Cancer Therapy
-
క్యాన్సర్.. ఫాలో అప్ల ప్రాధాన్యమెంత? ఇదిగో ఇంత!
Importance Of Follow-Up Care: క్యాన్సర్ అన్న పదం వింటేనే ఎంతో ఆందోళన. అయితే.. త్వరగా వ్యాధి నిర్ధారణ జరిగి.. రకాన్ని బట్టి చికిత్స రేడియోథెరపీనా, కీమోథెరపీనా లేక శస్త్రచికిత్సా అన్నది నిర్ణయించాక, ఆ తర్వాత ఫాలో అప్లన్నీ సరిగ్గా జరుగుతుంటే దాన్ని తేలిగ్గానే అదుపు చేయవచ్చు. క్యాన్సర్ చికిత్సలో ఫాలోఅప్‌ల ప్రాధాన్యమేమిటో తెలుసుకుందాం. క్యాన్సర్‌కు ఇదమిత్థంగా ఇలాగే అంటూ నిర్దిష్ట చికిత్స ఇవ్వడం సాధ్యం కాదు. క్యాన్సర్ రకంతో పాటు మరెన్నో అంశాలు చికిత్స జరగాల్సిన తీరును నిర్ణయిస్తాయి. ఫాలో అప్ అంటే డాక్టర్లు నిర్ణయించిన సమయాల్లో తర్వాత్తర్వాతి చికిత్సలకు హాజరుకావడంగా చెప్పవచ్చు. అవి... ప్రధాన చికిత్స తర్వాత... నిర్ణీత వ్యవ«ధుల్లో అంచెలంచెల్లో జరుగుతుంటాయి. ఇవి కేవలం ప్రధానంగా చికిత్స విషయంలోనే కాదు... బాధితుడికి మానసికంగా, సామాజికంగా... వ్యాధి ముదరకుండా చూడటం ద్వారా ఆర్థికంగా కూడా సాంత్వన ఇస్తాయి. చదవండి: ఆర్థరైటిస్ నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వద్దు! ఈ ఫాలో అప్‌లో రక్తపరీక్షల వంటివి మాత్రమే కాకుండా... దేహంలో వచ్చే ఇతరత్రా మార్పులను పసిగట్టడానికి రకరకాల పరీక్షలు అవసరమవుతూ ఉంటాయి. సాధారణంగా మిగతా వ్యాధుల చికిత్సలతో పోలిస్తే ఇవి చాలాకాలం పాటు అలా కొనసాగుతూ ఉండటమనే అంశం కూడా రోగి మానసిక స్థైర్యానికి పరీక్ష పెడుతుంటుంది. అందుకే క్యాన్సర్ బాధితులకు మానసిక బలం కూడా చాలా అవసరమని అందరూ గుర్తించాలి. ఫాలో అప్ ప్లాన్ ఎలా ఉంటుందంటే.. క్యాన్సర్ రోగులందరికీ చికిత్స ఒకేలా ఉండనట్లే... ఫాలో అప్లు కూడా నిర్ణీతంగా ఉండవు. అవి చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. బాధితుడికి ఉన్న క్యాన్సర్ రకం, అతడికి ఇచ్చే చికిత్స (రేడియోథెరపీయా / కీమోథెరపీనా / శస్త్రచికిత్సా?... మొ.) రోగి సాధారణ ఆరోగ్యం /చికిత్స ఇచ్చాక అతడిక పరిస్థితులు మొదలైనవి. అందరి విషయంలో ఒకేలా ఉండకపోయినా.. ఫాలో అప్లలోనూ కొన్ని సాధారణ సామ్యతలు కనిపిస్తాయి. ఉదాహరణకు... చికిత్స పూర్తయిన మొదట్లో నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో మొదటిసారీ, ఆ తరువాత ప్రతీ 3 – 4 నెలలకు ఒకసారి చొప్పున ఆంకాలజిస్టులను కలవాల్సి రావచ్చు. ఆ తర్వాత ప్రతి మూడు లేదా నాలుగు నెలలకోసారి చొప్పున కలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెరుగుదలను బట్టి ప్రతి ఏడాదికోసారి లేదా రెండుసార్లు ఉండవచ్చు. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా.. చికిత్స తర్వాత ఉద్భవించే ప్రశ్నలు... ప్రధాన చికిత్స తర్వాత ఫాలో అప్ల సమయంలో రోగిలో వచ్చే కొన్ని సందేహాలివి... ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ డాక్టర్‌ను తప్పక అడిగి తెలుసుకోవాలి. ► పూర్తిగా కోలుకోడానికి ఎంత సమయం పట్టవచ్చు? ►ఎలాంటి లక్షణాలూ లేదా చిహ్నాలు కనిపిస్తే డాక్టర్‌ను వెంటనే కలవాలి? ►చికిత్స తర్వాత తరచూ చేయించాల్సిన ప్రధాన పరీక్షలేమిటి? అవెంత తరచుగా చేయించాలి? ►ప్రధాన చికిత్స తర్వాత దీర్ఘకాలంలో కనిపించే సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి? ►మళ్లీ తిరగబెట్టడానికి అవకాశం ఉందా? అయితే... అవకాశం ఎంత? ►ఏయే డాక్యుమెంట్లు / ఏయే పరీక్షల ఫలితాల రిపోర్టులు జాగ్రత్తగా ఉంచాలి? ►మళ్లీ మునపటిలాంటి ఆరోగ్యం పొందడం సాధ్యమా? పొందాలంటే ఏం చేయాలి? ►గ్రూప్హెల్ప్ పొందడానికి తమలాంటి వాళ్లు ఇంకెవరైనా ఉన్నారా? ఫాలో అప్ సమయంలో డాక్టర్‌తో చెప్పాల్సినవి... ఫాలో అప్ సమయంలో డాక్టర్‌ను కలిశాక బాధితుడు తమ సమస్యలన్నీ ఏమీ దాచకుండా... పూర్తిగా పారదర్శకంగా డాక్టర్‌తో మాట్లాడాలి. కేవలం లక్షణాల గురించే కాదు... శారీరక, మానసిక బాధలు, వ్యాధి సంబంధిత కష్టాలు, ఉద్వేగాలు... ఇవన్నీ దాచకుండా చెప్పాలి. అంతకు ముందు కనిపించని కొత్త లక్షణాలు ఏమైనా ఉంటే అవి కూడా వివరించాలి. అయితే అవన్నీ క్యాన్సర్‌కు సంబంధించినవేనా అనే ఆందోళన ముందే వద్దు. అవి క్యాన్సర్వి కాకపోవచ్చు కూడా. ఎందుకంటే కొందరిలో చికిత్సకు సంబంధించిన కొన్ని అంశాలు/ప్రభావాలు చికిత్స పూర్తయిన చాలా కాలం తర్వాత బయటకు కనిపించవచ్చు. అందుకే అవి క్యాన్సర్ సంబంధించినవా / సంబంధించనివా, లేదా అన్న సంశయానికి తావివ్వకుండా అన్నీ చెబితే... రోగి చాలా ఆందోళన పడేది అసలు సమస్యే కాదనే విధంగా దూదిపింజలా ఎగిరిపోవచ్చు. డాక్టర్‌కు ఇంకా చెప్పాల్సినవి... ►బాధితుడికి రోజువారీ ఎదురయ్యే సమస్యలు... ఉదాహరణకు తన ఆకలి, అలసట, మూత్రసంబంధిత అంశాలు, లైంగికంగా ఎదురయ్యే సమస్యలూ, సందేహాలు, ఏకాగ్రత కుదురుతుందా, జ్ఞాపకశక్తిలో మార్పులేమైనా వచ్చాయా, నిద్రకు సంబంధించినవి, బరువు పెరుగుతున్నారా/తగ్గుతున్నారా... లాంటివి. ►ఇతరత్రా సమస్యలకు సంబంధించి వాడుతున్న మందులు / మార్పు చేసిన మందులు, మూలికలూ, ఔషధమొక్కలకు సంబంధించినవి (హెర్బ్స్) ఏమైనా వాడారా? ►కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీలో) వచ్చిన మార్పులు ►భావేద్వేగాల విషయంలో వచ్చిన మార్పులు / వ్యాకులత / కుంగుబాటు వంటి మానసిక బాధల గురించి అడగాలి. ►ఇవన్నీ అడుగుతూ... జీవనశైలి విషయంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో, చెడు వ్యసనాలకు పూర్తిగా దూరం గా ఉంటే... మిగతా అందరిలాగే క్యాన్సర్ బాధితులు కూడా పూర్తి ఆరోగ్యంతో, దాదాపు సాధారణ వ్యక్తుల ఆయుఃప్రమాణాలకు తగ్గకుండా జీవించవచ్చు. -డాక్టర్ అజయ్ చాణక్య వల్లభనేని,కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ -
రోజుకో మాత్రతో కేన్సర్ ఔట్!
