car-auto accident
-
ఆటోను ఢీకొన్న కారు: ఇద్దరు యువకుల మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని నాదర్గుల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక శ్రీనిలయ టౌన్షిప్ వద్ద ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడింది. మాధవ్, నితిన్ అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. హరీష్, తరుణ్ అనే మరో ఇద్దరు గాయపడ్డారు. -
కారు-ఆటో ఢీ: పది మందికి తీవ్ర గాయాలు
తాడేపల్లి: గుంటూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. చిలకలూరుపేట నుంచి గుణదల చర్చికి ఆటోలో వెళుతుండగా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.