కాల్ నాణ్యత కోసం ట్రాయ్ యాప్
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టిన టెలికం రంగ నియంత్రణ సంస్థ తాజాగా కాల్ నాణ్యతను సమీక్షించేందుకు ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తేనుంది. కాల్ పూర్తయిన తర్వాత సబ్స్క్రయిబర్స్.. సేవల నాణ్యతకు రేటింగ్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడనుంది.
అలాగే మొబైల్ యూజర్లకు టెలీమార్కెటర్స్ బెడద తప్పించే దిశగా ’డు నాట్ డిస్టర్బ్’ రిజిస్ట్రీని మరింత పటిష్టం చేయనుంది. ట్రాయ్ ఏర్పాటై ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ విషయాలు తెలిపారు. ఇప్పటికే డీఎన్డీ రిజిస్ట్రీ అమల్లో ఉంది. ఇందులో నమోదు చేసుకున్న సబ్స్క్రయిబర్స్కు కాల్స్ చేసే టెలీమార్కెటింగ్ కంపెనీలకు భారీగా జరిమానాలకు ఆస్కారం ఉంది.