ప్రాణాంతక కేన్సర్‌కు చికిత్స లభించిందా? ఒళ్లు గుల్ల చేసే థెరపీలు లేకుండానే రోజుకో మాత్రతో నయమవుతుందా? ఈ ప్రశ్నలకు ఆస్ట్రేలి యా శాస్త్రవేత్తలు ఔననే సమా« ధానమే ఇస్తున్నారు. వెన్‌క్లెక్‌స్టా పేరుతో తాము తయారు చేసిన ఈ మా త్రలను రోజుకొకటి వేసుకుంటే చాలు.. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుం డానే కేన్సర్‌ను మటుమాయం చేయవచ్చని మెల్బోర్న్ కేంద్రంగా పనిచే స్తున్న వెనెటోక్లాక్స్ కంపెనీ ప్రకటించింది. ఈ ఔషధానికి ఆస్ట్రేలియా థెరప్యూటిక్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీఏ) అనుమతి కూడా లభించిందట. కేన్సర్‌కు శస్త్రచికిత్స, కీమో, రేడియోథెరపీల వంటి వైద్య విధానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వ్యయ, ప్రయాసలతో కూడుకున్నవే. ఈ నేపథ్యంలో వెనెటోక్లాక్స్ ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కేన్సర్ కణాల్లో బీసీఎల్–2 ప్రొటీన్ ఉంటుంది. వ్యాధి కారక కణాలు బతికి ఉండేందుకు ఈ ప్రొటీనే కారణం. దాన్ని నిర్వీర్యం చేసేందుకు 30 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. ఫలితం రాలేదు. అయితే వెనెటోక్లాక్స్కు చెందిన డాక్టర్ డేవిడ్ హువాంగ్ ఈ విషయంలో విజయం సాధించారు. బీసీఎల్–2 ప్రొటీన్ పనిచేయకుండా చేయడమే కాకుండా.. కేన్సర్ కణం మరణించేలా ఔషధాన్ని రూపొందించారు. దీన్ని రోజుకో మాత్ర రూపంలో తీసుకుంటే సరిపోతుందని హువాంగ్ అంటున్నారు. లింఫోసైటిక్ ల్యూకేమియాతో బాధపడుతున్న 70 మందిపై ఈ మందును ప్రయోగించగా... వారిలో 20 శాతం మందిలో కేన్సర్ పూర్తిగా మాయమైందని, 80 శాతం మందిలో మెరుగైన ప్రభావం చూపిందని విక్టోరియన్ కాంప్రహెన్సివ్ కేన్సర్ సెంటర్ హెమ టాలజిస్ట్ డాక్టర్ మార్యన్ అండర్సన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఔషధాన్ని రక్త సంబంధిత కేన్సర్ల చికిత్సకు ఉపయోగిస్తు న్నా.. ఇతర కేన్సర్ కణా ల్లోనూ బీసీఎల్–2 ప్రొటీన్ ఉంటుంది కాబ ట్టి వాటిపైనా మెరుగైన ప్రభావం చూపే అవకాశమున్నట్లు అంచనా. వెన్‌క్లెక్‌స్టా వినియోగానికి ఆమెరికా, యూరోపియన్ యూనియన్లు అనుమతులిచ్చినట్లు హువాంగ్ తెలిపారు. -
పాత్ర గోడలపైకి ఎగబాకే ద్రవం ఏది?
