అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం
పుంగనూరు (చిత్తూరు): చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బోడినాయనిపల్లి దళితవాడ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు చింతచెట్లను భారీగా నరికివేశారు. అయితే రాష్ట్ర అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారు. నరికివేతకు గురైన చింతచెట్లు వందేళ్ల నాటివని, అటవీశాఖ అధికారులు వీటి విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.