carbon monaxide
-
జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి
టిబిలిసి: జార్జియాలో పర్వతశ్రేణుల్లో ఒక రిసార్టులో 11 మంది భారతీయులు మృతి చెందారని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. మృతుల శరీరాలపై గాయాలేమీ లేవని, హింస జరిగిన అనవాళ్లు కూడా కన్పించలేదని జార్జియా విదేశాంగ శాఖ తెలిపింది. విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 12 మంది మరణించగా.. ఇందులో 11 మంది భారతీయులని తెలిపింది. పర్వత ప్రాంతమైన గదౌరీలో ఈ 11 మంది హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్నారని వివరించింది. మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నామని పేర్కొంది. మృతికి కారణాలను తెలుసుకునేందుకు జార్జియా ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. -
‘ఎలా చావాలి’ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..
కృష్ణరాజపురం: ఇప్పటివరకు తానేమీ సాధించలేదని, ఇకపై కూడా ఏమి సాధించలేనని జీవితంపై విరక్తి చెందిన టెకీ యూట్యూబ్‌లో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలో బీదర్‌కు చెందిన జీవన్ అంబటె (33) బెంగళూరులోని మహదేవపురా.. లక్ష్మీనగర్ లేఅవుట్లో నివాసం ఉంటున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అతడు.. అమెజాన్ కంపెనీలో టీం లీడర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో తాను జీవితంలో ఏమీ సాధించలేదని తరచూ బాధపడేవాడు. అనంతరం డిప్రెషన్‌కు లోనయి ‘ఎలా మరణించాలి (హౌ టు డై)’ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయసాగాడు. యూట్యూబ్‌లో వెతికి చివరికి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్‌ను ఎన్నుకున్నాడు. ఆన్లైన్లో ప్రయోగాల కోసమని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ముఖాన్ని ప్లాస్టిక్ సంచితో కప్పుకున్నాడు. అందులోకి పైప్‌ను పెట్టుకుని వాయువును పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత అతని స్నేహితులు గదికి వచ్చి చూడగా చనిపోయి కనిపించాడు. వెంటనే స్నేహితులు మహదేవపుర పోలీసు స్టేషన్లో విషయం తెలియజేశారు. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో రాశాడు. జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నానని, కానీ అవన్నీ నేరవేదని వాపోయాడు. తానో యంత్రంలా మారిపోయానని, ఈ జీవితం తనకు నచ్చలేదని సూసైడ్ నోట్లో జీవన్ పేర్కొన్నాడు. డోర్‌కు కాగితం అతికించి.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జీవన్ తాను ఉంటున్న ఇంటి డోర్‌కు స్వయంగా రాసిన కాగితం అతికించాడు. తలుపు ఎలా తెరవాలో బొమ్మ గీశాడు. అంతేకాదు తలుపు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందులో రాశాడు. లోపలికి వచ్చిన తర్వాత కరెంట్ స్విచ్‌లు వేయవద్దని.. వేస్తే మంటలు అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. కిటికీలు, తలుపులన్నీ తెరవాలని.. గ్యాస్ సిలిండర్ వాల్వ్ మూసివేయాలని సూచించాడు. డోర్‌కు అతికించిన కాగితంలో తన ఫొటోను కూడా అతడు పెట్టాడు. చదవండి: కర్ణాటకలో బ్లాయిమెయిల్: 400 సీడీలున్నాయి! యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి.. -
గీజర్ నుంచి విషవాయువు.. బాలిక మృతి
ముంబై : గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బొరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 5న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన ధృవి గోహిల్ (15) ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 10న మృతిచెందింది. కార్బన్ మోనాక్సైడ్‌ను అధికంగా పీల్చడం వల్లే ఈ ఘోరం జరగినట్లు వైద్యులు తెలిపారు. -
పైన రక్షణ.. కింద మాత్రం సమస్యలు!
వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇది. భూమికి సుమారు 10–50 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఓజోన్ పొర హానికారక రేడియో ధారి్మకత నుంచి భూమిని రక్షిస్తుంటే.. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకం వల్ల భూమ్మీద తయారయ్యే ఓజోన్ వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాహనాల పొగలోని నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ల రసాయన చర్య వల్ల ఓజోన్ తయారవుతుంది. అదీ ప్రతి వంద కోట్ల అణువులకు గరిష్టంగా వంద వరకు ఓజోన్ అణువులు ఉండొచ్చు అంతే. కానీ అవే రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. ఇక భూమి పైపొరల్లోని ఓజోన్ గురించి మాట్లాడుకుందాం. భూమ్మీద ఉన్న ఓజోన్‌లో 90 శాతం స్ట్రాటోస్ఫియర్లోనే ఉంటుంది. యూవీ–బీ కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంటుంది ఓజోన్ పొర. అతి నీలలోహిత కిరణాలు మూడు రకాలు యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ. యూవీ–ఏ కిరణాల శక్తి తక్కువ కాబట్టి ప్రభావమూ అంతగా ఉండదు. యూవీ–సీ స్ట్రాటోస్ఫియర్‌లో ఆక్సిజన్‌తో కలసిపోవడం వల్ల భూమిని చేరే అవకాశం లేదు. యూవీ–బీతోనే సమస్య అంతా. ప్రమాదకరమైన ఈ యూవీ–బీ కిరణాలు తగిలినప్పుడు ఓజోన్ కాస్తా.. ఆక్సిజన్ (ఓ2), ఆక్సిజన్ అణువుగా విడిపోతాయి. ఆ తర్వాత ఈ రెండూ కలిసిపోయి ఓజోన్‌గా మారతాయి. ఓజోన్‌తో సమస్య ఇది.. భూ వాతావరణంలోకి చేరుతున్న కొన్ని రసాయనాల కారణంగా ఓజోన్ పొర పలుచన కావడం, చిల్లు పడుతోందని శాస్త్రవేత్తలు 1970లలోనే గుర్తించారు. సాధారణంగా స్ట్రాటోస్ఫియర్‌లో ఒకపక్క ఓజోన్.. ఆక్సిజన్ పరమాణువులుగా విడిపోతుంటే ఇంకోవైపు ఈ పరమాణవులన్నీ కలిసిపోయి ఓజోన్ ఏర్పడుతుంటుంది. ఈ వాతావరణ పొరలో ఉండే నైట్రోజన్, హైడ్రోజన్ వంటి ఇతర వాయువులు కూడా ఓజోన్‌తో రసా యన చర్య జరపడం వల్ల సమస్యలు వస్తాయి. ఇవి కాస్తా ఓజోన్ ఆక్సిజన్‌గా మారకుండా నిరోధిస్తుంటాయి. ఫలితంగా ఓజోన్ వాయువు మోతాదు తగ్గుతూ వస్తుంది. మానవ చర్యల కారణంగా వాతావరణంలోకి చేరే క్లోరిన్, బ్రోమిన్లు కూడా సమస్యను జటిలం చేస్తున్నాయి. ఓజోన్ పొరకు చిల్లుపెట్టే వాయువుల్లో క్లోరోఫ్లోరోకార్బన్స్ (ఫ్రిజ్‌లు, డియోడరెంట్ క్యాన్లు, షేవింగ్ ఫోమ్, హిట్ వంటి కీటకనాశనుల్లో వాడతారు) ముఖ్యమైనవి కాగా.. హైడ్రో క్లోరోఫ్లోరో కార్బన్స్, హాలోన్స్, మిథైల్ బ్రోమైడ్స్ వంటివీ ప్రమాదకరమైనవే. మన కంప్యూటర్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను శుభ్రం చేసేందుకు వాడే సాల్వెంట్స్, కార్ డ్యాష్‌బోర్డు, ఇళ్లు, ఆఫీసుల్లో వేడి నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఫోమ్, అగ్నిమాపక యంత్రాల్లో వాడే రసాయాలన్నీ ఓజోన్ పొరకు చేటు తెచ్చేవే. -
ఆరుగురి ఊపిరి తీసిన విషవాయువు
తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉక్కు పరిశ్రమలో విషవాయువు లీక్ కావడంతో ఆరుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లి సమీపంలో ఉన్న గెర్డావ్ ఉక్కు పరిశ్రమలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని పిగ్ఐరన్ (ముడి ఇనుము)వేడి చేసేందుకు ఉపయోగించే కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ కావడంతో కార్మికులు కుప్పకూలిపోయారు. పరిశ్రమలోని రోలింగ్ విభాగంలో సుమారు 400 అడుగుల లోతు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ పైపు వాల్వును ఓ కార్మికుడు తిప్పడంతో అందులోని వాయువు లీకై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన మరో ముగ్గురు కార్మికులు.. స్పృహతప్పి పడిపోయిన సహచరుడిని బయటికి తీసుకొచ్చేందుకు అండర్‌గ్రౌండ్‌లోకి దిగారు. వారు కూడా లోపలికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఊపిరాడక అక్కడిక్కడే కుప్పకూలి పోయారు. అక్కడికి వచ్చిన మరో ఇద్దరు కార్మికులు కూడా విషవాయువు పీల్చి స్పృహతప్పిపోయారు. ఈ ఘటన తెలిసి పరిశ్రమలో అలజడి రేగింది. కార్మికులందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పృహతప్పి పడిపోయిన వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారందరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈఘటనతో తాడిపత్రిలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. మృతుల్లో వసీం, గురువయ్యలు పరిశ్రమ సిబ్బంది కాగా గంగాధర్, లింగమయ్యలు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ డిల్లీరావు, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ఆర్డీఓ మలోల హుటాహుటీన తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: కార్మికులు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని, అయితే పరిశ్రమ యాజమాన్యం వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించి వెలుగులోకి రానీయ కుండా చేసిందన్నారు. ప్రశ్నించిన కార్మికులపై యాజ మాన్యం బెదిరింపులకు దిగుతోందని చెప్పారు. రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.. మృతి చెందిన వారి కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం రూ. 50 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో అఖిలపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. అయితే టీడీపీకి చెందిన కొందరు నాయకులు రూ. 5 లక్షల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల రంగప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు ఆందోళన చేస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.రమేశ్‌రెడ్డి, పైల నరసింహయ్య తేల్చిచెప్పారు. పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేస్తాం.. గెర్డావ్ స్టీలు పరిశ్రమలో జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని, ఇప్పటికే క్రిమినల్ కేసు కూడా నమోదు చేశామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తామని జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన ఘటనపై విచారణను ఇప్పటికే ప్రారంభించామని పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తెలిపారు. పరిశ్రమలో ఉన్న సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అన్న వివరాలు విచారణలో తెలియాల్సి ఉందన్నారు. మృతులు: 1. రంగనాథ్ (21) (తాడిపత్రి మండలం బోడాయిపల్లి), 2.గంగాధర్ (35) (అనంతపురం జిల్లా తుమ్మళ్ల మార్కపల్లి), 3.వసీమ్ (37) (కర్నూలు జిల్లా బేతంచెర్ల), 4.లింగయ్య (35) (వైఎస్సార్ జిల్లా కోడిగాండ్లపల్లి), 5.గురువయ్య (37) (ప్రకాశం జిల్లా గాండ్లపల్లి), 6.మనోజ్ (25) (అనంతపురం జిల్లా తాడిపత్రి). వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులు మృతి చెందడం పట్ల ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పరి పరిశోధన
