Cake Designer
-
Prachi Dhabal Deb: ఆ కేకుల కోసం క్యూ కడతారు
బొమ్మలేసే ఆర్టిస్టు గురించి విన్నాం. కేక్ ఆర్టిస్ట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రాచీ ధబల్ను మన దేశంలో బేకింగ్ క్వీన్‌గా, గొప్ప కేక్ ఆర్టిస్ట్‌గా పిలుస్తారు. కేక్‌లను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా చేసి తినడానికే కాదు చూడటానికి కూడా రుచికరంగా తయారు చేసి అంతర్జాతీయ అవార్డులు పొందుతోందామె. ఈ ఫొటోలు చూడండి. అన్నీ తినే కేకులే. ‘మీరూ ఇలా కొత్తగా ట్రై చేసి సక్సెస్ సాధించండి’ అంటోంది ప్రాచీ. ప్రపంచ ప్రఖ్యాత కేక్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? యూకేకు చెందిన ఎడ్డీ స్పెన్స్. కళాత్మకమైన కేకుల తయారీలో ఆయన ప్రతిభకు అక్కడి ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో గౌరవించింది. ‘నేను లండన్ వెళ్లి ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. నాకు కేక్ ఆర్ట్ అంటే అంత పిచ్చి’ అంటుంది ప్రాచీ ధబల్. 36 ఏళ్ల ప్రాచీ గత సంవత్సరం 100 కిలోల కేక్‌ను తయారు చేసింది. ఇది ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్ కేథడ్రల్ (చర్చ్)కు రెప్లికా. ఆరున్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ చర్చ్ ఆకారపు కేక్‌లో దాదాపు 1500 సున్నితమైన భాగాలు ఉన్నాయి. వాటన్నింటినీ రాయల్ ఐసింగ్ (తెల్ల సొన, చక్కెర పొడుల మిశ్రమం)తో తయారు చేసి ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2022’లో ఎక్కింది ప్రాచీ. అందుకే ఆమెను ‘బేకింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా’ అంటుంటారు. చిన్నప్పటి నుంచి ప్రాచీ ధబల్ సొంత ఊరు డెహరాడూన్. అక్కడే పుట్టి పెరిగింది. ‘నాకు పదేళ్లున్నప్పుడు వేసవి సెలవుల్లో కేకుల తయారీని మా అమ్మ నాకు కాలక్షేపంగా నేర్పింది. నేను కప్‌కేక్‌లు తయారు చేసేదాన్ని. రోజులు పెరిగే కొద్దీ ఆ ఆసక్తి కూడా పెరిగింది. నాకు బొమ్మలు వేయడం కూడా వచ్చు. కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. నా పుట్టిన రోజున బయట కేక్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు నేను చదివిన కథల్లోని కోటల్లాంటి, రాకుమార్తెల్లాంటి, ఉద్యానవనాల్లాంటి కేక్‌లు తెప్పించమని మా అమ్మను పోరేదాన్ని. కాని అలాంటి కేకులు ఎవరూ తయారు చేయరు. మార్కెట్లో మామూలు కేకులు ఉండేవి. నాకు అలాంటివి ఎందుకు తయారు చేయకూడదు అనిపించేది’ అంది ప్రాచీ ధబల్. ఉద్యోగం నచ్చలేదు ప్రాచీ కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పూణెలో ఉద్యోగానికి వచ్చి స్థిరపడింది. కాని ఆమెకు ఆ ఉద్యోగం నచ్చలేదు. ‘2012 