జిల్లాలో నిరంతరం కార్డన్‌సెర్చ్
సదాశివపేట(సంగారెడ్డి): జిల్లా వ్యాప్తంగా స్థానికేతరులు ఎక్కువగా నివసిస్తున్న పట్టణాల పరిధిలోని కాలనీల్లో నిరంతరం కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పట్టణ పరిధిలోని సిద్దాపూర్ కాలనీలో 150 మంది పోలీసు సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటిలో నివసిస్తున్న ప్రజలను నిద్రలేపి వారి ఆధార్, రేషన్ తదితర వివరాలను తెలుసుకున్నారు. వాహనాలను తనిఖీ చేశారు. ఈ కార్డన్‌సెర్చ్ ఉదయం 7 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్థానికేతరులు ఎక్కువగా నివసిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిసారించడమే కార్డన్‌సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
స్థాని కేతరులు అద్దె కావాలని వస్తే వారి గుర్తింపుకార్డులతో తెలుసుకుని అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సిద్దాపూర్ కాలనీలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో 53 బైక్‌లు, 6 ఆటోలను సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేశామన్నారు. సరైన ధ్రువపత్రాలు పోలీస్ స్టేషన్లో చూపించి తమ తమ వాహనాలను తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్, ఇన్స్పెక్టర్లు సురేం దర్‌రెడ్డి, నరెందర్, రా మకృష్ణారెడ్డి, తిరుపతిరాజు, 14 మం ది ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.