చాలామంది బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు లేని ఆహారం తీసుకోవడమే మంచిదని గట్టిగా విశ్వసిస్తారు. అయితే వైద్యులు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే కార్బోహైడ్రేట్ దూరం చేసినంత మాత్రం శరీరంలోని కొలస్ట్రాల్ ఎంతమాత్రం తగ్గిపోదని అంటున్నారు. దీని వల్లే బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మేలని అంటున్నారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తక్కువుగా ఉండే తృణ ధాన్యాలు, మొక్కల ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టిపెడితే సులభంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఈ లెస్ కార్బోహైడ్రేట్ డైట్ అధిక బరువు సమస్యకు చెక్‌పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాలు అంటే.. చక్కెరకు సంబందించిన పదార్థాలు, పాస్తాలు, రొట్టెలు కాకుండా తీసుకుంటే బరువు తగ్గడమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా సమ స్థాయిలో ఉంటాయని అంటున్నారు.
ఈ మేరకు హార్వర్ యూనివర్సిటీ పరిశోధకులు సుమారు లక్షకు పైగా పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. కొందరికి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. మిగతావారికి పూర్తిగా కార్బోహ్రైడేట్ లేని శుద్ధి చేసిన పదార్థాలు, మాంసం వంటివి ఇచ్చారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వారి ఆరోగ్యం గురించి డేటా ట్రాక్ చేశారు. దానిలో తక్కవ కార్బోహైడ్రేట్ ఉన్న హెల్తీ ఆహారాన్ని తీసుకున్నవారు బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు కనిపించాయని, మిగతా వారిలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. పైగా ఇలా తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహార తీసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు కూడా తక్కువగానే ఉన్నాయని అన్నారు.
తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు...
- బరువు తగ్గుతారు
- మధుమేహం అదుపులో ఉంటుంది
- రక్తపోటు నార్మల్‌గా ఉంటుంది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
(చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!)
Comments
Please login to add a commentAdd a comment