నాటికి నాకు ఉద్యోగం బోర్ కొట్టింది. అందులో నాకు ఇష్టమైనదేదో లేదు. నాకు కేక్ ఆర్టిస్ట్‌గా మారాలనిపించింది. కాని ఆ రోజుల్లో ఆ కళకు పెద్దగా గిరాకీ లేదు. ఎవరికీ అలాంటిది ఒకటి ఉంటుందని తెలియదు. కళాత్మక కేకులు తయారు చేయాలంటే కావలసిన మెటీరియల్ మన దేశంలో దొరికేది కాదు. అయినా సరే తెగించి విదేశాల నుంచి కావలసిన సామాగ్రి తెప్పించుకుంటూ రంగంలో దిగాను. నేను తయారు చేసేది షాపులో అమ్మే కేకులు కాదు. కస్టమైజ్డ్ కేకులు. అందువల్ల వీటి ఖరీదు కూడా ఎక్కువ. అలాంటి కస్టమర్లు పెరిగే వరకూ నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. కాని నా ప్రత్యేకమైన కేకులు నలుగురి దృష్టిలో పడ్డాక ఇప్పుడు ఊపిరి సలపడానికి కూడా టైమ్ లేదు’ అని నవ్వుతుంది ప్రాచీ. దేశీయత ప్రాచీ తయారు చేసే కేకులు దేశీయతతో నిండి ఉంటాయి. చీరల మీద డిజైన్లు, ఆర్కిటెక్చర్, సంప్రదాయ చిహ్నాలు అన్నీ ఆమె కేకుల్లో కనిపిస్తాయి. ఇటీవల ఆమె బెనారస్ చీరను, ఆభరణాలను పోలిన కేక్‌ను తయారు చేసింది. ‘కుంకుమ భరిణె’ లా కనిపిస్తున్న ఆ కేక్ ఎన్నో ప్రశంసలు పొందింది. ఆమె తయారు చేసిన నెమలి కేక్‌లో పైకి ఆభరణాలుగా కనిపించేవి కూడా తినదగ్గ మెటీరియల్‌తో తయారు చేసినవే. అయితే ఈ కళను ప్రాచీ తన దగ్గరే దాచుకోవడం లేదు. యువ బేకర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసి నేర్పుతోంది. ‘అమ్మాయిలు ముందు తమకు ఇష్టమైన రంగంలో కనీస డిగ్రీ సంపాదించాలి. ఆ తర్వాత ఆ ఇష్టం కోసం కష్టపడాలి. తప్పకుండా విజయం లభిస్తుంది. కష్టపడకుండా ఏదీ రాదు’ అంటుంది ప్రాచీ. పాత దారిలో కొత్తగా నడవడమే విజయం అని ప్రాచీ విజయం తెలుపుతోంది. -
క్యాథడ్రెల్ కేక్!.. ఆ కుటుంబం ఏది చేసినా రిచ్‌గా ఉంటుంది
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి అందమైన భవనం పక్కన కూర్చుని ఫొటో తీసుకుంది. మనం కూడా ఒక ఫొటో తీసుకుంటే భలే ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది నిజమైన భవనం కాదు. అక్షరాల వంద కేజీల కూల్ కేక్. అవునా! అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే. చూడగానే నోట్లో నీళ్లూరించే కేక్ డెకరేషన్లతో కేక్ ఆర్టిస్ట్‌లు తెగ ఆకట్టుకుంటుంటారు. కేక్ ఆకృతిని చూసి ధరకూడా చూడకుండా కొనేస్తుంటారు కొందరు. కానీ ఈ కేకు వాటన్నింటిలోకి చాలా భిన్నమైనది. అచ్చం ఇలాంటి కేకులు రూపొందించే ఆర్టిస్టే పూనేకు చెందిన ప్రాచీ ధబాల్ దేబ్. వినూత్న ఆలోచనతో ఏకంగా లండన్ వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపును తెచ్చుకుంది. బ్రిటన్ రాయల్ కుటుంబం ఏది చేసినా ఎంతో రిచ్‌గా ఉంటుంది. వారు నివసించే భవనాల నుంచి ధరించే దుస్తుల వరకు అంతా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇలా ఎంతో ప్రత్యేకమైన బ్రిటన్‌కు చెందిన ఓ పురాతన చర్చ్‌ను వీగన్ కేక్‌తో రూపొందించింది ప్రాచి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేక్ ఐకాన్ ఎడ్డీస్పెన్స్ మార్గదర్శకత్వంలో రాయల్ ఐసింగ్ కళను నేర్చుకుని 1500ల కేకు ముక్కలతో మిలాన్ క్యాథడ్రెల్ చర్చ్‌ను నిర్మించింది. గుడ్లను వాడకుండా వీగన్ పదార్థాలతో కేకు ముక్కలను డిజైన్ చేసింది ప్రాచీ. ముక్కలన్నింటిని కలిపి చర్చ్రూపం తీసుకురావడానికి ప్రాచీకి నెలరోజులు పట్టింది. ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవైన నిర్మాణమే ఈ రాయల్ ఐసింగ్ కేక్. నాలుగు అడుగుల ఎత్తు, మూడడుగుల పది అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ కేకు బరువు వందకేజీలపైనే. ఎంతో సంక్లిష్టమైన నిర్మాణాలను కేక్‌లుగా రూపొందించడంలో ప్రాచీకి నైపుణ్యం ఉండడంతో.. గతేడాది ఫెమినా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటుదక్కించుకుంది. -
కేకు శిల్పాలు
సైరా సినిమా సక్సెస్‌మీట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది ఎదురుగా ఉన్న శిల్పం. అది శిల్పం కాదని, కేక్ అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసముండే ఢాకా రాధ ఆ కేక్ రూపకర్త. ఇంట్లో పుట్టినరోజు నుంచి సెలబ్రిటీల ఫంక్షన్ల వరకు రాధ అందించే రకరకాల శిల్పాకృతులను పోలిన కేక్ తయారీకి ఆమె చేసిన కృషి గురించి ఆమె మాటల్లోనే... సైరా సక్సెస్‌మీట్‌లో..కేక్! ‘ఈ బేకింగ్ ఆర్ట్‌లో నైపుణ్యం సాధించడానికి కొన్నేళ్లు పట్టింది. రాత్రింబవళ్లు కష్టపడితే తప్ప ఈ రూపాలు రాలేదు. మొదట్లో మా పిల్లలిద్దరి పుట్టిన రోజులకు కేక్స్ తయారుచేసేదాన్ని. వాటిల్లోనూ బయట కొనే కేకుల మాదిరి కాకుండా ఏదైనా భిన్నంగా ఉండాలనుకున్నాను. వాటిని చాలా అందంగా డెకొరేట్ చేసేదాన్ని. వచ్చిన బంధుమిత్రులు చూసి వారిళ్లలో వేడుకలకు కేక్స్ తయారుచేసి ఇవ్వమనేవాళ్లు. ఆ తర్వాత్తర్వాత కేక్‌తోనే చిన్న చిన్న బొమ్మలను తయారుచేసి అలంకరించేదాన్ని. గతంలో వంటల పుస్తకాలు చూస్తూ వంటలు చేసేదాన్ని. తర్వాత్తర్వాత ఇంటర్నెట్లో ఇలాంటి కళ కోసం, కళాకారుల కోసం వెతుకుతూ ఉండేదాన్ని. సాధనతో ఆకృతులు చేయడం వచ్చింది. థీమ్‌కు తగినట్టు చదివింది పోస్టు గ్రాడ్యుయేషన్. కానీ, పెయింటింగ్ మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి. క్యారికేచర్స్ వేసేదాన్ని. తంజావూర్, వాటర్ కలర్ పెయింటింగ్స్ చేసేదాన్ని. ఆ కళ ఇలా కేక్ మీదకు తీసుకురావడానికి ఉపయోగపడింది. పెళ్లి రోజు, రిసెప్షన్, షష్టిపూర్తి.. ఇలా ఏ కార్యక్రమమైనా ఆ థీమ్‌కు తగ్గట్టు