career best ranking
-
టి20 కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో రాహుల్
దుబాయ్: న్యూజిలాండ్‌తో ముగిసిన టి20 సిరీస్‌ను 5–0తో భారత్ క్లీన్‌స్వీప్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన భారత బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ టి20 ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను నాలుగు స్థానాలు పురోగతి సాధించాడు. దీంతో 823 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను సాధించాడు. భారత సారథి విరాట్ కోహ్లి తొమ్మిది, రోహిత్ శర్మ పదో స్థానాల్లో ఉన్నారు. ఇదే సిరీస్‌లో రాణించిన శ్రేయస్ అయ్యర్ 55వ, మనీశ్ పాండే 58వ స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో పాకిస్తాన్ టి20 సారథి బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా 11వ, చహల్ 30వ, శార్దుల్ ఠాకూర్ 57వ, నవదీప్ సైనీ 71వ, రవీంద్ర జడేజా 76వ స్థానాల్లో నిలిచారు. -
కెరీర్ బెస్ట్‌ర్యాంకులో కోహ్లి
దుబాయ్: అద్భుత ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కెరీర్లో ఉత్తమ ర్యాంక్‌ను సాధించాడు. మంగళవారం ఐసీసీ ప్రకటించిన తాజా జాబితాలో అతడు ఒక స్థానం ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లి పరుగుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నంబర్‌వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కన్నా తను 11 పాయింట్లు మాత్రమే వెనకబడ్డాడు. మురళీ విజయ్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 24వ ర్యాంకులో, జయంత్ యాదవ్ 56వ ర్యాంకులో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ ఆర్.అశ్విన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 904 రేటింగ్ పాయింట్లతో ఉన్న అశ్విన్.. మురళీధరన్ (920) తర్వాత రెండో అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలోనూ ఈ చెన్నై బౌలర్ తన టాప్ ర్యాంకును కాపాడుకున్నాడు.