Call Girls
-
హైటెక్ సెక్స్ రాకెట్
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో దేశ, విదేశీ మహిళలను ఆకర్షించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పలు వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం 14,190 మంది యువతుల ఫొటోలు, వివరాలు పెట్టి.. కాల్‌సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తున్న ఈ గ్యాంగ్.. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా ఈ దందా సాగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్ సహా 18 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఈ ముఠా వివరాలను ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ దార కవితతో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ కవిత హోటల్ వర్కర్‌గా పనిచేస్తూ వ్యభిచారం దందా వైపు.. బేగంపేటకు చెందిన మహ్మద్ సల్మాన్ ఖాన్ అలియాస్ సమీర్ 2016–19 మధ్యకాలంలో సోమాజిగూడలోని కత్రియా, పార్క్ హోటళ్లలో పనిచేశాడు. అప్పట్లో వ్యభిచార ముఠా బాధితురాలు ఒకరు ఓ హోటల్లో బస చేయడం గమనించిన సమీర్..సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్స్ అలవాటు ఉన్న సమీర్‌కు మరో డ్రగ్ వినియోగదారుడు, మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన మహ్మద్ అదీమ్ అలియాస్ అర్నవ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి 2016 నుంచి సోమాజిగూడ కేంద్రంగా వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టారు. వీరితో పాటు మొత్తం 17 మంది ప్రధాన ఆర్గనైజర్లు వేర్వేరు రాష్ట్రాలలో వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా దందా సాగిస్తున్నారు. ఒక్కో వాట్సాప్ గ్రూప్‌లో 300 మంది ఆర్గనైజర్లు సభ్యులుగా ఉన్నారు. వీటిద్వారా మొత్తం 14,190 మంది యువతులతో వ్యభిచారం సాగిస్తున్నారు. ముఠా దొరికింది ఇలా... ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన యువతులను విచారించిన పోలీసులు.. గత నెల 15న బేగంపేటకు చెందిన సల్మాన్, పీఅండ్‌టీ సన్‌సిటీకి చెందిన మహ్మద్ అబ్దుల్ కరీంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఆర్గనైజర్ల జాబితా వెలుగులోకి వచ్చింది. దీంతో యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ టీమ్‌తో బృందాన్ని ఏర్పాటు చేసి.. సల్మాన్, కరీంతో పాటు పలువురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్‌తో పాటు మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన అర్నవ్, టోలిచౌకికి చెందిన మహ్మద్ సమీర్, సోమాజిగూడకు చెందిన హర్బిందర్ కౌర్ అలియాస్ సిమ్రాన్ కౌర్, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన యరసారి జోగేశ్వర్రావు, బాలానగర్‌కు చెందిన నడింపల్లి సాయిబాబా గౌడ్, సన్‌సిటీకి చెందిన శైలేంద్ర ప్రసాద్, యూసుఫ్‌గూడకు చెందిన మహ్మద్ అఫ్సర్, కూకట్‌పల్లికి చెందిన పసుపులేటి గంగాధరి, ఆసిఫ్‌నగర్‌కు చెందిన రిషీ, బీరంగూడకు చెందిన కోడి శ్రీనివాస్, గోల్కొండకు చెందిన అలీసామ్, అనంతపురానికి చెందిన మహ్మద్ ఫయాజ్, కర్ణాటకకు చెందిన విష్ణు, సాయి సుధీర్, ఒడిశాకు చెందిన సర్భేశ్వర్ రౌట్లు ఉన్నారు. వీరు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లలో 39 కేసులలో నిందితులుగా ఉన్నారు. తాజాగా వీరిపై గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి ఠాణాలలో ఐదు కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.95 వేల నగదుతో పాటు 34 సెల్ఫోన్లు, 3 కార్లు, ల్యాప్‌టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ (మాదకద్రవ్యం)ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఆధార్లు.. విటులతో సంప్రదింపుల కోసం నిర్వాహకులు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కోల్‌కతా, అసోం రాష్ట్రాల యువతులతో పాటు థాయ్‌లాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, రష్యా దేశాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విదేశీ మహిళలకు నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు సృష్టించి వివిధ నగరాలకు తరలిస్తున్నారు. దందా సాగుతోందిలా.. ఆర్గనైజర్ల కింద ఉండే బ్రోకర్లు ఉద్యోగా లిప్పిస్తామంటూ పేద మహిళలకు ఎర వేస్తా రు. వారి వివరాలను సేకరిస్తారు. ఆపై బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతా రు. విటులను ఆకర్షించేందుకు బాధిత అమ్మాయిల ఫొటోలు, ఇతర వివరాలు దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లలో పెడతారు. లొకాంటో, స్కోక్కా, మైహెవెన్మోడల్స్.కామ్ నటాషారాయ్. ఇన్ వంటి కాల్‌గర్ల్స్ వెబ్సైట్లలోనూ వాటిని పోస్ట్ చేస్తారు. వీటిని చూసిన విటులు తమకు నచ్చిన యు వతుల కోసం అందులోని వాట్సాప్ నంబ ర్లకు ఫోన్ చేస్తారు. కాల్ సెంటర్ల ప్రతినిధు లు అమ్మాయిల వివరాలు, రేట్లను తెలిపి.. ఏ హోటల్‌కు వెళ్లాలో సూచిస్తారు. ఓకే అనుకున్నాక ఆ ప్రతినిధి విటుడిని ఆర్గనైజర్‌తో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తారు. డీల్ కుది రాక స్టార్ హోటళ్లలో గదులు, ఓయో రూ మ్స్, అవసరమైతే విమాన టికెట్లు బుక్ చేస్తారు. విటులు నగదు లేదా ఆన్లైన్లో చెల్లింపులు చేయాలి. అందులో 30% యువతికి, 35% అమ్మాయిల ఫొటోలను ప్రచారం చేసేవారికి, కాల్‌సెంటర్ ప్రతినిధులకు ఇస్తా రు. 35 శాతం నిర్వాహకులు వాటాలుగా పంచుకుంటారు. ఈ దందాలో ఒక్కో ఆర్గనైజర్ రూ.40 లక్షల వరకు ఆదాయం ఆర్జించినట్లు డీసీపీ కవిత తెలిపారు. -
కాల్‌గర్ల్స్‌ను సరఫరా చేస్తామని ఎర.. వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపి..
కర్నూలు: కాల్‌గర్ల్స్, అశ్లీల స్త్రీల వీడియో కాల్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ కళా వెంకటరమణ మీడియాకు వివరించారు. కర్నూలు మండలం మిలటరీ కాలనీకి చెందిన తెలుగు జనార్ధన్, అలాగే శ్రీరామనగర్‌కు చెందిన బెస్త ప్రవీణ్‌కుమార్ కొంతకాలంగా సాధారణ ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కాల్‌గర్ల్స్‌ను సరఫరా చేస్తామని, అశ్లీల వీడియో కాల్స్ చేయిస్తామని రూ. 300 నుంచి రూ. 5,000 వరకు ఖర్చు అవుతుందని ఎర వేస్తారు. ఒకేసారి వాట్సప్‌లో యాప్స్‌ను ఉపయోగించి 100 నుంచి 1000 మంది వరకు బల్క్ మెసేజ్‌లు పంపుతారు. ఎవరైనా ఆకర్షితులైతే వారిని మభ్యపెట్టి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పటికే ఎంతోమంది వీరికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయినట్లు ఇటీవల కాలంలో బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై దృష్టి సారించిన వన్‌టౌన్ సీఐ దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో జొహరాపురం సబ్ స్టేషన్ వద్ద నిందితుడు తెలుగు జనార్ధ్దన్ ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. మరో నిందితుడి వివరాలు చెప్పడంతో మాంటిస్సోరి స్కూల్ వద్ద ప్రవీణ్‌కుమార్‌తో పాటు నిందితులు వాడిన సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి బ్యాంక్ అకౌంట్లను ఇప్పటికే గుర్తించామన్నారు. రోజూ రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. యువత ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. -
ఆన్లైన్లో హీరోయిన్లు.. ఒక్కొక్కరికి ఒక్కో రేటు.!
