careless driver
-
యువతి చేతికి బస్సు స్టీరింగ్.. ప్రాణాలు గాల్లో కలిసేవి!
ప్రయాణికులతో నిండిన ఓ బస్సును నడిపించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించాడో డ్రైవర్. అతని అజాగ్రత్త వల్ల బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసేవి. ఆ డ్రైవర్ ఏం చేశాడంటే.. ప్రయాణికులతో నిండిన బస్సును తాను నడపకుండా ఓ విద్యార్థినికి స్టీరింగ్ ఇచ్చాడు. ఆమె బస్సును ప్రమాదకరంగా నడిపించింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఉధంపూర్-లాండర్ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సులో డ్రైవర్.. బస్సు స్టీరింగ్‌ను ఓ యువతి చేతికి ఇచ్చాడు. పైగా అది ఒక కొండ మార్గం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా బస్సు లోయలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆ నిర్లక్ష్యంగా సదరు యువతితో బస్సును ప్రమాదకరంగా నడిపించాడు. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అది కాస్త జమ్ముకశ్మీర్ ట్రాన్స్పోర్ట్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి.. యువతి డ్రైవ్ చేసిన బస్సును సీజ్ చేసినట్లు తెలిపారు. ఆ డ్రైవర్‌పైన అధికారులు చర్యలు చేపట్టి డ్రైవింగ్ లైసెన్స్, వాహనం పర్మిట్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అతని నిర్లక్ష్యంపై ప్రశ్నించేందుకు అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు డ్రైవర్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. #ViralVideo of negligent #driving: Careless driver lets a girl student drive a #bus full of passengers in J&K's #Udhampur. The license & permit of the driver has now been suspended for endangering lives of passengers. pic.twitter.com/AtdeBWQw4C — India.com (@indiacom) April 18, 2022 -
అయ్యో..ఎంత ఘోరం, ఒక్కరి నిర్లక్ష్యం.. ముగ్గురి ప్రాణాలు గాల్లోకి
మేడ్చల్(హైదరాబాద్): పనులు ముగించుకుని ఇంటికి బైకుపై బయలుదేరిన ఓ యువకుడు..మూడేళ్ల కుమారునితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరుగుపయనమైన ఓ మహిళ అకస్మాత్తుగా మృత్యుఒడికి చేరుకున్నారు. ఓ కారు డ్రైవర్ అతివేగం..నిర్లక్ష్యం కారణంగా...వారి ప్రమేయం లేకుండానే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి బంధువులకు దు:ఖాన్ని మిగిల్చారు. ఈ విషాదకర సంఘటన శనివారం సాయంత్రం మేడ్చల్ శివారులోని రేకులబావి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు..సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొల్తూర్ గ్రామానికి చెందిన సుధీర్ వర్మ (25) మేడ్చల్‌లో పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అలాగే మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లావణ్య (30), కుమారుడు కౌశిక్ (3)తో కలిసి శామీర్‌పేట్ మండలం జగన్‌గూడ గ్రామంలోని తమ బంధువుల ఇంటి వెళ్లి ప్యాసింజర్ ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో వీరి వాహనాలు రేకుల బావి వద్దకు రాగానే..రోడ్డుకు ఆవలివైపు తూప్రాన్ వైపు వెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి.. వేగంగా ఇవతలికి ఎగిరి పడి ముందు బైకును..ఆ తర్వాత ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో సుధీర్‌వర్మ, లావణ్యలు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా..కౌశిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు గాయపడ్డారు. కారు డ్రైవర్ అతివేగం..నిర్లక్ష్యం కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. కాగా ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. కారులో డ్రైవర్‌తో పాటు మరో మహిళ ఉన్నారని, వారికి కూడా గాయాలైనట్లు సమాచారం అందిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మేడ్చల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కరి నిర్లక్ష్యం.. మూడు నిండు ప్రాణాలు కారు డ్రైవర్ నిర్లక్ష్యం అమాయకులైన ముగ్గురి ప్రాణాలు తీసిందని స్థానికులు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు అడ్డూ అదుపూ లేని వేగంతో వెళ్తున్నాయని, దీంతో ఎంతో మంది స్థానికులు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. చదవండి: ఒంటరి ప్రయాణికులనే సెలక్ట్ చేసుకుని.. ఆపై.. -
డ్రైవింగ్ లైసెన్స్ చెల్లదు, ఆపై మద్యం తాగి నిర్లక్ష్యంగా..
