Carbohydrate
-
బరువు తగ్గడం కోసం కార్బోహైడ్రేట్లను తగ్గించేస్తున్నారా?
చాలామంది బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు లేని ఆహారం తీసుకోవడమే మంచిదని గట్టిగా విశ్వసిస్తారు. అయితే వైద్యులు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే కార్బోహైడ్రేట్ దూరం చేసినంత మాత్రం శరీరంలోని కొలస్ట్రాల్ ఎంతమాత్రం తగ్గిపోదని అంటున్నారు. దీని వల్లే బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మేలని అంటున్నారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తక్కువుగా ఉండే తృణ ధాన్యాలు, మొక్కల ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టిపెడితే సులభంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఈ లెస్ కార్బోహైడ్రేట్ డైట్ అధిక బరువు సమస్యకు చెక్‌పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాలు అంటే.. చక్కెరకు సంబందించిన పదార్థాలు, పాస్తాలు, రొట్టెలు కాకుండా తీసుకుంటే బరువు తగ్గడమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా సమ స్థాయిలో ఉంటాయని అంటున్నారు. ఈ మేరకు హార్వర్ యూనివర్సిటీ పరిశోధకులు సుమారు లక్షకు పైగా పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. కొందరికి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. మిగతావారికి పూర్తిగా కార్బోహ్రైడేట్ లేని శుద్ధి చేసిన పదార్థాలు, మాంసం వంటివి ఇచ్చారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వారి ఆరోగ్యం గురించి డేటా ట్రాక్ చేశారు. దానిలో తక్కవ కార్బోహైడ్రేట్ ఉన్న హెల్తీ ఆహారాన్ని తీసుకున్నవారు బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు కనిపించాయని, మిగతా వారిలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. పైగా ఇలా తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహార తీసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు కూడా తక్కువగానే ఉన్నాయని అన్నారు. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు... బరువు తగ్గుతారు మధుమేహం అదుపులో ఉంటుంది రక్తపోటు నార్మల్‌గా ఉంటుంది గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
ఈ బనానా రంగు, రుచి సెపరేట్!
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతోంది. వింతలు విడ్డూరాలకు కొదవేలేదు. మనకు తెలియని ఎన్నో అద్భుత విషయాలు క్షణాల్లో తెలుస్తున్నాయి. తాజాగా తియ్యతియ్యని అరటి పళ్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అరటిపళ్లు ఏంటీ? గొప్పదనం ఏం ఉంది? మామూలే కదా అనుకుంటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. ఎందుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అరటి పళ్లు సాదాసీదావి కావు. రంగూ రుచిలోనూ చిత్రంగా అనిపించేవే ‘బ్లూ జావా బనానా లేదా నీలం రంగు అరటిపళ్లు’. ఆగ్నేయాసియాల్లో విరివిగా పండే బ్లూ జావా అరటిపళ్లు ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలోని హవాయి, ఫిజీ వంటి ప్రాంతాల్లో ఇవి పండుతాయి. వెనీలా రుచిని కలిగి ఉండే ఈ నీలం అరటి పళ్లను బనానా ఐస్‌క్రీమ్, హవాయి బనానా అని కూడా పిలుస్తారు. మొదట్లో దక్షిణాసియా దేశాల్లోనే వీటిని ఎక్కువగా పండించేవారు. నీలం రంగు అరటిపళ్లు హైబ్రిడ్ అని చెప్పవచ్చు. ఆగ్నేయాసియాలో పండే ‘ముసా బాల్బిసియానా, ముసా అక్యుమనిటా’ అనే రెండు అరటి మొక్కల నుంచి ఉద్భవించిందే హైబ్రిడ్ నీలం రంగు బనానా. మొదట్లో ఈ అరటిపళ్లు నీలం రంగులో ఉన్నప్పటికీ అవి పక్వానికి వచ్చాక క్రమంగా నీలం రంగు మసక బారుతుంది. సాధారణ అరటి పళ్ల కంటే ఇవి కాస్త పెద్దగా ఉండడమే గాక, ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. పైకి నీలంగా కనిపించే ఈ బనానా లోపల మాత్రం అన్నింటిలాగానే తెల్లగా ఉంటుంది. నలుపు రంగులో ఉన్న చిన్న విత్తనాలు ఉంటాయి. దీనిలో పొటాషియంతో పాటు ఇతర రకాల ఖనిజ పోషకాలు అధికంగా ఉండడం వల్ల మంచి స్నాక్‌గా దీన్నీ తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది బాగా ఉపయోగపడుతుంది. అరటిపండును వంద గ్రాములను తీసుకుంటే దానిలో ఫ్యాట్ 0.3 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 22.8 గ్రాములు, 89 కేలరీలు ఉంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల రోజువారి ఆహారంలో ఈ బనానా తీసుకోవడం వల్ల బరువును అదుపులో కూడా ఉంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక బ్లూ బనానా చెట్టు ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడిగా, ఫ్రెష్‌గా ఉంచేందుకు వాడే అల్యూమినియం ఫాయిల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈ బనానా ఆకులను వాడవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న విచిత్ర బ్లూ బనానాను వీలైతే ఒక్కసారైనా టేస్ట్ చేసి చూడండి. l -
జీవాణువులు.. ముఖ్యాంశాలు
జీవం అనేది పరమాణువులు, సంశ్లిష్ట అణువులతో ఏర్పడింది. వాటిలో ప్రధానమైనవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు, లిపిడ్లు మొదలైనవి. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు మనం తీసుకునే ఆహారంలో ప్రధాన భాగం. అంతేకాకుండా కొన్ని ఖనిజ లవణాలు, విటమిన్లు వంటివి కూడా జీవ క్రియల్లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు.. గ్లూకోజ్, చక్కెర (సుక్రోజ్) వంటి తక్షణ శక్తినిచ్చే పదార్థాలు. ఇవి మొక్కల్లో పిండి పదార్థాల (స్టార్‌చ) రూపంలో, జంతువుల్లో గ్లైకోజెన్, గడ్డి (సెల్యులోజ్) రూపంలో నిల్వ ఉంటాయి. వీటి సాధారణ ఫార్ములా: ఇ్ఠ(ఏ2ై)డ. ఇవి అనేక సంఖ్యలో హైడ్రాక్సీ ప్రమేయాలున్న ఆల్డిహైడ్లు లేదా కీటోనులు. రుచికి తీపిగా ఉండే కార్బోహైడ్రేట్లను చక్కెరలు అంటారు. ఉదాహరణ: నిత్యం మనం ఉపయోగించే చక్కెర. దీని రసాయన నామం సుక్రోజ్ (పాలలోని చక్కెర లాక్టోజ్, తేనెలోని చక్కెర ఫ్రక్టోజ్). పండిన ద్రాక్షలో గ్లూకోజ్ ఉంటుంది. ఇందులోని అత్యంత తియ్యనైన పదార్థం ఫ్రక్టోజ్. గ్రీకు భాషలో శాఖరాన్ అంటే చక్కెర అని అర్థం. అందుకే కార్బోహైడ్రేట్లను శాకరైడ్లు అని కూడా అంటారు. ఒక సంక్లిష్టమైన స్టార్‌చ (బియ్యం, గోధుమలు, ఆకుకూరల్లో ఉండేది), సెల్యులోజ్ (గడ్డి, పత్తి, కలపలో లభించేది) వంటి కార్బోహైడ్రేట్లను అ చక్కెరలు (ూౌటఠజ్చటట) అంటారు. సాధారణంగా కార్బోహైడ్రేట్లు