తాగుడును దూరం చేసే జన్యుమార్పులు! తాగుడు అలవాటును అధిగమించేలా మనిషి పరిణమిస్తున్నాడా? అవునంటున్నారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. మానవుల్లో ఏ రకమైన మార్పులు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపారు. ఇప్పటికే పూర్తయిన దాదాపు వెయ్యి జన్యుక్రమ ప్రాజెక్టుల సమాచారాన్ని ఇందుకోసం విశ్లేషించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన 2500 మంది డీఎన్ఏ వివరాలను పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ఆఫ్రికా సంతతి వ్యక్తుల్లో మలేరియా వ్యాధికి నిరోధకత పెరుగుతూండగా, యూరోపియన్లలో ఒక అమినో యాసిడ్‌లో మార్పులు నమోదయ్యాయి. అలాగే నియాండెర్తల్ జాతికి సంబంధించిన మానవులతో కలవడం వల్ల వచ్చిన రెండు డీఎన్ఏ ముక్కలు అలాగే ఉన్నట్లు తెలిసింది. చివరగా ఏడీహెచ్ అనే జన్యువులో వచ్చిన మార్పు. ఈ జన్యువు శరీరంలో ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది మద్యాన్ని విడగొట్టి అసిటాల్డీహైడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జన్యువులో వచ్చిన మార్పులు భవిష్యత్తులో శరీరాన్ని మద్యం ప్రభావం నుంచి రక్షించేదిగా ఉందని శాస్త్రవేత్తల అంచనా. మద్యాన్ని వేగంగా విడగొట్టడం ద్వారా తాగుబోతులకు జబ్బు పడిన అనుభూతిని ఇవ్వడం ద్వారా ఈ జన్యువు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యాంటీబయాటిక్‌ల ప్రభావాన్ని పెంచే కార్బన్ మోనాక్సైడ్! కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు కారణంగా యాంటీబయాటిక్ మందుల ప్రభావం గణనీయంగా వృద్ధి చెందుతుందని జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. మెట్రోనైడజాల్ అనే యాంటీబయాటిక్‌కు కార్బన్ మోనాక్సైడ్‌ను జోడించి ప్రయోగించినప్పుడు హెచ్.పైలోరీ రకం బ్యాక్టీరియా వేగంగా నాశనమైందని వీరు జరిపిన ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. కడుపులో పుండ్లు అయ్యేందుకు ఈ హెచ్.పైలోరీ కారణమవుతుందన్నది తెలిసిన విషయమే. కార్బన్ మోనాక్సైడ్‌తో కలిపి ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్ ప్రభావం 25 రెట్ల వరకూ ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ బింగే వాంగ్ తెలిపారు. బ్యాక్టీరియా యాంటీబయాటిక్‌కు స్పందించకపోవడం నిరోధకత కాదని, చాలా సందర్భాల్లో అవి మందులకు అలవాటుపడిపోవడం వల్ల యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయని ఆయన వివరించారు. బ్యాక్టీరియాను మళ్లీ మందులకు సున్నితంగా మారిస్తే అవి వాటి ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. గాఢత ఎక్కువగా ఉండే విషంలా పనిచేసే కార్బన్ మోనాక్సైడ్‌ను అతి తక్కువ సాంద్రతల్లో వాడినప్పుడు మాత్రం చికిత్సకు ఉపయోగపడుతుందని తాము గుర్తించినట్లు చెప్పారు. శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే ఈ వాయువు వాపును తగ్గించడమే కాకుండా.. బ్యాక్టీరియా, వైరస్‌లకు కణాలు ప్రతిస్పందించే గుణాన్ని కూడా పెంచుతాయని చెప్పారు. కూల్‌డ్రింక్స్‌తో కేన్సర్ ముప్పు... చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉన్న వారికి ఊబకాయ సంబంధిత కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని మెల్బోర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఒకటి తెలిపింది. దాదాపు 35 వేల మంది అలవాట్లను పరిశీలించి జరిపిన విశ్లేషణ ద్వారా కూల్‌డ్రింక్స్ 11 రకాల కేన్సర్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఊబకాయానికి సంబంధించినవే అయినప్పటికీ అధ్యయనంలో పాల్గొన్న వారు మాత్రం ఊబకాయులు కాకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిత్యం కూల్‌డ్రింక్స్ తాగేవారితో పోలిస్తే కృత్రిమ చక్కెరలతో కూడిన డైట్ కూల్‌డ్రింక్స్ తాగే వారికి వ్యాధి ముప్పు తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలిసిందని అలిసన్ హాడ్జ్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. అధిక చక్కెర... ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చునని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేస్తూండగా.. కేన్సర్ కారకమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఒక పరిశోధనలో చక్కెరలు కేన్సర్ కణాలను ఎలా ప్రేరేపితం చేస్తాయో స్పష్టం అవడమే కాకుండా.. చక్కెరలు కణతి ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ యూనివర్శిటీ జరిపిన అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. కేన్సర్ల నివారణకు చక్కెరలను పూర్తిస్థాయిలో త్యజించడమూ అంత మంచిదేమీ కాదని, కణాలకు అవసరమైన శక్తి గ్లూకోజ్ ద్వారానే లభిస్తుందన్న విషయం మరువరాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
నెట్లో చూసి.. నొప్పిలేకుండా టెకీ ఆత్మహత్య
ఇంటర్నెట్.. రెండువైపులా పదునున్న కత్తి. దాన్ని విజ్ఞానానికీ వాడొచ్చు, వినాశనానికీ వాడొచ్చు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాన్ని ఏకంగా ఆత్మహత్యల కోసం కూడా వాడేస్తున్నారు. ఢిల్లీలో ఉండే ఓ పాతికేళ్ల వెబ్ ఇంజనీర్.. ఆన్లైన్లో కార్బన్ మోనాక్సైడ్ తెప్పించుకుని, దాన్ని పీల్చి ఏమాత్రం నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. శాస్త్రీయ పరిశోధన కోసం తనకు కార్బన్ మోనాక్సైడ్ కావాలని చెప్పి చిన్న సిలిండర్ తెప్పించుకున్న అతడు.. ఓ పెద్ద పాలిథిన్ కవర్ తీసుకుని, అందులో తన ముఖంతో పాటు సిలిండర్‌ను కూడా కలిపి పెట్టుకుని, కింద మొత్తం గట్టిగా మూసేశాడు. అప్పటికే సిలిండర్ వాల్వు తెరిచి ఉంచడంతో అందులోంచి వచ్చిన గ్యాస్ పీల్చి.. నొప్పి తెలియకుండా తక్కువ సమయంలోనే ప్రాణాలు వదిలేశాడు. అనుకోకుండా కార్బన్ మోనాక్సైడ్ పీల్చి చనిపో్వడం సాధారణమేనని, కానీ.. ఇలా కావాలనే ఆ వాయువుతో ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుధీర్ గుప్తా తెలిపారు. అతడు నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకునే విధానాల కోసం ఇంటర్నెట్ గాలించినట్లు కూడా ఆ తర్వాత తెలిసింది. అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని బాత్రూంలో అతడి శవం పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ వాయువు ఎలా చంపుతుంది కార్బన్ మోనాక్సైడ్ మనుషులను ఎలా చంపుతుందన్న విషయాన్ని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు డాక్టర్ చిత్తరంజన్ బెహరా వివరించారు. ''వాసన, రంగు లేని.. ఏమాత్రం శారీరక ఇబ్బంది కలిగించని వాయువు. ఇది ఆక్సిజన్ కన్నా 200 రెట్లు ఎక్కువగా రక్తంలోని హెమోగ్లోబిన్‌తో కలిసిపోతుంది. రక్తంలోని ఆక్సిజన్ బదులు మొత్తం ఇది వ్యాపించి, చివరకు మెదడుకు కూడా ఆక్సిజన్ అందకుండాపోయి.. వెంటనే మరణం సంభవిస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ గాఢతతో ఈ వాయువు వ్యాపిస్తే.. చాలా తక్కువ సమయంలోనే ప్రాణం పోతుంది. ఈ కేసులో ఇలాగే జరిగింది'' అని ఆయన తెలిపారు.