రూ.1,200 కోట్ల జీవిత బీమా!
వాషింగ్టన్: ఒకటీ కాదు.. రెండూ కాదు.. ఏకంగా రూ.1,200 కోట్లకు పైగా విలువైన జీవిత బీమా పాలసీ కొనుగోలు చేయడం ద్వారా అమెరికాలో ప్రముఖుడైన ఓ అపర కుబేరుడు గిన్నిస్ రికార్డులకెక్కాడు. టెక్నాలజీ స్పేస్లో సుపరిచితుడైన ఇతను కాలిఫోర్నియూలోని సిలికాన్ వ్యాలీ లో ఉంటున్నట్టు గిన్నిస్ సంస్థ తెలిపింది. కాలిఫోర్నియూ శాంతాబార్బరాకు చెందిన ఎస్జీ ఎల్ఎల్సీ కంపెనీ నిర్వహణా భాగస్వామి అరుున డోవీ ఫ్రాన్సెస్ ఈ పాలసీని విక్రరుుంచారు. అమెరికా వినోద పరిశ్రమ ప్రముఖుని పేరిట ఇప్పటివరకు ఈ రికార్డు ఉంది.