కార్బన్(ఇ), హైడ్రోజన్ (ఏ), ఆక్సిజన్ (ై) అనే మూలకాలతో నిర్మితమవుతాయి. సెల్యులోజ్, స్టార్చను ‘జలవిశ్లేషణ’ అనే ప్రక్రియ ద్వారా విడగొడితే చివరగా వచ్చేది గ్లూకోజ్. అంటే ఇటుకలతో గోడ నిర్మాణమైనట్లు గ్లూకోజ్ అనే అణువుతో స్టార్‌చ, సెల్యులోజ్ అనే సంక్లిష్ట అణువులు రూపొందుతాయి. సెల్యులోజ్ అనే ఎంజైమ్ మానవుల్లో ఉండదు. కాబట్టి గడ్డి (సెల్యులోజ్ ) మానవుల్లో జీర్ణం కాదు. స్టార్చను ‘అయోడిన్’ ద్రావణంతో గుర్తిస్తారు. స్టార్‌చ అయోడిన్‌తో కలిసి నీలి రంగును ఇస్తుంది. పాలలో చిక్కదనం కోసం స్టార్చ్ (పిండి)ని కలిపితే అయోడిన్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. చక్కెర పరిశ్రమలో లభించే మొలాసిస్‌లో సుక్రోజ్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి ‘కిణ్వప్రక్రియ’ ద్వారా ఆల్కహాల్ తయారు చేస్తారు. బ్యాక్టీరియా, మొక్కల కణ త్వచాలు(ఇ్ఛ గ్చిట) కార్బోహైడ్రేట్ల ద్వారా నిర్మితమవుతాయి. కాగితం పరిశ్రమలో కూడా సెల్యులోజ్ (కలప)ను ఉపయోగిస్తారు. ప్రోటీన్లు: పప్పు ధాన్యాలు, చిక్కుళ్లు, బఠానీలు, చేపలు, మాంసం, పాలు, చీస్ తదితర ఆహార పదార్థాలలో ప్రధానంగా ఉండే మాంసకృత్తులనే ప్రోటీన్లుగా వ్యవహరిస్తారు. జీవుల నిర్మాణానికి, నిర్వహణకు, ఎదుగుదలకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. రసాయనికంగా ఇవి ఎమైనో ఆమ్లాల ద్వారా నిర్మితమవుతాయి (ఎమైనో ఆమ్లాల పాలీమర్లు). వీటిలో ృఇైృూఏృ అనే ఎమైడ్ బంధం పునరావృతమవుతుంది. అందువల్ల వీటిని పాలీ ఎమైడ్‌లు అంటారు. ఇవి కార్బన్ (ఇ), హైడ్రోజన్(ఏ) నైట్రోజన్(ూ), ఆక్సిజన్ (ై)లతో రూపొందుతాయి. పట్టు (సిల్క్), వెంట్రుకలు, ఉన్నిలో లభించే ప్రోటీన్‌ను కెరొటిన్ అంటారు. కండరాల్లో ఉండే ప్రోటీన్ మియోసిన్. రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకుపోయే ‘హిమోగ్లోబిన్’ కూడా ఒక రకమైన ప్రోటీన్. లోపభూయిష్ట ప్రోటీన్ ‘సికిల్‌సెల్ హిమోగ్లోబిన్’ కారణంగా ‘సికిల్‌సెల్ ఎనీమియా’ అనే రక్త లోప వ్యాధి కలుగుతుంది. మన శరీరంలోని వివిధ రసాయన చర్యల్లో జీవ ఉత్ప్రేరక ఎంజైములుగా కూడా ప్రోటీన్లు వ్యవహరిస్తాయి. జంతు కణజాలం ప్రోటీన్లతో నిర్మితమవుతుంది. చాలా వరకు రోగకారక క్రిముల నుంచి రక్షణ కల్పించే ‘యాంటీ బాడీస్’గా కూడా ప్రోటీన్లు పని చేస్తాయి. వేడి చేసినప్పుడు ప్రోటీన్లు జీవ చర్యా శీలత కోల్పోతాయి. దీన్నే ప్రోటీన్ స్వభావ వికలత (ప్రోటీన్ డీనాచురేషన్) అంటారు. ఉదాహరణ: నీటిలో మరిగించినప్పుడు గుడ్డులోని తెల్లసొన స్కందనం చెందడం. పాలలోని బ్యాక్టీరియా ఏర్పర్చిన లాక్టికామ్లం పాలను పెరుగుగా మార్చడం కూడా స్వభావ వికలత (పాలు పులిసినప్పుడు వచ్చే వాసనకు కారణం లాక్టికామ్లం) కిందకు వస్తుంది. లిపిడ్లు: నూనె గింజలు, నూనెలు, కొవ్వుల్లో లిపిడ్లు ఉంటాయి. ఇవి తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు (ఎక్కువ కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటాయి). రసాయనికంగా గ్లిజరాల్, ఫాటీ ఆమ్లాల ట్రైఎస్టర్లు. నీటిలో కరగవు. ఇవి సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో నూనెలుగా, ఘన రూపంలో కొవ్వులుగా