రోజుకో మాత్రతో కేన్సర్ ఔట్!
ప్రాణాంతక కేన్సర్‌కు చికిత్స లభించిందా? ఒళ్లు గుల్ల చేసే థెరపీలు లేకుండానే రోజుకో మాత్రతో నయమవుతుందా? ఈ ప్రశ్నలకు ఆస్ట్రేలి యా శాస్త్రవేత్తలు ఔననే సమా« ధానమే ఇస్తున్నారు. వెన్‌క్లెక్‌స్టా పేరుతో తాము తయారు చేసిన ఈ మా త్రలను రోజుకొకటి వేసుకుంటే చాలు.. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుం డానే కేన్సర్‌ను మటుమాయం చేయవచ్చని మెల్బోర్న్ కేంద్రంగా పనిచే స్తున్న వెనెటోక్లాక్స్ కంపెనీ ప్రకటించింది. ఈ ఔషధానికి ఆస్ట్రేలియా థెరప్యూటిక్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీఏ) అనుమతి కూడా లభించిందట. కేన్సర్‌కు శస్త్రచికిత్స, కీమో, రేడియోథెరపీల వంటి వైద్య విధానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఇవన్నీ వ్యయ, ప్రయాసలతో కూడుకున్నవే. ఈ నేపథ్యంలో వెనెటోక్లాక్స్ ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కేన్సర్ కణాల్లో బీసీఎల్–2 ప్రొటీన్ ఉంటుంది. వ్యాధి కారక కణాలు బతికి ఉండేందుకు ఈ ప్రొటీనే కారణం. దాన్ని నిర్వీర్యం చేసేందుకు 30 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. ఫలితం రాలేదు. అయితే వెనెటోక్లాక్స్కు చెందిన డాక్టర్ డేవిడ్ హువాంగ్ ఈ విషయంలో విజయం సాధించారు. బీసీఎల్–2 ప్రొటీన్ పనిచేయకుండా చేయడమే కాకుండా.. కేన్సర్ కణం మరణించేలా ఔషధాన్ని రూపొందించారు. దీన్ని రోజుకో మాత్ర రూపంలో తీసుకుంటే సరిపోతుందని హువాంగ్ అంటున్నారు.
లింఫోసైటిక్ ల్యూకేమియాతో బాధపడుతున్న 70 మందిపై ఈ మందును ప్రయోగించగా... వారిలో 20 శాతం మందిలో కేన్సర్ పూర్తిగా మాయమైందని, 80 శాతం మందిలో మెరుగైన ప్రభావం చూపిందని విక్టోరియన్ కాంప్రహెన్సివ్ కేన్సర్ సెంటర్ హెమ టాలజిస్ట్ డాక్టర్ మార్యన్ అండర్సన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఔషధాన్ని రక్త సంబంధిత కేన్సర్ల చికిత్సకు ఉపయోగిస్తు న్నా.. ఇతర కేన్సర్ కణా ల్లోనూ బీసీఎల్–2 ప్రొటీన్ ఉంటుంది కాబ ట్టి వాటిపైనా మెరుగైన ప్రభావం చూపే అవకాశమున్నట్లు అంచనా. వెన్‌క్లెక్‌స్టా వినియోగానికి ఆమెరికా, యూరోపియన్ యూనియన్లు అనుమతులిచ్చినట్లు హువాంగ్ తెలిపారు.