జాబ్ రాలేదని అభ్యర్థి ఆత్మహత్య
మునగాల: కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ మునగాల మండల కేంద్రానికి చెందిన పరమాత్ముల శ్రీను కుమారుడు వెంకటేశ్(20) డిగ్రీ చదువుతున్నాడు. గతేడాది జరిగిన కానిస్టేబుల్ ఎంపిక పరీక్షకు హాజరయ్యాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో అతని పేరు రాలేదు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉన్న వెంకటేశ్ మంగళవారం మధ్యాహ్నం పొలానికి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న వెంకటేశ్‌ను చుట్టుపక్కల వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలించేలోగానే అతడు చనిపోయినట్లు సమాచారం.