Car tyre
-
ప్రీమియం కారు టైర్లు లెవిటాస్ ఆల్ట్రాను విడుదల చేసిన జెకె టైర్
-
టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..
ముంబై: కారు టైర్ పేలిపోయి ఒక వ్యక్తి మరణానికి దారితీసిన ఘటనలో ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం ఎగ్గొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ తప్ప, డ్రైవర్ నిర్లక్ష్యం కాదంటూ చేసిన వాదనని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కారు ప్రమాదంలో మరణించిన మకరంద్ పట్వర్థన్ కుటుంబానికి రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2010 అక్టోబర్ 25న పట్వర్ధన్ (38) తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి కారులో పుణె నుంచి ముంబై వెళుతున్నారు. వారిలో కారుని తెచ్చిన ఒక కొలీగ్ చాలా ర్యాష్‌గా డ్రైవ్ చేయడంతో కారు ముందు టైర్ పేలిపోయి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పట్వర్థన్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదనపరుడు కావడంతో ట్రబ్యునల్ అతని కుటుంబానికి న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ 1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కారు పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నించింది. బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిని విచారించిన కోర్టు టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని, ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. -
మెడలో 16 కిలోల బరువు.. రెండేళ్లుగా ‘దుప్పి’ తిప్పలు.. నాలుగుసార్లు మిస్
కొలరాడో: మెడలో టైర్‌తో పరుగెడుతున్న ఈ దుప్పిని పట్టుకోవడానికి కొలరాడో వన్యప్రాణి సంరక్షణ అధికారులకు చుక్కలు కనబడ్డాయి. కొండల ప్రాంతంలో తిరిగే ఆ దుప్పి మెడలోకి టైర్ ఎలా వచ్చిందో తెలియదు గానీ రెండేళ్లుగా అధికారులు దాని కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి దుప్పిని గత శనివారం పట్టుకుని టైర్‌ని తొలగించారు. నాలుగున్నర ఏళ్ల వయసు.. 270 కిలోల బరువున్న ఆ దుప్పి గత వారం రోజుల్లో నాలుగుసార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయిందని పార్క్ అధికారి స్కాట్ ముర్దోచ్ తెలిపారు. తొలుత దుప్పిని పట్టుకుని టైర్‌ని కట్ చేద్దామని అనుకున్నప్పటికీ సాధ్య పడలేదని పేర్కొన్నారు. పక్కా సమాచారంతో ఐదోసారి దుప్పిని టైర్ మోత నుంచి రక్షించామని అన్నారు. (చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!) మట్టి, రాళ్లతో నిండిన ఆ టైర్ బరువు సుమారు 16 కిలోల వరకు ఉంటుందని, దాని వల్ల దుప్పి ఆరోగ్యంపై ప్రభావం పడేదని వెల్లడించారు. అయితే, రెండేళ్లుగా అంత బరువు మోసినా దుప్పి మెడ ఎప్పటిలా మామూలుగా ఉండటం మంచి విషయమని పేర్కొన్నారు. మెడపై చిన్న గాయం మాత్రం ఉందని తెలిపారు. Here is some video of this bull elk over the past two years. pic.twitter.com/R6t9nNPOyb — CPW NE Region (@CPW_NE) October 11, 2021 (చదవండి: వైరల్: అరటి గెల మీద పడటంతో కోర్టుకు.. ఐదేళ్లు పోరాడి విజయం.. రూ.4 కోట్ల నష్ట పరిహారం) -
కారు ప్రమాదంలో ఇద్దరు మృతి
సీతాపూర్(ఉత్తరప్రదేశ్): టైరు పేలిపోవడంతో కారు చెట్టుకు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని బీబీపూర్ ప్రాంతంలోని మిస్రీక్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఫంక్షన్‌కు వెళ్లిన వారంతా కారులో తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కారు టైర్ పేలిపోయింది. దాంతో కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ప్రశాంత్ తివారీ (25) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందగా, మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గోపాల్ పాండే (42) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, గాయపడ్డ వారిలో నలుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.