జడవాయువులు ఆవర్తన పట్టికలో చివరి గ్రూపునకు (18వ) గ్రూపు) చెందిన మూలకాలకు రసాయన జడత్వాన్ని ప్రదర్శించే ధర్మం ఉంటుంది. అందువల్ల వీటిని ‘జడవాయువులు’ అంటారు. ఈ మూలకాలున్న గ్రూపును ‘సున్నా గ్రూపు’ అని కూడా అంటారు. జడవాయువులు: ఇవి మొత్తం ఆరు మూలకాలు. అవి: హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, గ్జీనాన్, రేడాన్. వీటిలో చివరిదైన రేడాన్ తప్ప మిగిలినవన్నీ వాతావరణంలో అత్యల్ప పరిమాణంలో ఉంటాయి. అందువల్ల వీటిని ‘విరళ వాయువులు’ (ఖ్చట్ఛ జ్చట్ఛట) అని కూడా అంటారు. ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ జడవాయు మూలకంతో అంతమవుతుంది. వీటి బాహ్య కక్ష్యలు పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉంటాయి. ఈ మూలకాలకు ఏమాత్రం చర్యాశీలత ఉండదు. అందువల్ల వీటిని ‘ఉత్కృష్ట వాయువులు’ అని కూడా అంటారు. రేడాన్ అనేది రేడియో ధార్మిక మూలకం. ఆవిష్కరణ: జడవాయువుల ఆవిష్కరణ ఒక్కరోజులో జరిగింది కాదు. దీనికి ఒక శతాబ్దకాలం పట్టింది. వీటి ఆవిష్కరణ చాలా వైవిధ్యంగా జరిగింది. నామకరణం విషయంలోనూ ప్రత్యేకతలున్నాయి. రామ్సే, రేలీ అనే శాస్త్రవేత్తలు సమగ్ర అధ్యయనం జరిపి, జడవాయువులను ఆవిష్కరించారు. వీటిపై చేసిన పరిశోధనకుగాను వీరికి నోబెల్ బహుమతి కూడా లభించింది. 1868లో సంపూర్ణ గ్రహణం ఏర్పడినప్పుడు, సూర్యుని క్రోమోస్ఫియర్పై పరిశోధన జరిపి జన్సెన్, లాకియర్ అనే శాస్త్రవేత్తలు కొత్త మూలకాన్ని కనుగొన్నారు. దీనికి ‘హీలియం’ అని పేరు పెట్టారు. ఏ్ఛజీౌట అంటే సూర్యుడు అని అర్థం. 1785లో గాలిలోని అనుఘటక వాయు వులను వేరుచేస్తూ దేనితోనూ చర్యజరపని ఒక వాయువు గురించి పేర్కొన్నారు. ఒక శతాబ్దం తర్వాత 1891లో రేలీ అనే శాస్త్రవేత్త వాతావరణంలోని నైట్రోజన్‌లో ఈ కొత్త వాయువును కనుగొన్నాడు. దీనికి ‘ఆర్గాన్’ అని పేరు పెట్టాడు. అటజౌ అంటే సోమరి అని అర్థం. మిగిలిన జడవాయువులను కూడా వాతా వరణంలోని నైట్రోజన్ నుంచే వేరు చేశారు. నియాన్‌ను రామ్సే, ట్రావెర్స; క్రిప్టాన్, గ్జీనాన్ను రామ్సే కనుగొన్నారు. ూౌ్ఛ అంటే ‘కొత్త’ ఓటడఞ్టౌ అంటే ‘దాగి ఉన్న’, గీౌ్ఛ అంటే ‘పరిచయం లేనిది’ అని అర్థం. 1900లో రేడియోధార్మిక రేడియో విఘటనం చెందితే రేడాన్ వాయువు వస్తుందని రామ్సే తెలిపాడు. రేడాన్ తప్ప మిగిలిన వాయువులు స్వేచ్ఛా స్థితిలో నక్షత్రాల్లో, భూ వాతావరణంలో, గాలిలో, కొన్ని ఖనిజాల్లో అంతర్బంధిత స్థితిలో ఉంటాయి. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే జడవాయువు ఆర్గాన్, అత్యల్ప పరిమాణంలో ఉండేది హీలియం. ద్రవ హీలియం ప్రత్యేకత: హీలియంను 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద 2.2 ఓ (ృ 270.8 నిఇ) ఉష్ణోగ్రతకు చల్లబరిస్తే ‘హీలియం-ఐఐ’ అనే ద్రవరూప హీలియం లభిస్తుంది. దీని స్నిగ్ధత చాలా తక్కువ. ఇది సాధారణ ద్రవాల్లా కిందికి ప్రవహించడానికి బదులుగా పాత్రగోడలపైకి ఎగబాకుతుంది. జడవాయువుల ఉపయోగాలు హీలియం: ఇది హైడ్రోజన్ తర్వాత అత్యంత తేలికైన వాయువు. ఆవర్తన పట్టికలో