హైదరాబాద్: అసలే చెల్లని డ్రైవింగ్ లైసెన్స్..ఆపై మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరిని బలిగొన్న టిప్పర్ లారీ డ్రైవర్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లకపోయినప్పటికీ అతడికి వాహనం ఇచ్చిన టిప్పర్ యజమానిపై కూడా కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లి నివాసి ఉప్పర సుంక రామాంజనేయులు (53) భవన నిర్మాణ సూపర్వైజర్. ఈ నెల 14న రాత్రి 10.20 గంటలకు కూకట్పల్లి బీజేపీ కార్యాలయం వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ (ఏపీ29టి157) ఢీకొట్టింది. తీవ్రగాయాలైన రామాంజనేయులను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం విదితమే. అయితే ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ గాజులరామారం కైసర్‌నగర్‌కు చెందిన డ్రైవర్ షేక్‌పాషా మద్యం తాగి వాహనం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా చెల్లని డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైనట్టు తేల్చారు. దీంతో షేక్‌పాషాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టిప్పర్ యజమాని షేక్ రహీంపై కూడా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి బస్టాండ్ లో మృత్యు శకటంగా మారి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఓ ప్రయాణికుడి ప్రాణాలను బలిగొంది. మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట గ్రామానికి చెందిన గుంటి లక్ష్మణ్ (35) హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం బస్టాండ్‌లో వేచి చూస్తున్నాడు. బస్సు ఫ్లాట్పాం పైకి దూసుకొచ్చి ఢీకొనడంతో లక్ష్మన్ అక్కడి కక్కడే మృతి చెందాడు. బతుకుదెరువు కోసం పట్నం పోదామని ఇంటి నుంచి బయలుదేరిన అతడిని ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. బస్టాండ్‌లో బస్సు కోసం నిరీక్షిస్తూ కుర్చీలో కూర్చుండగా బస్సు రూపంలో మృత్యువు దూసుకురావడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట గ్రామానికి చెందిన గుంటి లక్ష్మణ్(35) కొంత కాలం పాటు వీఆర్ఏగా పని చేశాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ప్రైవేట్ కార్మికుడిగా చేసుకుంటూ జీవనం సాగించడం కోసం బావమరిది ప్రశాంత్‌తో కలిసి ఇంటి నుంచి బయలుదేరాడు. ప్రశాంత్ డబ్బులు తీసుకోచ్చేందుకు ఏటీఎంకు వెళ్లగా, లక్ష్మణ్ బస్టాండ్‌లోని హైదరాబాద్ బస్సులు వెళ్లే 1వ నంబర్ ప్లాట్ ఫాం వద్ద కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా స్టాప్ ముందు నిలిపి ఉంచిన నాన్‌స్టాప్ బస్సు (ఏపీ 29 జెడ్ 3315) ఒక్కసారిగా ప్లాట్ ఫాంలోకి దూసుకువచ్చి పిల్లర్‌ను డీకొట్టింది. బస్సు, పిల్లర్ మధ్య ఇరుక్కుపోయిన లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి స్వల్పగాయాలు కాగా కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. బస్సులోనికి దూసుకు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో రామకృష్ణ, ఎస్సైలు రవికుమార్, గోవింద్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. డ్రైవర్ ఇంద్రసేనారెడ్డి నిర్లక్ష్యంతోనే లక్ష్మణ్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో బైఠాయించారు. రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని, మృతుని భార్య శోభకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్టీసీ డీవీఎం గణపతిరాజు ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం వచ్చే లబ్ధిని మృతుని కుటుంబానికి తప్పనిసరిగా అందజేస్తామని, ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఆందోళనకారులు శాంతించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ ఇంద్రసేనారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సాంకేతిక లోపాల కారణంగానే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నా.