carotene
-
నారింజ పండులా ఉంటుంది.. కానీ తొక్కతో పాటు తినేయొచ్చు
కుమ్ఖాత్ సిట్రస్ జాతి పండు. నారింజలాగే ఉంటుంది. కానీ, గుండ్రంగా కాకుండా కోడి గుడ్డు మాదిరిగా ఓవెల్ ఆకారంలో చిన్నగా (1–2 అంగుళాలు) ఉంటుంది. చైనా దీని పుట్టిల్లు. 500 ఏళ్ల క్రితం దీన్ని ఫార్చునెల్లా అని పిలిచేవారట. చైనీస్ భాషలో గామ్ (అంటే బంగారం), గ్వాత్ (టాంగెరిన్స్కు మరో పేరు) మాటల కలయిక వల్ల కుమ్ఖాత్ అనే పేరు ఈ పంటకు, పండుకు స్థిరపడింది. 400 ఏళ్ల క్రితమే ఈ పంట యూరప్‌కి, అమెరికాకు చేరింది. ఇది అతి చలిని, అతి వేడిని కూడా తట్టుకొని బతకగల విలక్షణ నారింజ జాతి పంట. దీన్ని తొక్క తీపిగా ఉంటుంది. దాంతో పాటుగా తినేయొచ్చు. కుమ్ఖాత్ పండ్లు వగర, పులుపు, కొద్దిగా తీపి కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. కట్ చెయ్యాల్సిన అవసరం లేకుండా నోట్లో పెట్టుకొని తినెయ్యగలిగే ఈ పండ్లలో విటమిన్ సి, పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, మాంగనీసు, రాగి, కాల్షియం తదితర పోషకాలు కూడా ఉన్నాయి. కుమ్ఖాత్ పండులోని విత్తనాలు కూడా తినదగినవే. ఆరోగ్యదాయకమైన ఒమెగా –3 ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. నీటి శాతం కూడా ఎక్కువే. కుమ్ఖాత్ పండ్ల జాతిలో అనేక రకాలున్నాయి. జనాదరణ పొందిన రకాలు.. నగమి, మరుమి, మీవ. మురుమి, మీవ కుమ్ఖాత్ రకాల పండ్లు గుండ్రంగా ఉంటాయి. ఓవెల్ షేప్‌లో కొంచెం పుల్లగా ఉండే నగమి పండ్ల కన్నా తియ్యగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్నారింజ జాతి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ పండ్లు బ్లడ్ గ్లూకోజ్‌ను పెంచవు. అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున కుమ్ఖాత్ పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.అధిక పీచుకుమ్ఖాత్ పండ్లలో పీచుతో కూడిన సంక్లిష్ట పిండిపదార్థాలుంటాయి. కాబట్టి, జీర్ణకోశంలో ఎక్కువ సేపు అరిగిపోకుండా ఉంటాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. దీనిలోని జీర్ణమయ్యే పీచుకు విరేచనాలను అరికట్టే గుణం ఉంది. ఇది జీర్ణకోశంలోని అదనపు నీటిని పీల్చుకొని, జెల్ మాదిరిగా ఏర్పడుతుంది. అందువల్ల, ఎక్కువ సార్లు విరేచనాలు అవుతూ ఉంటే గుప్పెడు కుమ్ఖాత్ పండ్లు నోట్లో వేసుకుంటే సరి.ఆరోగ్యదాయకమైన కొవ్వులుకుమ్ఖాత్ పండ్లలో కొవ్వు చాలా తక్కువ. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు వారి దినసరి ఆహారంలో కుమ్ఖాత్ పండ్లను చేర్చుకుంటే మంచిది. ఈ పండ్లలోని విత్తనాలను కూడా నమిలి తినాలి. ఈ విత్తనాల్లో ఒమెగా ఫాటీ ఆసిడ్లు ఉంటాయి కాబట్టి దేహంలో బాడ్ కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.యాంటీఆక్సిడెంట్‌గా ఉపయోగంకుమ్ఖాత్ పండ్లలో విటమిన్ ఎ, సి వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ దేహంలో ఎక్కువైతే కణ నిర్మాణం దెబ్బతింటుంది. మన దేహంలో ఫ్రీ రాడికల్స్ కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కుమ్ఖాత్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గిస్తాయి.