చంద్రబాబు పర్యటన రద్దు
విశాఖ రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన రద్దయింది. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి ముందు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30, 31 తేదీలో ఆయన జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నక్కపల్లి ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. సీఎం పర్యటన కోసం వారం రోజులుగా అధికారులు హైరానా పడ్డారు.
బహిరంగ సభల వేదిక ఏర్పాట్లను కూడా దాదాపుగా పూర్తి చేశారు. జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారానికి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు, నివేదికలు తయారు చేశా రు. సీఎంకు అందించాలని భావిం చారు. అయి తే చివరి నిమిషంలో భారీ వర్ష సూచన కారణం గా చంద్రబాబు పర్యటన రద్దయింది. అయితే వచ్చే నెలలో సీఎం జిల్లాలో పర్యటించే అవకాశముందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.