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మిన్నంటిన రోదనలు బస్టాండ్ ఆవరణలో లక్ష్మణ్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ దృశ్యాలను చూసి బస్టాండ్‌లోని ప్రయాణికులు సైతం కంటతడి పెట్టారు. పెద్ద ఎత్తున ఫరీద్‌పేట్ గ్రామస్తులు తరలివచ్చారు. విచారణ చేపడుతాం ప్రమాదానికి గల కారణాలపై విచారణ కమిటీ వేశాం. విచారణ జరుపుతున్నాం. కమిటీ నివేదిక తర్వాత ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తాం. – డీవీఎం గణపతిరాజు -
మృత్యువులా దూసుకొచ్చిన బస్సు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి జంక్షన్.. సోమవారం ఉదయం 6.30 గంటలు.. వీకెండ్లో బెంగళూరులోని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిండు సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతనితో పాటు స్నేహితుడు కూడా బెంగళూరు వెళ్లి వచ్చాడు. ఇద్దరూ రోడ్డు దాటుతుండగా వీరి కోసం ఇద్దరు ఆటోడ్రైవర్లు వచ్చారు. అకస్మాత్తుగా ఓ సిటీ బస్సు వీరిపైకి మృత్యువులా దూసుకొచ్చింది. బస్ బేలో నిలుచున్న వీళ్లను గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి జనార్ధన్ శివాజీ(35), ఆటోడ్రైవర్ దశరథ్(45), అబ్దుల్ హమీద్(53) అక్కడికక్కడే మృతి చెందారు. జనార్ధన్ స్నేహితుడు వికాస్ ప్రతాప్ సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద వివరాలను రాయదుర్గం సీఐ రాంబాబు మీడియాకు వెల్లడించారు. నగరంలోని క్యాప్ జెమినీలో పని చేస్తున్న బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చెందిన జనార్థన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ ప్రతాప్ సింగ్‌లు ఇద్దరు స్నేహితులు. అమెరికాలో ఉన్న వీరు 10 రోజుల క్రితమే బదిలీపై హైదరాబాద్‌కు వచ్చారు. వీకెండ్ సెలవులకు బెంగళూర్ వెళ్లారు. ఆదివారం రాత్రి ఇద్దరూ హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో రాయదుర్గం వైపు వెళ్లే బస్ స్టాప్‌కు నడుచుకుంటూ వస్తున్నారు. వీరి కోసం నానక్‌రాంగూడకు చెందిన బత్తుల దశరథ్ , పాతబస్తీ నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన అబ్ధుల్ హమీద్ ఆటోడ్రైవర్లు వెళ్లారు. అదే సమయంలో లింగంపల్లి నుంచి కోఠికి వెళ్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు (ఏపీ11జడ్6172) వేగంగా బస్టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇరువైపుల నుంచి వచ్చిన ఈ నలుగురిని ఢీకొట్టింది. జనార్ధన్ తలపై నుంచి చక్రం వెళ్లడంతో తల చిద్రమైంది. బస్సు చక్రం వద్ద ఇరుక్కుని ఆటోడ్రైవర్లు అక్కడిక్కడే మృతి చెందారు. వికాస్ ప్రతాప్ బయటి వైపు పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే అతన్ని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ జహంగీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశరథ్కు భార్య ఉషారాణి, కూతురు ప్రణవి, కొడుకు ధనుష్ ఉన్నారు. అబ్దుల్ హమీద్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులున్నారు. కుటుంబానికి అతడే ఆధారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞాపకాల తడి ఆరకుండానే..... జనార్ధన్ తాను పని చేస్తున్న కంపెనీ విధుల్లో భాగంగానే ఇటీవల వరకు అమెరికాలో ఉండి వచ్చాడు. అతనికి భార్య సుకన్య, కూతురు తనిష్క (7), 7 నెలల కొడుకు సాయి దివిజ్ ఉన్నారు. భర్త అమెరికాలో ఉండటంతో సుకన్య మధురైలోని పుట్టింటికి వెళ్లి అక్కడే సాయికి జన్మనిచ్చింది. జనార్ధన్‌కు హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆమె పిల్లలను తీసుకొని బెంగళూర్‌లోని అత్తారింటికి వచ్చింది. వీకెండ్లో భార్యాపిల్లలు, అమ్మానాన్నలతో జనార్ధన్ సంతోషంగా గడిపాడు. ఆ జ్ఞాపకాలతోనే