గుండె ఆరోగ్యానికి మేలుకుమ్ఖాత్ పండ్లలోని విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ వంటి పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోయి గుండెపోటు రాకుండా చూస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మొత్తంగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఎల్‌డిఎల్‌ను తగ్గించటం ద్వారా గుండె సమస్యల్ని నిరోధిస్తాయి.ఇన్ఫ్లమేషన్కు చెక్కుమ్ఖాత్ పండ్లలో కీంప్‌ఫెరాల్, లుటియోలిన్, హెస్పెరిడిన్, క్యుఎర్సెటిన్, సి–గ్లైకోసైడ్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. సి–గ్లైకోసైడ్ దేహంలో వాపును నివారించే గుణం కలిగిఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. రోగనిరోధక వ్యవస్థలో ఇన్ఫ్లమేటరీ రీయాక్షన్ను, ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ పుట్టుకను తగ్గించటంలో సి–గ్లైకోసైడ్ ఉపయోగపడుతుంది.యాంటీబాక్టీరియల్ ప్రభావంకుమ్ఖాత్ పండు తొక్కలోని నూనెకు సూక్ష్మక్రిములను హరించే గుణం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆహార పదార్థాలపై పెరిగే బూజు, సూక్ష్మజీవులను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఇది దోహదం చేస్తుంది.కేన్సర్‌నూ అరికడుతుందికుమ్ఖాత్ పండులో ఉండే అపిజెనిన్ అనే ఫ్లేవనాయిడ్ కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. అపిజెనిన్ కేన్సర్ కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలకు సోకకుండా అరికట్టగలుగుతుందని భావిస్తున్నారు.ఊబకాయాన్ని తగ్గిస్తుందికుమ్ఖాత్ పండ్లలోని పోన్సిరిన్ అనే ఓ ఫ్లావనాయిడ్ ఊబకాయాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేహం కొత్త కొవ్వు కణాలను తయారు చేసుకోకుండా అడ్డుకోవటం ద్వారా బరువు పెరగకుండా ఉండేందుకు పోన్సిరిన్ దోహదపడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనితో పాటు ఈ పండ్లలోని అధిక పీచుపదార్థం కడుపులో ఎక్కువ సేపు దన్నుగా ఉండటం వల్ల ఆకలి భావనను త్వరగా కలగనివ్వదు.కంటి చూపునకు మంచిదికుమ్ఖాత్ పండ్లలో బీటా కరోటెన్ రూపంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఈ పండ్లలో ఉన్న 11 కెరొటెనాయిడ్లలో ఇదొకటి. బీటీ కరోటెన్, జియాక్సాంతిన్, లుటీన్ వంటి కెరొటెనాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఎ తోడ్పాటుతో రోడోస్పిన్ ఉత్పత్తి అవుతుంది.మూడ్ డిజార్డర్లకూ... వత్తిడి సమస్యలను, మూడ్ డిజార్డర్లను, నిద్ర సమస్యలను విటమిన్ సి ఆహారాలు అరికడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వత్తిడి, కుంగుబాటు, ఆందోళనల తీవ్రతను తగ్గించటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీడిప్రెసెంట్ మాదిరిగా కుమ్ఖాత్ పండ్లు పనిచేస్తాయి. ఆరోగ్యదాయకమైన నిద్రకు దోహదం చేస్తాయి. అయితే, అది ఏ విధంగా దోహదపడతాయో ఇంకా స్పష్టంగా తెలియదు.