ఉంటాయి. అందుకే గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి ఘన రూపంలో ఉంటుంది. చాలావరకు నూనెలు ఒకటి అంతకంటే ఎక్కువ కార్బన్-కార్బన్ ద్విబంధాల (అసంతృప్తత)ను కలిగి ఉంటాయి. వీటిని ‘నెకెల్)’ లోహం సమక్షంలో హైడ్రోజనీకరణం చేస్తే సంతృప్త ‘కొవ్వు’ (ఉదాహరణ: డాల్డా)లుగా రూపాంతరం చెందుతాయి. హైడ్రోజనీకరణం ద్వారా అసంతృప్త నూనెలు సంతృప్త కొవ్వులుగా మారతాయి. ఆరోగ్యానికి అసంతృప్త నూనెలు మేలు చేస్తాయి. నూనెలను సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చర్య జరిపి సపోనిఫికేషన్ అనే క్షారజల విశ్లేషణ పద్ధతి ద్వారా సబ్బులను తయారు చేస్తారు. సబ్బు అనేది ఫాటీ ఆమ్లాల సోడియం (బట్టల సబ్బు) లేదా పొటాషియం (స్నానానికి ఉపయోగించే సబ్బు) లవణం. గ్లిజరాల్ అనేది లిపిడ్ల సహ ఉత్పన్నం. కొన్ని ముఖ్యమైన ఫాటీ ఆమ్లాలు: లారిక్ ఆమ్లం (కొబ్బరి నూనె, వెన్న), స్టియరిక్ ఆమ్లం (వెన్న, జంతువుల కొవ్వు). ఇవి సంతృప్త ఫాటీ ఆమ్లాలు. ఓలియిక్ ఆమ్లం(పత్తి, సోయా). ఇది అసంతృప్త ఫాటీ ఆమ్లం. దుర్వాసనను తొలగించే సబ్బులు, సూక్ష్మక్రిమి నాశక సబ్బులలో 3,4,5-ట్రైబ్రోమోసాలిసిలానిలైడ్ ఉంటుంది. మాయిశ్చరైజింగ్ పారదర్శక సబ్బులలో గ్లిజరాల్ ఉంటుంది. సాధారణ సబ్బులు కఠిన జలం (ఉప్పునీరు)తో నురగనివ్వవు. అందువల్ల అవి ఉప్పు నీటిలో తెల్లని అవక్షేపాన్నిచ్చి శుభ్రపరిచే గుణాన్ని కోల్పోతాయి. ఈ విషయంలో డిటర్జెంటులు మెరుగ్గా పని చేస్తాయి. ఇవి కఠిన జలంతో కూడా నురగనిస్తాయి. రసాయనికంగా ఇవి ఆల్కైల్ బెంజీన్ సల్ఫానేట్లు లేదా ఫాటీ ఆల్కహాల్‌ల సల్ఫేట్ లవణాలు. హార్మోన్లు: జీవ కణాల మధ్య వార్తాహరులుగా పనిచేసేవి హార్మోన్లు. వీటిని ఎండోక్రైన్ గ్రంథులు ఉత్పత్తి చేసి నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. హార్మోన్లు పలు రకాలుగా ఉంటాయి. అవి..రసాయనికంగా లభించే స్ట్టెరాయిడ్లు. ఉదాహరణ: ఈస్ట్రోజెన్, ఈ స్వడోల్ ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరోన్. ప్రోటీన్ హార్మోన్లు (పాలీపెప్టైడ్లు). వీటికి ఉదాహరణ: ఇన్సులిన్. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. ఎమైనో ఆమ్లాల ఉత్పన్నాల హార్మోన్. దీనికి ఉదాహరణ-థైరాక్సిన్. ఇది ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్. పాలీమర్లు: అతి చిన్న అణువులను నిర్మాణాత్మక యూనిట్లుగా తీసుకుని పెద్ద అణువులను తయారు చేసే ప్రక్రియను పొలిమరీకరణం అంటారు. చిన్న అణువును మోనోమర్లు అని, పొలిమరీకరణం ద్వారా చివరగా వచ్చే అణువులను పాలిమర్స్ అని అంటారు. సెల్యూలోజ్, రబ్బరు వంటివి సహజ పాలీమర్లు. వేడి లేదా ఒత్తిడికి గురి చేసినప్పుడు అనుకున్న ఆకృతులను పొందితే వాటిని ప్లాస్టిక్ అంటారు. ప్లాస్టిక్ రెండు రకాలు. వేడి చేసినప్పుడు మెత్తగా మారి, చల్లార్చగానే తమ ధర్మాలను తిరిగి పొందే వాటిని థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్లు అంటారు. ఉదాహరణ-పాలిథీన్, పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ), నైలాన్, సెల్యూలోజ్ ఎసిటేట్. అలాకాకుండా వేడి చేసినప్పుడు గట్టిగా మారే వాటిని థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు. ఉదాహరణ-బెకలైట్. సహజ రబ్బరు ఐసోప్రీన్ పాలీమర్. దీనికి గట్టితనం కోసం నీటిని పీల్చుకునే ధర్మం తగ్గించడానికి సల్ఫర్‌ను కలిపి వేడి చేస్తారు. ఈ ప్రక్రియనే వల్కనైజేషన్గా వ్యవహరిస్తారు. విటమిన్లు: మన ఆహారంలో తీసుకోవాల్సిన కర్బన పదార్థాలు విటమిన్లు. వీటిని మొక్కలు సంశ్లేషించుకుంటాయి. కాని మానవ శరీరంలో సంశ్లేషం కావు. (కేవలం విటమిన్ ఉ మాత్రం సూర్యకాంతి సమక్షంలో శరీరంలో తయారవుతుంది). అ, ఈ, ఉ, ఓ విటమిన్లు కొవ్వు/నూనెలో.. ఆ, ఇ విటమిన్లు నీటిలో కరుగుతాయి. -
హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ థైరాయిడ్ గ్రంథి లోపాలు - లక్షణాలు
థైరాయిడ్ గ్రంథి సీతాకోకచిలుక ఆకారంలో గొంతుభాగంలో ఉంటుంది. ఈ గ్రంధి పిట్యుటరీగ్రంథి అధీనంలో ఉంటుంది. ఇది గొంతు భాగంలో గాలిగొట్టం (trachea) ఇరువైపులా అమరి ఉన్నట్లుగా ఉంటుంది. థైరాయిడ్గ్రంధిలో ముఖ్యంగా రెండు తేడాలను చూస్తాం. అవి T3, T4 తగ్గడం వలన హైపోథైరాయిడిజమ్, T3, T4 పెరగటం వలన హైపర్ థైరాయిడిజమ్ కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి యొక్క లోపాలు మన శారీరక, మానసిక వ్యవస్థ మీద పనిచేస్తాయి. అమెరికాలో 59 మిలియన్ల జనాభాకి థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అంచనా. కానీ చాలామందికి ఆ విషయం ఇప్పటివరకు తెలియదు. థైరాయిడ్ గ్రంథి జీవక్రియలకు అవసరమైన చాలా ముఖ్యమైన గ్రంథి. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదో, అది మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా బరువు, మానసిక ఆందోళనలు, శక్తి స్థాయులపై దుష్ర్పభావంచూపుతాయి. థైరాయిడ్ సమస్యలు అకస్మాత్తుగా స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళనలు, ఆత్రుత, వెంట్రుకలు ఊడటం, సెక్సువల్ డిస్ఫంక్షన్, సంతానలేమి, ఇతర లక్షణాలు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాల్ని పెంచుతాయి. అందుకే థైరాయిడ్ సమస్యని గుర్తించడం అతి ముఖ్యం. ప్రపంచ జనాభాలో సుమారు 75 శాతం స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మగవారిలో కేవలం 1.5 శాతం మాత్రమే. దీనికి కారణం మారిన జీవనశైలి కారణంగా మనపై పడే ఒత్తిడులే అని చెప్పవచ్చు. థైరాయిడ్ తయారుచేసే హార్మోన్స్ జీవన యంత్రాంగాన్ని, రసాయన పదార్థాలను నియంత్రిస్తాయి. థైరాయిడ్ ముఖ్యంగా T3, T4 అనే రెండు హార్మోన్స్‌ను తయారుచేస్తుంది. T3, ట్రై ఐడో ధైరోనిన్, T4 థైరాక్సిన్ (thyroxine) ఈ హార్మోన్స్ శరీరంలో... BMR based metabolic Rate ను పెంచుతాయి ఫాట్స్, కార్బోహైడ్రేట్ మెటాబాలిజమ్ను పెంచుతాయి ప్రొటీన్ల తయారీ గుండెకు, ఇతర అవయవాలకు రక్త సరఫరా హెచ్చిస్తాయి పిల్లలలో థైరాయిడ్ హార్మోన్స్ వలన గుండె, మెదడు పెరుగుదల మామూలుగా ఉంటుంది. ఎముకల ఎదుగుదల, క్యాల్షియం మెటబాలిజమ్‌కు కూడా థైరాయిడ్ హార్మోన్స్ ఆవశ్యకత ఉంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు థైరాయిడ్ పాత్ర సమతుల్యత, పోషణ, శరీర పెరుగుదలకు... థైరాయిడ్ గ్రంథి అవసరం చాలా ఉంది. హైపోథాలమిక్ పిట్యుటరీ థైరాయిడ్ ఆక్లిన్స్ ద్వారా థైరాయిడ్ హార్మోన్స్ తయారీ, నియంత్రణ ఆధారపడి