ఆదివారం బస్సెక్కాడు. కానీ ఆ జ్ఞాపకాల తడి ఆరకుండానే మృత్యువు రూపంలో బస్సు బలి కబలించింది. జహంగీర్ నిర్లక్ష్యమే కొంప ముంచింది... వేగాన్ని తగ్గించకుండా డ్రైవర్ జహంగీర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని, దీంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని సీఐ రాంబాబు అభిప్రాయపడ్డారు. డ్రైవర్ బ్రేక్ వేసినా, నెమ్మది నడిపినా ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదన్నారు. బస్ బే వైపు వస్తున్న వారిని గమనించకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 2013లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరిన జహంగీర్ అదే ఏడాది జూబ్లీహిల్స్‌లో ఓ మహిళను ఢీకొట్టి ఆమె మృతికి కారణమయ్యాడు. అప్పుడు ఉద్యోగం నుంచి తొలగించగా, మెర్సీ పిటిషన్‌పై మళ్లీ విధుల్లో చేరాడు. ఒక్కసారిగా మీదికి దూసుకొచ్చింది: వికాస్ ‘‘వేగంగా వచ్చిన బస్సు స్టాప్‌లో ఆగుతుందని అనుకున్నాం. బస్బే దాటుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో జనార్ధన్ ముందు టైర్ కింద పడిపోయాడు. నేను పక్కకు పడ్డాను. వెంటనే డ్రైవర్ బస్సును ఎడమ వైపునకు కట్ చేయడంతో మా కోసం వస్తున్న ఆటోడ్రైవర్లు కూడా బస్సు కిందికి వెళ్లిపోయారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అడ్డదిడ్డంగా బస్‌బేలు: విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సైబరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఆర్డీసీఎల్ ట్రాఫిక్ పోలీసులతో ఎలాంటి సమన్వయం లేకుండా బస్‌బేలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్వర్టైజ్ ఏజెన్సీల కోసం ఎక్కడపడితే అక్కడ బస్‌బేలు నిర్మిస్తున్నారు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. జంక్షన్లలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించాం’’అని చెప్పారు. ప్రమాద స్థలంలో ఫుట్‌పాత్‌లపై ఉన్న విద్యుత్ బిల్లుల కౌంటర్ డబ్బాను సీజ్ చేయాలని గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ నర్సింగ్రావును ఆదేశించడంతో అక్రమణలను తొలగించారు. ఇదిలా ఉండగా గచ్చిబౌలిలోని మెహిదీపట్నం వైపు వెళ్లే బస్ స్టాప్ మూలమలుపు వద్దే ఉండటంతో ప్రమాదకరంగా మారింది. బస్ స్టాప్‌ను ముందుకు తరలిస్తే బాగుటుందని ప్రయాణికులు కోరుతున్నారు. -
మొక్కల కోసం వెళుతున్న ఆటో బోల్తా
♦ ఇద్దరి మృతి ♦ అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం శివ్వంపేట: హరితహారంలో నాటేందుకు మొ క్కలు తీసుకురావడానికి వెళుతున్న ఆటో ట్రాలీ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహదారి శివ్వంపేట గ్రామశివారులో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కింద మొక్కలు నాటేందుకు మొ క్కలు అవసరమయ్యాయి. దీంతో నర్సాపూర్‌లోని నర్సరీ నుంచి మొక్కలు తీసుకువెళ్లేందుకు చిన్నశంకరంపేట నుంచి ముగ్గురు కూలీలతో అశోక్‌లేలాండ్ ఆటోట్రాలీ బయలుదేరింది. శివ్వంపేట గ్రా మం దాటగానే ఆటో అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త కారణంగా అదుపు తప్పి రోడ్డు కుడివైపునకు వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటో ట్రాలీలో కూర్చున్న కూలీలు చిన్నశంకరంపేట మండలం వె ంకటరావుపల్లెకు చెందిన కాసాల నర్సిం లు(40) ఇదే మండలం గజగట్లపల్లికి చెందిన బర్మద అంసమ్మ(43)లు తీవ్రం గా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిద్దరూ చికిత్స పొందుతూ మృ తిచెందారు. ఆటోలో ముందు కూర్చున్న మరో కూలి పండరి సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో బోల్తాపడగానే డ్రైవర్ పరారయ్యాడు. శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటోలో బయలుదేరిన కూలీలు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.