గోవా కింగ్ ఫిషర్ విల్లా స్వాధీన కసరత్తు!
పణజి: ఉత్తర గోవా క్యాండోలిమ్లో ఉన్న కింగ్‌ఫిషర్ విల్లా స్వాధీనానికి బ్యాంకులు కసరత్తు ప్రారంభించాయి. బ్యాంకింగ్ రుణాలు పొందడానికి ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’ పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా తనఖాపెట్టిన ఆస్తుల్లో ఇది ఒకటి. దీని విలువ దాదాపు 90 కోట్లుగా అంచనా. ఈ ఆస్తి స్వాధీనానికి రెండు రోజుల క్రితమే కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఎస్బీఐ క్యాపిటల్ కంపెనీ విల్లా వద్ద సర్ఫేసీ యాక్ట్ కింద ఒక నోటీసు బోర్డ్‌ను ఉంచింది. ఎస్బీఐ క్యాపిటల్ అధికారులతో పాటు జిల్లా పాలనాధికారులు విల్లాను సందర్శించారు. విజయ్ మాల్యా గోవా వచ్చినప్పుడు ఈ విల్లాలోనే ఉండేవారు. పలు పార్టీలకు ఇది వేదికగా ఉండేది.