cantonment election
-
Hyderabad: కంటోన్మెంట్లో కారు చిచ్చు!
హైదరాబాద్: తామంతా ఒక్కటేనంటూ చెప్పుకుంటున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు ఎట్టకేలకు బహిర్గతమయ్యాయి. ఆత్మీయ సమ్మేళనాల సాక్షిగా నేతల మధ్య ఆధిపత్య పోరు తేటతెల్లం అవుతోంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొన్ని రోజులు బాహటంగానే విమర్శలు చేస్తున్న సాయన్న వారసులు ఏకంగా తిరుగుబావుటా ఎగరవేశారు. ఆతీ్మయ సమ్మేళనాల ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్, నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టేశారు. తమ నివాసానికి కూతవేటు దూరంలోనే నిర్వహించిన ఐదో వార్డు ఆతీ్మయ సమ్మేళనానికి రాకుండా అదే సమయంలో నాలుగో వార్డులో పర్యటించడం ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. గత నెలలో బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన ఒకటో వార్డు ఆతీ్మయ సమ్మేళనానికి సైతం సాయన్న వారసులు లాస్య నందిత, నివేదిత గైర్హాజరయ్యారు. మంత్రులు తలసాని, మల్లారెడ్డి పాల్గొన్న సమావేశానికి సైతం రాకపోవడంతో అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తాజాగా సాయన్న వారసులతో పాటు వారి వర్గానికి చెందిన మెజారిటీ నేతలు రాకపోవడం గమనార్హం. అలకకు కారణాలేంటో? దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణించిన మరునాడే అంత్యక్రియల విషయంలో ఆయన వర్గీయులు అధిష్ఠానంపై సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక సాయన్న దశదిన కర్మ ముగిసిన మరునాటి నుంచే మంత్రి తలసాని, మర్రి రాజశేఖర్ రెడ్డిల నడుమ ఆధిపత్య పోరుతో సాయన్న వారసులకు ఆదరణ లేకుండా పోయింది. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో అసమ్మతి మరింత పెరుగుతూ వచి్చంది. అందరినీ కలుపుకోవడమే తన లక్ష్యమంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి బీఆర్ఎస్లో చేరిన శ్రీగణేశ్ తదితరులందరినీ ఒకే వేదిక మీద కూర్చునేలా చేస్తూ ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో తమ తండ్రి సాయన్న పేరును తగ్గించే కుట్రకు తెరలేపారంటూ సాయన్న వారసులు అలక వహిస్తూ వచ్చారు. అదే సమయంలో తమకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ మర్రి రాజశేఖర్ రెడ్డిని నేరుగా నిలదీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సాయన్న హయాంలో నిరి్మంచిన మడ్‌ఫోర్ట్, మారేడుపల్లి డబుల్ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అధిష్ఠానం పెద్దలు కొందరు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన సాయన్న అక్కడే తొలిసారిగా గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరి రెండ్రోజుల చికిత్స అనంతరం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ఆఖరి కోరికను నెరవేర్చే విషయంలోనూ తమకు సహకారం అందడం లేదని సాయన్న వారసులు ఆవేదనతో ఉన్నారని, ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే.. తాము వ్యక్తిగత పనుల వల్లే సమావేశానికి రాలేకపోయామంటూ లాస్య, నివేదిత పేర్కొనడం కొసమెరుపు ఎర్రోళ్ల సైతం.. ఇక నియోజకవర్గం పరిధిలోనే ఐదో వార్డులో నివాసముండే సమయంలోనే డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విద్యార్ధి విభాగం నేతగా, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరోలోనూ స్థానం దక్కించుకున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం టీఎస్–ఎంఎస్ఐ డీసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాను సొంతంగా భావించే ఐదో వార్డు ఆత్మీయ సమావేశానికి తనకే ఆ హ్వానం లేదంటూ ఆయన డుమ్మా కొట్టడం విశేషం. -
కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్‌ట్యాక్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్లో టోల్ ట్యాక్స్ త్వరలోనే ముగియనుంది. కేంద్రం సూచనలతో టోల్ ట్యాక్స్ రద్దుకు కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేసింది. టోల్‌ట్యాక్స్ రద్దుతో కంటోన్మెంట్ బోర్డు రూ.10 కోట్ల వార్షిక బడ్జెట్‌ను కోల్పోనుంది. అదే సమయంలో కంటోన్మెంట్ గుండా ప్రయాణం సాగించే కమర్షియల్ వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. అయితే టోల్‌ట్యాక్స్ రద్దుతో తాము కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో భర్తీ చేయాల్సిందిగా బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. పెండింగ్ సర్వీసు చార్జీల విడుదల, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లకు తోడుగా టోల్‌ట్యాక్స్ నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరనున్నారు. బోర్డు అధ్యక్షుడు, బ్రిగేడియర్ సోమశంకర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ అజిత్ రెడ్డి, సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలన్ నాయర్లు పాల్గొన్నారు. ఆదాయ మార్గాలపై ఆసక్తికర చర్చ.. ఇప్పటికే ఆర్థిక లేమితో సతమతం అవుతున్న బోర్డు టోల్ట్యాక్స్ను సైతం రద్దు చేస్తే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు రామకృష్ణ ప్రతిపాదించారు. ఆరేళ్ల క్రితమే ఆక్ట్రాయ్‌ను రద్దు చేయగా, సంబంధిత పరిహారాన్ని జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతంలోనే టోల్ట్యాక్స్ను రద్దుచేయడంతో సంబంధిత రాష్ట్రాలే నష్టపరిహారాన్ని చెల్లించాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఏయే రాష్ట్రాలు కంటోన్మెంట్లకు నష్టపరిహారాన్ని ఇస్తున్నాయో వెల్లడించాలని ఎమ్మెల్యే సాయన్న కోరగా, అధ్యక్షుడు స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదన్నారు. ఆర్మీ సర్వీసు చార్జీలను సక్రమంగా చెల్లిస్తే బోర్డు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సాయన్న ప్రతిపాదించారు. నష్టపరిహారం చెల్లిస్తేనే టోల్‌ట్యాక్స్ రద్దు చేస్తామంటూ నెల రోజుల క్రితం బోర్డు తీర్మానం చేసి పంపినప్పటికీ, కేంద్రం మరోసారి సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని అధ్యక్షుడు సోమశంకర్ అభిప్రాయపడ్డారు. సీఈఓ అజిత్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయంతో ఏకీభవించగా, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కూడా ఆమోదం తెలిపారు. టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేతకు అంగీకారం తెలుపుతూనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరదాం అని తీర్మానించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వసూళ్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఉండటంతో, అప్పటి వరకు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. టెండర్‌కు ఆమోదం టోల్‌ట్యాక్స్ వసూళ్ల నిలిపివేతకు బోర్డు తీర్మానం తీసుకున్న సమావేశంలోనే మరుసటి ఏడాది టెండర్లకు సంబంధించి, గతంలోనే జారీ చేసిన సర్క్యులర్ ఎజెండాకు బోర్డు ఆమోదం తెలపడం గమనార్హం. బోర్డు తాజా నిర్ణయంతో ఆ టెండర్ల ప్రక్రియపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వెల్లడించలేదు. -
కంటోన్మెంట్లో గెలవాల్సిందే: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల ని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులపై పెట్టారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం రాజకీయ అంశాలపై మాట్లాడారని సమాచారం. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి తీరాలన్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తయిందని తెలిపారు. ఒక్కొక్క వార్డుకు ఒక మంత్రి చొప్పున బాధ్యత తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌కు చెందిన మంత్రులు నా యిని నరసింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రత్యేకంగా పనిచేయాల్సి ఉందన్నారు. టీడీపీకి పునాదులే ఉంచొద్దు.. ‘తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంకా చెబుతున్నాడట. ఏ ధైర్యంతో ఆయనలా మాట్లాడుతున్నట్టు? టీడీపీ నుంచి కిందిస్థాయి పార్టీ శ్రేణులు కూడా టీఆర్ఎస్లో చేరుతున్నా యి. అదే ఊపును కొనసాగిద్దాం. ఏస్థాయి వారైనా టీడీపీ నాయకులతో మాట్లాడి, టీఆర్ఎస్లో చేర్చుకోండి. టీడీపీకి తెలంగాణలో పునాదులను కూడా ఉంచొద్దు’ అని కేబినెట్ సహచరులకు సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో పూలే భవనం బీసీల కోసం హైదరాబాద్‌లో ఐదెకరాల్లో జ్యోతీ రావు ఫూలే పేరిట రూ.10 కోట్లతో భవనాన్ని ని ర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. క్రైస్తవ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీలకోసం ప్రత్యేకంగా, ప్రముఖ మైన ప్రాం తంలోనే రూ.10 కోట్లతో భవనాన్ని నిర్మించాలని కేబినెట్ ప్రాథమిక నిర్ణయం తీసుకుంది.