మహిళపై కారులో యువకుల అత్యాచారయత్నం
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మహిళను కారులో తీసుకు వెళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులు ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.