సాక్షి, హైదరాబాద్: మీకు ఇష్టమైన నటీ మనులతో గడపాలనుకుంటున్నారా.. అయితే మా వెబ్‌సైట్‌ని సందర్శించండి. మీకు ఇష్టమైన నటీమణులు మీరు కోరుకున్న చోటుకే వస్తారంటూ.. ఒక్కొక్కరి ఫోటో కింద ఒక్కో రేటు నిర్ణయించి లొకాండో అనే వెబ్సైట్ ద్వారా ఓ సైబర్ నేరస్థుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. సినీ హీరోయిన్లు కాల్ గర్ల్స్‌గా వస్తారంటూ వెబ్సైట్ ప్రచారం చేస్తున్నాడు. అయితే తన ఫోటో లొకాండో వెబ్సైట్లో ఉందని తెలుసుకున్న ఓ నటి బుధవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోటోషూట్‌లో భాగంగా తీసుకున్న ఫోటోలను సేకరించి వెబ్సైట్లో ఉంచారని, ఆమెను కాల్ గర్ల్‌గా చిత్రీకరించి రూ.40 వేలు ధర నిర్ణయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెబ్సైట్ వివరాలు సేకరించి నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. చొక్కారపు గణేష్ అనే వ్యక్తి మాజీ ప్రిన్సిపాల్ ఆన్లైన్ మాధ్యమంగా తెలుగు సినిమా మహిళా నటుల ఫొటోలు పెట్టి, వారితో గడిపేందుకు వెలకడుతున్నట్లు తెలిసింది. అయితే తనపై ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలుసుకున్న గణేష్, ఆ నటి ఫోటోలను డిలీట్ చేశాడని వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మూడు నెలల నుంచి గణేష్ ఇలా చేస్తున్నాడని, నటీమణుల ఫోటోలతో ఆన్లైన్ మాద్యమంగా విటుల నుంచి రూ. 2 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గణేష్ పెట్టిన పోస్టింగ్స్‌లో కేవలం హీరోయిన్ల ఫొటోలు మాత్రమే కాకుండా, కొంతమంది కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా ఉన్నాయన్నాయని తెలిపారు. -
హైదరాబాద్‌లో విదేశీ కాల్ గర్ల్స్
హైదరాబాద్ లో విదేశీయుల సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. పోర్న్ వైబ్ సైట్లపై నిఘా పెట్టిన పోలీసులకు గుట్టుగా సాగుతున్న విదేశీయుల వ్యభిచార ముఠా పట్టుబడింది. టాంజానియా గళ్ల్స్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే.. విజిటింగ్ వీసాలపై హైదరాబాద్ లో దిగుతున్నారు. మూడునెలల పాటు మూడు రాళ్లు వెనకేసుకుని ప్లైట్ ఎక్కుతున్నారు.. విదేశీ కాల్ గర్ల్స్ పై ప్రత్యేక కథనం .. భాగ్యనగరం విదేశీయులను ఆకట్టుకుంటుంది. మొన్న డ్రగ్స్ రాకెట్ .. నేడు విదేశీ సెక్స్ రాకెట్. రోజుకో కొత్త తరహా నేరాలు అడ్డాగా మారిపోతోంది. పోర్న్ వైబ్ సైట్ల ద్వారా విటులను ఎరవేస్తున్న ఓ గ్యాంగ్ గుట్టును తాజాగా రాచకొండ పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం ముఠాలు కొత్త పంథాలో విటులకు గాలం వేస్తున్న విషయాన్ని గుర్తించిన రాచకొండ పోలీసులు.. పోర్న్ సైట్లపై దృష్టిపెట్టారు. లోకాంటో.కామ్ అనే అశ్లీల వెబ్ సైట్లలో అమ్మాయిల అర్థనగ్న ఫోటోలు అప్లోడ్ చేసి ఓ ధరను పెట్టి.. విటులకు కోసం ఫోన్ నంబర్లను కూడా పోస్టుచేసినట్టు గుర్తించారు. ఈ ఆన్ లైన్ బ్రోతల్ గ్యాంగ్ పై రాచకొండ, కుషాయిగూడ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. వైబ్ సైట్ లోని నెంబర్ కు కాల్ చేశారు. వాళ్లు సూచించిన అడ్రసుకు వెళ్లారు. ఆ గదిలో ఉన్న ఇద్దరు టాంజానియా దేశ యువతులతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువతులు టాంజానియా దారుస్సలానికి చెందిన యువతులు హ్యాపీనెస్ క్షుక, లిలియన్ రేమండ్‌గా గుర్తించారు. వారితోపాటు పారనాయిడ్ అలెక్స్ కియాండో విజిట్ వీసాపై మూడు నెలల కిందట హైదరాబాద్ కు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరు ముగ్గురు కుషాయిగూడ ఠాణా పరిధిలోని కందిగూడ హస్తినాపురంలో ఓ పెంట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. తమ అర్థనగ్న చిత్రాల్ని ఓ అశ్లీల వెబ్సైట్లో నమోదు చేశారు. ఆ వెబ్సైట్లో వారిని సంప్రదించే విటుల నుంచి 20 వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ యువతులు తమ దేశానికి చెందిన అలెక్స్‌తో కలిసి ఇతర విదేశీ మహిళలను కూడా ఈ రొంపిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వీరి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురికి ఇతర విదేశీయులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వీరు వ్యభిచారంతో పాటు మత్తు పదార్థాల అక్రమ వ్యాపారాలు చేస్తున్నారా? ఆ ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయనే అనే అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. -
తిరువళ్లూరులో కాల్‌గర్ల్స్
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరువళ్లూరులో కాల్ గర్ల్స్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. తిరువళ్లూరులోని శ్రీ వీరరాఘవస్వామి ఆలయం దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి అమావాస్యకు వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. దీంతో ఇక్కడ వ్యభిచార కూపాలు విస్తరిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా శుక్రవారం రాత్రి ఏడుగురు వ్యభిచార నిర్వాహకులు పట్టుబడ్డారు. పది మందికిపైగా ఆంధ్రాకు చెందిన బాలికలు విముక్తి పొందారు. తిరువళ్లూరు : తిరువళ్లూరు సమీపంలోని కాకలూరు వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న వేపంబట్టుకు చెందిన ప్రియా, తిరుపతికి చెందిన మహాలక్ష్మి, నెల్లూరుకు చెందిన రమాదేవితోపాటు మరో నలుగురు బ్రోకర్లను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల విచారణ లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్రోకర్లు పేదరికంలో ఉన్న బాలికలపై దృష్టి పెడతారు. ఆ తరువాత వారికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తిరువళ్లూరుకు రప్పించి వ్యభిచార కూపంలో దింపుతున్నట్టు విచారణలో తేలింది. రెండువారాల నుంచి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో పది మంది బాలికలు ఈ కూపం నుంచి బయటపడగా, వీరందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సరైన ఉపాధి లేకపోవడం వలన, ఉద్యోగం ఆశ చూపి 15 నుంచి 17 ఏళ్ల బాలికలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి రోజుకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఇస్తున్నారు. అయితే వీరిని అడ్డంగా పెట్టుకుని వ్యభిచార గృహ నిర్వాహకులు లక్షల్లో సంపాదిస్తున్నారని వివరించారు. బాలికలను వ్యభిచార కూపంలో దింపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి బాలికలను అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు.