ఆ జడ్జిని చంపేశారు
త్రిపోలి: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఓ న్యాయమూర్తిని చంపేశారు. గతవారం బందీలోకి తీసుకున్న వారు చివరకు ఆయన్ను విగత జీవుడ్ని చేశారు. ఈ విషయం ఇస్లామిక్ స్టేట్ సంస్థే స్పష్టం చేసింది. మహ్మద్ అల్ నమ్లి అనే న్యాయవాది లిబియాలో అల్ కోమ్స్ అపీల్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
సిర్టి అనే నగరంలో అతడ్ని కొందరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సాయుధులుగా వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ప్రభుత్వం తరుపున ప్రయత్నాలు చేసినా ఉగ్రవాదులు విడిచిపెట్టలేదు. చివరికి చిత్రహింసలు చేసి, నిప్పుపెట్టి కాల్చిన అతడి మృతదేహం అల్ హరవా అనే పట్టణంలో లభించింది. దీంతో లిబియన్ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ కూడా ఆయన మృతి విషయాన్ని ధృవీకరించింది. ఉగ్రవాద నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులకు కఠిన శిక్షలు విధించారనే అక్కసుతోనే ఆయనను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.