కాన్సర్ చికిత్సలో టోమోథెరపీ లాంచ్
హైదరాబాద్: క్యాన్సర్ నివారణ చికిత్సలో అడ్వాన్స్ డ్ `టోమోథెరపీ' ప్రక్రియను ప్రారంభించినట్టు అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఈ అధునాతన రేడియేషన్ డెలివరీ సిస్టమ్' ను తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీ రామారావు హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా లాంచ్ చేశారు. ఆసుపత్రిలోని ఆంకాలజీ విభాగానికి అనుబంధాన్ని దీన్ని ప్రారంభించారు. క్యాన్సర్ ట్యూమర్ ఆకారాన్ని బట్టి రేడియోధార్మిక మోతాదును ధ్రువీకరించడం ద్వారా ఖచ్చితమైన క్యాన్సర్ చికిత్సకు ఇది అనుమతిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ పధ్ధతిలో రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల, మల, మెదడు క్యాన్సర్ కణితులను కచ్చితంగా గుర్తిస్తుందనీ, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో వ్యాధిని నయం చేయవచ్చని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. ప్రపంచస్తాయి వైద్యసేవలను అందిస్తామన్న తమ వాగ్దానంలో భాగంగా తరువాతి తరం క్యాన్సర్ చికిత్సా విధానాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.
ఈ ఆల్ ఇన్ వన్ సిస్టం ఎక్కువ కచ్చితత్వంతో పాటు, ఆరోగ్యకరమైన కణజాలానికి అతి తక్కువ హాని తో రేడియేషన్ చికిత్స అందుతుందని వైద్యులు వివరించారు.ఈ సందర్భంగా ఒలింపిక్స్ రజత పతక విజేత పీసీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ లను సన్మానించారు.