రోజుకో మాత్రతో కేన్సర్‌ ఔట్‌! | Cancer will be out with Daily one tablet | Sakshi
Sakshi News home page

రోజుకో మాత్రతో కేన్సర్‌ ఔట్‌!

Published Thu, Jan 12 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

రోజుకో మాత్రతో కేన్సర్‌ ఔట్‌!

రోజుకో మాత్రతో కేన్సర్‌ ఔట్‌!

ప్రాణాంతక కేన్సర్‌కు చికిత్స లభించిందా? ఒళ్లు గుల్ల చేసే థెరపీలు లేకుండానే రోజుకో మాత్రతో నయమవుతుందా? ఈ ప్రశ్నలకు ఆస్ట్రేలి యా శాస్త్రవేత్తలు ఔననే సమా« ధానమే ఇస్తున్నారు. వెన్‌క్లెక్‌స్టా పేరుతో తాము తయారు చేసిన ఈ మా త్రలను రోజుకొకటి వేసుకుంటే చాలు.. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుం డానే కేన్సర్‌ను మటుమాయం చేయవచ్చని మెల్‌బోర్న్‌ కేంద్రంగా పనిచే స్తున్న వెనెటోక్లాక్స్‌ కంపెనీ ప్రకటించింది. ఈ ఔషధానికి ఆస్ట్రేలియా థెరప్యూటిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీజీఏ) అనుమతి కూడా లభించిందట. కేన్సర్‌కు శస్త్రచికిత్స, కీమో, రేడియోథెరపీల వంటి వైద్య విధానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇవన్నీ వ్యయ, ప్రయాసలతో కూడుకున్నవే. ఈ నేపథ్యంలో వెనెటోక్లాక్స్‌ ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కేన్సర్‌ కణాల్లో బీసీఎల్‌–2 ప్రొటీన్‌ ఉంటుంది. వ్యాధి కారక కణాలు బతికి ఉండేందుకు ఈ ప్రొటీనే కారణం. దాన్ని నిర్వీర్యం చేసేందుకు 30 ఏళ్లుగా  ప్రయత్నాలు జరుగుతున్నా.. ఫలితం రాలేదు. అయితే వెనెటోక్లాక్స్‌కు చెందిన డాక్టర్‌ డేవిడ్‌ హువాంగ్‌ ఈ విషయంలో విజయం సాధించారు. బీసీఎల్‌–2 ప్రొటీన్‌ పనిచేయకుండా చేయడమే కాకుండా.. కేన్సర్‌ కణం  మరణించేలా ఔషధాన్ని రూపొందించారు. దీన్ని రోజుకో మాత్ర రూపంలో తీసుకుంటే సరిపోతుందని హువాంగ్‌ అంటున్నారు.

లింఫోసైటిక్‌ ల్యూకేమియాతో బాధపడుతున్న 70 మందిపై ఈ మందును ప్రయోగించగా... వారిలో 20 శాతం మందిలో కేన్సర్‌ పూర్తిగా మాయమైందని, 80 శాతం మందిలో మెరుగైన ప్రభావం చూపిందని విక్టోరియన్‌ కాంప్రహెన్సివ్‌ కేన్సర్‌ సెంటర్‌ హెమ టాలజిస్ట్‌ డాక్టర్‌ మార్యన్‌ అండర్సన్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ ఔషధాన్ని రక్త సంబంధిత కేన్సర్ల చికిత్సకు ఉపయోగిస్తు న్నా.. ఇతర కేన్సర్‌ కణా ల్లోనూ బీసీఎల్‌–2 ప్రొటీన్‌ ఉంటుంది కాబ ట్టి వాటిపైనా మెరుగైన ప్రభావం చూపే అవకాశమున్నట్లు అంచనా. వెన్‌క్లెక్‌స్టా వినియోగానికి ఆమెరికా, యూరోపియన్‌ యూనియన్లు  అనుమతులిచ్చినట్లు హువాంగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement