓ ఏపీ పరిగి వెల్లడించారు. టీవీ18 గ్రూప్ కంపెనీ అయిన గ్లోబల్ బ్రాడ్కాస్ట్ న్యూస్(జీబీఎన్) సంస్థ, సీఎన్ఎన్ టర్నర్ ఇంట ర్నేషనల్తో 2005లో ఒక బ్రాండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సీఎన్ఎన్ ఐబీఎన్ ఇంగ్లిష్ న్యూస్ చానెల్‌ను ప్రారంభించడానికి, సీఎన్ఎన్ బ్రాం డ్‌ను, కంటెంట్‌ను వాడుకోవడానికి పదేళ్ల పాటు అమల్లో ఉండేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.