ఎముక పుష్టికి.. ఎముక పెరుగుదలలో విటమిన్ సి పాత్ర కీలకమైనది. విటమిన్ సి కొల్లజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. కుమ్ఖాత్ పండ్లలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయే ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలను విటమిన్ సి తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల నుంచి కాల్షియంను హరించే యాసిడ్ ఫుడ్స్ ఎముక సమస్యల్ని పెంచుతాయి. కుమ్ఖాత్ పండ్లు ఆల్కలిన్ ఫ్రూట్స్ కాబట్టి ఆస్టియోపోరోసిన్కు దారితీయకుండా కాపాడుతాయని చెప్చొచ్చు.రోగనిరోధక శక్తి కుమ్ఖాత్ పండ్లలోని బీటా–క్రిప్టోక్సాంతిన్, ఎల్–లైమోనెనె మన దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. సహజ సిద్ధమైన కిల్లర్ సెల్స్ కార్యకలాపాలను పెంపొందించటం ద్వారా దేహంలో మెటబాలిక్ స్ట్రెస్‌ను తగ్గించటంలో ఇవి ఉపయోపడతాయి.చదవండి: పొలాల్లో రసాయనాల వాడకంతో మనుషుల్లో జబ్బుల పెరుదలకుమ్ఖాత్ పోషక విలువలు: 100 గ్రాముల కుమ్ఖాత్ పండ్లలో పోషకవిలువలు ఇలా ఉంటాయి... శక్తి : 71 కిలోకేలరీలు; పిండిపదార్థాలు : 15.9 గ్రా; మాంసకృత్తులు : 1.8 గ్రా; కొవ్వు : 0.8 గ్రా; పీచు : 6.5 గ్రా; విటమిన్ ఎ : 15 మిల్లీ గ్రాములు; విటమిన్ సి : 43.9 ఎం.జి; రిబొఫ్లేవిన్ : 0.09 ఎం.జి; క్లోరిన్ : 8.4 ఎం.జి; కాల్షియం : 62 ఎం.జి; ఐరన్ : 0.87 ఎం.జి; మెగ్నీషియం : 20 ఎం.జి; మాంగనీసు : 0.13 ఎం.జి; జింక్ : 0.17 ఎం.జి; -
ఎప్పుడూ ‘యూత్‌ఫుల్’గానే ఉండాలంటే!
అప్పట్లో ఓ కోలా యాడ్‌లో ఓ ఇంగ్లిష్ జింగిల్ వస్తుండేది. ‘‘ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్... ఇట్స్ గ్రేటు బి యంగ్’’ అని. పూర్తి శరీరాన్నంతటినీ, ఆమాటకొస్తే లోపలి అవయవాలనూ, వాటి కండరాలను కూడా కప్పి ఉంచే చర్మాన్ని యూత్‌ఫుల్‌గా ఉంచేది ‘కొలాజెన్’ అనే ప్రోటీన్. అదెలా పొందవచ్చో, తద్వారా చాలాకాలం టుమధ్యవయసు లుక్‌నూ,వృద్ధాప్య లక్షణాలనూ దూరంగా ఉంచడం ఎలాగో, వయసు పెరుగుతున్నా (ఏజింగ్ జరుగుతున్నా) యూత్‌ఫుల్‌గా నిత్యయౌవనులుగా కనిపించడం ఎలాగో తెలిపే కథనం ఇది. వయసు పెరుగుతుంటే కొందరిలో చుబుకం కింద, కొందరిలో కళ్ల కిందున్న చర్మం కాస్త కాస్తగా జారుతుంటుంది. స్కిన్ జారిపోవడానికి కారణంగా ‘కొలాజెన్’ అనే ప్రోటీన్ లోపించడమే. కొలాజెన్ స్వాభావికంగానే వృద్ధి చెందడానికి ఏయే ఆహారాలు తీసుకోవాలో, అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎలాంటి ప్రక్రియలు అవలంబించవచ్చో తెలుసుకుందాం. కొలాజెన్ అంటే... నిజానికి ఇదో ప్రోటీన్. చర్మంలో ఎక్కువగా ఉంటుంది. కేవలం చర్మంలోనే కాకుండా దేహంలోని అనేక అవయవాల్లో... అంటే కండరాల్లో, ఎముకల్లో, టెండన్స్, కణజాలాల్లో, రక్తనాళాల్లో, జీర్ణవ్యవస్థలోని అన్ని భాగాల్లో... ఆ మాటకొస్తే మనకు ఎక్కడైనా గాయం తగిలినప్పుడు, గాయం మానే సమయాల్లో ఇలా అన్ని ప్రదేశాల్లోనూ ఉంటుంది. ఆహారంతోనే కొలాజెన్ పొందడమెలా? మాంసాహారాల్లో... చికెన్ ♦ చేపలు (అందునా ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ట్యూనా, మాకరెల్స్తో