రెండో స్థానాన్ని (పరమాణు సంఖ్య 2, ద్రవ్యరాశి సంఖ్య 4) ఆక్రమిస్తుంది. హీలియం వాయువుకు మండే గుణం లేదు (దహనశీలి కాదు). కాబట్టి దీన్ని వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో వాడతారు. సముద్రాల్లో లోతుకు వెళ్లే గజ ఈతగాళ్లు (ఈ్ఛ్ఛఞ ్ఛ్చ ఈజీఠ్ఛిటట) శ్వాస కోసం వాడే ఆధునిక పరికరాల్లో గాలి స్థానంలో 80 శాతం హీలియం, 20 శాతం ఆక్సిజన్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. సహజ గాలిలో ఉండే నైట్రోజన్, సముద్ర లోతుల్లో ఉండే అధిక పీడనాల వద్ద రక్తంలో కరిగి బెండ్స (ఆ్ఛఛీట)ను కలుగజేస్తుంది. అందువల్ల దీన్ని ఉపయోగించరు. ఉబ్బసం (ఆస్తమా) వ్యాధిగ్రస్థులు ఉపశమనం కోసం హీలియం, ఆక్సిజన్ల మిశ్రమాన్ని వాడతారు. పరమశూన్య ఉష్ణోగ్రత (0 ఓ లేదా ృ 273 నిఇ) వద్ద పరిశోధనలు చేయడానికి, అల్ప ఉష్ణోగ్రతలను పొందడానికి ద్రవ హీలియాన్ని క్రయోజనిక్ ద్రవంగా వాడతారు. అల్ప ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్లలో హీలియంను ఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టర్లలో ఉష్ణబదిలీ కోసం ఇది మాధ్యమంగా ఉపయోగపడుతుంది. విద్యుత్ ట్రాన్సఫార్మర్లలో హీలియంను ఉపయోగిస్తారు. చర్యాశీలత ఉన్న మెగ్నీషియం వంటి లోహాల తయారీలో, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీలు వంటి వాటిని వెల్డింగ్ చేసేటప్పుడు జడ వాతావరణాన్ని కల్పించడానికి హీలియం వాయువును వాడతారు (అధిక ఉష్ణోగ్రతల వద్ద గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది). నియాన్: అల్ప పీడనాల వద్ద నియాన్ బల్బులు ముదురు ఎరుపు రంగు కాంతిని వెలువరుస్తాయి. ఈ కాంతి పొగమంచు నుంచి కూడా చొచ్చుకొని పోతుంది (కనిపిస్తుంది. దీన్ని సిగ్నల్ లైట్లలో, ఓడరేవుల్లో, బెకన్ లైట్లలో, విమానాశ్రయాల్లో పైలట్లకు దారిచూపే దీపాలుగా ఉపయోగిస్తారు. దీనికి అధిక వోల్టేజీని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి రెక్టిఫయర్లలో వాడతారు. ఆర్గాన్: వెల్డింగ్‌లు చేసేటప్పుడు జడ వాతావరణాన్ని కల్పించడానికి దీన్ని ఉపయోగిస్తారు. టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బుల్లో జడ వాతావరణాన్ని కల్పించడానికి (ఆక్సిజన్ ఉంటే ఫిలమెంట్ మండి కాలిపోతుంది) వాడతారు. ఉత్సర్గ నాళికల్లో, గైగర్ కౌంటర్ ట్యూబుల్లోనూ వినియోగిస్తారు. క్రిప్టాన్: గని కార్మికుల టోపీ లైట్లలో (మైనర్స క్యాప్‌లలో) వాడతారు. ఎలక్ట్ట్రానిక్ ట్యూబుల్లో వోల్టేజీని క్రమ బద్ధీకరించడానికి, లోహ పలకలు, జాయింట్ల మందాన్ని కొలవడానికి ప్టాన్-85ను ఉపయోగిస్తారు. వాణిజ్యప్రకటనల కోసం ఉపయోగించే రంగురంగుల ట్యూబుల్లో మెర్క్యురీ బాష్పంతోపాటు నియాన్, ఆర్గాన్లను ఉపయోగిస్తారు. గ్జీనాన్: ఫొటోగ్రాఫిక్ ఫ్లాష్బల్బుల్లో వాడతారు. తటస్థ మీసాన్‌లను కనుగొనడానికి బబుల్ చాంబర్లో ఉపయోగిస్తారు. రేడాన్: కేన్సర్ థెరపీలో ఉపయోగించే ఆయింట్ మెంట్లలో రేడాన్‌ను వినియోగిస్తారు. ఉక్కు పోతలలో (ఇ్చట్టట) లోపాలను గుర్తించడానికి దీన్ని వాడతారు.