ఉంటుంది. కొన్ని కారణాల వలన కలిగే మార్పులు ఎ) థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్ఫ్లమేషన్ బి) థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్స్ ఎక్కువ కావడం సి) థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్స్ తక్కువ కావడం థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు దానిని హైపర్ థైరాయిడిజమ్ అంటారు. లక్షణాలు ఆకలి బాగా ఉంటుంది. కానీ బరువు తగ్గుతారు కోపం, చిరాకు నీరసం అలసట ఉద్రేకం నాడీవేగం హెచ్చటం కాళ్ళు చేతులు, వణకటం ఎక్కువ వేడిని భరింపలేకపోవటం చెమట పట్టడం నీటి విరేచనాలు థైరాయిడ్ గ్రంథి భాగం వాచి, ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ కండిషన్‌ను థైరోటాక్సికోసిన్ లేదా Graves disease అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఇది ముఖ్యంగా 30 సం.ల వయస్సు పైబడ్డ వారిలో ఎక్కువ శాతం స్త్రీలలో వస్తుంది. కనుగుడ్లు బయటికి వచ్చినట్లుండటం: కంటి లోపలి కండరాలు, కొవ్వు లోపలిభాగం వాటి కనుగుడ్లను బయటికి తోస్తాయి. ఇది థైరాయిడ్ కంతుల రూపంలో ఒకటి లేదా రెండు, మూడు ఉండవచ్చు. Nodular goitre అని కూడా అంటారు. హైపోథారాయిడిజమ్ T3, T4 హార్మోన్స్ ఉత్పత్తి కొన్ని కారణాల వలన తగ్గిపోతుంది. లక్షణాలు నీరసం, బద్దకం వేడి ఉష్ణోగ్రతలో కూడా చలిగా ఉంటుంది ట వయస్సు నిలకడలేకపోవటం శరీర బరువు పెరగటం మానసికంగా కుంగిపోవటం (డిప్రెషన్) ముఖం వాచినట్లుండటం జుట్టు రాలటం చర్మం పొడిబారినట్లుండటం మలబద్దకం గొంతు బొంగురుపోవటం రోగ నిర్థారణ రక్తపరీక్ష : T3, T4, TSH Levels s గ్రేవ్స్ డిసీజ్: T3, T4, లెవల్స్ ఎక్కువలో TSH లెవల్ తక్కువలో ఉండును ట రక్తపరీక్ష: థైరాయిడ్ యాంటీ బాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ చికిత్స హైపర్ థైరాయిడ్: Anti Thyrox, Neo ఈ డ్రగ్ థైరాయిడ్ హార్మోన్ తయారీని తగ్గిస్తుంది. హైపోథైరాయిడ్ : థైరో నార్మ్: థైరాక్సిన్ సోడియం, 25, 50 100Cg లో లభిస్తుంది. Eltroxin, Roxin, Protid, Callosl (Iodine) Liquid 8mg Iodine/5mc హైపర్ థైరాయిడిజమ్‌లో వాడవచ్చును. ఇది Thyroid hormone ను ఆపుతుంది. హోమియో వైద్యం హోమియోపతి వైద్య విధానంలో థైరాయిడ్ వచ్చేందుకు గల మూలకారణాలను విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి సరియైన హోమియో మందుల ద్వారా తత్వ విచారణ ద్వారా చికిత్స చేయవచ్చును. హోమియోతో మంచి ఫలితాలు వస్తాయి. హైపోథైరాయిడ్‌కు కారణాలు థైరాయిడ్ గ్రంథిలోనే లోపం కలగడం. దీనినే hashimoto's thyroid వాపు అంటారు. శరీరంలో యాంటీబాడీస్ తయారై గ్రంథిని పనిచేయకుండా చేస్తుంది. ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. 30 -50 సం.ల వయస్సు వారిలో రావచ్చు. నియంత్రణ లేని హైపర్ థైరాయిడ్ ట్రీట్మెంట్ వలన హైపోథారాయిడ్‌గా మారవచ్చును. చిన్నపిల్లల్లో హైపోథారాయిడ్ వలన పెరుగుదల లోపాలుంటాయి. మెదడు పెరుగుదల ఆగిపోవచ్చును. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. పుట్టుకతో థైరాయిడ్ లోపాలుండవచ్చును. వారిలో పెరుగదల ఆగిపోతుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109