పెళ్లి కావడం లేదనే బెంగతో..
చిట్యాల: తనకు పెళ్లి సంబంధాలు కలిసి రావడం లేదని, ఇక పెళ్లి కాదనే బెంగతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఏంపేడు గ్రామశివారులో శుక్రవారం జరిగింది. ఎస్సై వెంకట్రావు కథనం ప్రకారం... మండలంలోని బూర్నపల్లి గ్రామానికి చెందిన మొగుళ్ల దేవేందర్(28) తనకు పెళ్లి కావడం లేదనే బెంగతో గత ఏడాది నుంచి తాగుడుకు బానిసయ్యాడు.
ఈ క్రమంలో వారం రోజుల క్రితం దేవేందర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండలంలోని ఏంపేడు గ్రామశివారులో శవమై కనిపించాడు. తన కుమారుడు పెళ్లికావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి చిన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు.