జీవో నెంబర్ 777ను ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 777 ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఆర్ జేఏసీ) డిమాండ్ చేసింది. ప్రభుత్వం జీవో నం 777 విడుదలతో పాటు తదనంతరం ఈ నెల 16వ తేదీన మెమో నం. జీఏడీ 5455ను ఇచ్చిందని దీన్ని తెలంగాణ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
మిషన్ కాకతీయ కార్యక్రమం చాలా మంచిదని, అందుకే రెవెన్యూ ఉద్యోగులందరం కలిసి ఒక రోజు వేతనం రూ.1 కోటి 50 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చామన్నారు.