కడెం నిండుకుండ..
కడెం(నిర్మల్): ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. దీంతో శుక్రవారం ఉదయం ప్రాజెక్ట్ 6వ నంబరు వరద గేటు నాలుగు ఫీట్ల మేర ఎత్తి 5,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శనివారం సాయంత్రం ఇన్‌ఫ్లో తగ్గిపోవటంతో వరద గేటును మూసివేశారు. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులు(7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 698.050 అడుగులు(7.101 టీఎంసీలు)గా ఉందని వివరించారు. ఇన్‌ఫ్లో 884 క్యూసెక్కులుగా ఉందని, దీంతో కుడి, ఎడమ కాలువ ద్వారా నీటిని దిగువకు వదులుతున్నట్లు వివరించారు.