బొమ్మల కేక్ తయారు చేసి ఇస్తూ ఉండేదాన్ని. సింగర్ సునీతకు.. కేక్ ఆకృతి వంటల పోటీలు కేక్ ఆర్ట్‌లో నిరంతర సాధన, ప్రయోగాలు చేస్తూనే దేశంలో ఎక్కడ బేకింగ్ పోటీలు జరిగినా వాటిలో పాల్గొంటూ వచ్చాను. దేశంలో యుకెకు చెందిన కేక్ మాస్టర్స్ మ్యాగజీన్, గ్లోబల్ షుగర్ ఆర్ట్ ఆన్లైన్ మ్యాగజీన్స్ ప్రతియేటా టాప్ టెన్ అవార్డులను ఇస్తుంటాయి. కిందటేడాది ఆ అవార్డు నన్ను వరించింది. వంటగదిలోనే.. మా అమ్మగారికి ఎనభైమూడేళ్లు. ఇప్పటికీ తను వంట చేస్తారు. ఇంట్లో వంటవాళ్లు ఉన్నప్పటికీ వండి వడ్డించడంలో ఆమెకున్న ఆసక్తి నన్నూ వంటవైపుగా నడిపించింది. ఆమె దగ్గరే నేనూ రకరకాల పదార్థాల తయారీ నేర్చుకున్నాను. మా ఇంట్లోని వంటగదే ఈ కేక్ వ్యాపారానికి కేంద్రబిందువు. మా పిల్లలు కూడా కేక్ బేకింగ్‌లో పాల్గొంటారు. ఈ తరం వాళ్లలో ఉండే ఆలోచనలు, సృజన కేక్ తయారీ రూపకల్పనకు ఉపయోగపడుతుంది. అటు అమ్మ నుంచి ఇటు మా అమ్మాయి నుంచీ సూచనలు తీసుకుంటాను. ఆర్డర్స్ ఎక్కువ వచ్చాయంటే మా ఇంట్లో వాళ్లూ సాయం చేస్తారు. ఇదంతా మా ఇంటి సభ్యుల టీమ్ ఎఫర్ట్. పదేళ్లుగా బిజినెస్ బిజినెస్ చేయాలనే ఆలోచనతో కాకుండా బేకింగ్ ఆర్ట్ ఆసక్తితో నేర్చుకున్నాను. ముందు బంధు మిత్రులు అడిగితే కేక్స్ చేసి ఇస్తూ వచ్చిన నేను పదేళ్ల క్రితం బిజినెస్ మొదలుపెట్టాను. బేకింగ్ క్లాసులు కూడా తీసుకుంటున్నాను. ఆ క్లాసులు రెండు రోజుల నుంచి నెల రోజుల వరకూ ఉంటాయి. ఆన్లైన్ ద్వారా ఈ కేక్ తయారీ గురించి తెలుసుకుంటూ బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వచ్చి ఈ బొమ్మల కేక్ తయారీలో మెలకువలు నేర్చుకొని వెళుతుంటారు. గృహిణిగా ఉంటూ ఇష్టం కొద్ది మొదలుపెట్టిన ఈ కేక్ తయారీ ఇప్పుడు నాకో ప్రత్యేక గుర్తింపును తెచ్చింది’ అంటూ రాధ ఆనందంగా తెలిపారు. – నిర్మలారెడ్డి,ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
కథలు తిందాం
పుట్టిన రోజు పేరు చెప్పగానే నోరూరించే కేక్ పిల్లల కళ్ల ముందు కదలాడుతుంది.ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా..? ఇష్టమైన కేక్ ఎప్పుడు ముందుకొస్తుందా..? అని ఎదురు చూస్తుంటారు. బర్త్ డే పార్టీకి వచ్చే పిల్లలందరి దృష్టి దాని మీదే. కేక్ ఇలా కట్ చేయగానే అలా చిన్నారుల నోళ్లలో కరిగిపోతుంది. అసలు కేక్ లేనిదే బర్త్ డే పార్టీ లేదు. వీటికే కాస్త సృజనాత్మకత జోడించి కేక్‌లతో కథలు చెప్పిస్తున్నారు కేక్ డిజైనర్ ప్రగతి. ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ పేరుతో ఆమె తయారు చేస్తున్న విభిన్న తరహా కే క్లు పిల్లలు, పెద్దల మనసు దోచేస్తున్నాయి. కథలు తిందాం రెగ్యులర్ కేక్‌లకు కాలం చెల్లింది. రకరకాల ఫ్లేవర్స్‌తో లభించే టేస్టీ టేస్టీ కేక్‌లంటే పిల్లలకు ప్రాణం. వీటికి డిఫరెంట్ మేకప్‌తో పాటు.. ఓ థీమ్‌ను డిజైన్ చేయడం ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ ప్రత్యేకత. కొత్తదనంతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్న ఓ వనిత సృజనకు ప్రతిరూపమే స్టోరీ కేక్. సింగపూర్‌లో చూసిన కస్టమైజ్డ్ కేక్స్‌ను స్ఫూర్తిగా పొందిన ప్రగతి.. ఈ కేక్‌లకు ప్రాణ ప్రతిష్ట చేసింది. ‘నేను సింగపూర్‌లో డిగ్రీ చేస్తుండగా.. అక్కడ ఇలాంటి కేక్‌లు చూశాను. ఇండియాకు వచ్చాక కొత్తదనంతో నా ప్రత్యేకత తెలియజేద్దామనుకున్నా. కొన్ని కేక్ శాంపిల్స్ తయారు చేసి స్నేహితులకు పంపాను. వారికి ఆ థీమ్ నచ్చడంతో.. 2012లో జూబ్లీహిల్స్‌లో ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ పేరుతో కంపెనీ మొదలుపెట్టాను’ అని చెప్పారు ప్రగతి. చాయిస్ కస్టమర్స్దే కేక్‌పై డిజైన్ చేయాల్సిన స్టోరీ చాయిస్ కస్టమర్స్దే. బర్త్ డే బాయ్స్ చెప్పే కథలను బట్టి ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ తయారవుతుంది. మొక్కలంటే ఇష్టమున్న పిల్లలకు.. బోన్సాయ్ చెట్టు నుంచి హోమ్ గార్డెన్ వరకు అన్నీ కొలువుదీర్చి కేక్నే ఓ గ్రీన్ సీనరీగా మార్చేస్తుంది ప్రగతి. పిల్లలు చెప్పే కథలే థీమ్‌గా కేక్‌లను తయారు చేస్తుంది. ముందు ఆ స్టోరీస్‌ను పేపర్‌పై గీసి, దాన్ని పిల్లలకు చూపించి నచ్చితేనే కేక్ తయారీ మొదలుపెడుతుంది. పిల్లలకే కాదు పెద్దల బర్త్‌డేలకు కేక్స్ డిజైన్ చేయడంలో ప్రగతి పర్ఫెక్టే. ఓ 60 ఏళ్ల పెద్దాయన పుట్టిన రోజుకు కేక్ డిఫరెంట్‌గా ప్లాన్ చేసింది. గతంలో ఆయన మేస్త్రీ పని చేశారు. దానికి తగ్గట్టుగా కేక్ డిజైన్ చేసింది. గతేడాది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వార్షికోత్సవాలకు.. అకాడమీ బొమ్మ, మధ్యలో పోలీస్ సిబ్బంది నిలబడ్డట్టు కేక్ ప్రిపేర్ చేసింది. పుట్టిన రోజులకే కాదు వెడ్డింగ్ యానివర్సరీకి, కాలేజీ ఫ్రెషర్స్, ఫేర్వెల్ పార్టీస్‌కు తగ్గట్టుగా తయారు చేసే కేక్‌లకు బోలెడంత డిమాండ్ ఉంది. పెళ్లి శుభలేఖతో పంపించే కప్ కేక్ బంధువులకు, స్నేహితులకు మరింత అనుబంధాన్ని పంచుతోంది. వేడుకకు తగ్గట్టుగా డిజైన్ చేస్తుండటంతో ‘ది స్టోరీ ఆఫ్ ది కేక్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సక్సెస్ ‘స్టోరీ’ మా అమ్మ సునీత డాక్టర్, నాన్న ప్రకాష్ వ్యాపారవేత్త. నేను మొదట కంపెనీ పెట్టినప్పుడు చిత్తశుద్ధితో పని చేస్తే సక్సెస్ వస్తుందని వాళ్లు ప్రోత్సహించారు. ఎన్ని ఆర్డర్లు వచ్చినా స్వయంగా నేనే అన్ని పనులూ చేసుకుంటాను. కేక్‌లపై డిజైన్‌గా మారిన కథలే నా బిజినెస్ సక్సెస్‌కు కారణం.