కంటోన్మెంట్‌లో గెలవాల్సిందే: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల ని తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులపై పెట్టారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం రాజకీయ అంశాలపై మాట్లాడారని సమాచారం.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచి తీరాలన్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తయిందని తెలిపారు. ఒక్కొక్క వార్డుకు ఒక మంత్రి చొప్పున బాధ్యత తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌కు చెందిన మంత్రులు నా యిని నరసింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రత్యేకంగా పనిచేయాల్సి ఉందన్నారు.
టీడీపీకి పునాదులే ఉంచొద్దు..
‘తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంకా చెబుతున్నాడట. ఏ ధైర్యంతో ఆయనలా మాట్లాడుతున్నట్టు? టీడీపీ నుంచి కిందిస్థాయి పార్టీ శ్రేణులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా యి. అదే ఊపును కొనసాగిద్దాం. ఏస్థాయి వారైనా టీడీపీ నాయకులతో మాట్లాడి, టీఆర్‌ఎస్‌లో చేర్చుకోండి. టీడీపీకి తెలంగాణలో పునాదులను కూడా ఉంచొద్దు’ అని కేబినెట్ సహచరులకు సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో పూలే భవనం
బీసీల కోసం హైదరాబాద్‌లో ఐదెకరాల్లో జ్యోతీ రావు ఫూలే పేరిట రూ.10 కోట్లతో భవనాన్ని ని ర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. క్రైస్తవ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీలకోసం ప్రత్యేకంగా, ప్రముఖ మైన ప్రాం తంలోనే రూ.10 కోట్లతో భవనాన్ని నిర్మించాలని కేబినెట్ ప్రాథమిక నిర్ణయం తీసుకుంది.