టు షెల్ఫిష్ వంటివి) ♦ గుడ్డులోని తెల్లసొన భాగం శాకాహారాల్లో... ♦ అన్ని రకాల నిమ్మజాతి పండ్లు (అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, కమలాల వంటివి) ♦ బెర్రీ పండ్లు (అంటే... రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటివి) ♦ ట్రాపికల్ ఫ్రూట్స్‌లో (అంటే... మామిడి, జామ, పైనాపిల్, ద్రాక్ష, కివీ... వీటిల్లో ఉండే జింక్ కూడా యాంటీ ఏజింగ్‌కు అదనంగా ఉపయోగపడే పోషకం) వంటలో వాడే పదార్థాల్లో : ♦ వెల్లుల్లి (ఇందులో కొలాజెన్‌ను సమకూర్చే పోషకాలు చాలా ఎక్కువ) ♦ ముదురు ఆకుపచ్చరంగులో ఉండే లకూర లాంటి అన్ని ఆకుకూరల్లో చిక్కుళ్లు ♦ టొమాటో ♦ బెల్పెప్పర్లతో టు ♦ జీడిపప్పు, బాదంపప్పు లాంటి నట్స్‌లో. ♦ ఇవేగాకప్రో టీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అన్ని ఆహారాలూ కొలాజెన్ ఉత్పత్తికి బాగా తోడ్పడతాయి). కొలాజెన్‌కు ప్రతికూలంగా పనిచేసే ఆహారాలు ఇవీ: చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, బాగా రిఫైన్స్ చేసిన కార్బోహైడ్రేట్లు కొలాజెన్‌కు కొంత ప్రతికూలంగా పని చేస్తాయి. కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడే కొన్ని బ్యూటీ ప్రక్రియలు: అలోవేరా జెల్ : అలోవేరా జెల్‌ను చర్మంపై పూయడం, నోటి ద్వారా ‘ఆలో స్టెరాల్స్’ తీసుకోవడం. ఈ ప్రక్రియలు కనీసం ఎనిమిది వారాలు కొనసాగాలి. జిన్సెంగ్ : హెర్బల్ ఉత్పాదన అయిన జిన్సెంగ్ను తీసుకోవడం. దీన్ని టీ, టింక్చర్స్ లేదా సప్లిమెంట్స్‌గా తీసుకోవచ్చు. రెటినాల్స్ అండ్ కెరొటినాయిడ్ సప్లిమెంట్స్: బీటా కెరోటిన్ ఎక్కువగా దొరికే... మాంసాహారాల్లో కాలేయం, శాకాహారాల్లో చిలగడదుంప, గుమ్మడి, క్యారెట్స్ తీసుకోవడం. వైద్యచికిత్సా ప్రక్రియల సహాయంతో... థ్రెడ్స్ ట్రీట్మెంట్: వీటిల్లో ఫ్లోటింగ్, ఫ్రీ, కాగ్ థ్రెడ్స్ అని రకరకాల చికిత్సలు ఉంటాయి. పేషెంట్ అవసరాన్ని బట్టి డాక్టర్ వీటిల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేస్తారు. ప్రభావం నెల తర్వాత తెలుస్తుంది. ఈ చికిత్స ప్రభావం ఏడాది వరకే ఉంటుంది. కాబట్టి మళ్లీ మళ్లీ చేస్తుండాలి. పీఆర్పీ థెరపీ ఫర్ ఫేస్: ఈ చికిత్సలో పేషెంట్స్ నుంచి రక్తాన్ని సేకరించి, అందులోని ప్లేట్లెట్ సేకరించి ముఖానికి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇందులోనే పీఆర్ఎఫ్ (ఫైబ్రిన్), గ్రోత్ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ పీఆర్పీ అనే కొత్త కొత్త చికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. దీన్ని నెలకొకసారి చొప్పున కనీసం 4 – 5 సార్లు చేయాలి. మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ : రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఉపయోగించి ముఖంపై ముడుతలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఫ్రాక్షనల్ సీఓటూ లేజర్ : లేజర్‌ను ఉపయోగించి, ముఖాన్ని తేటగా చేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. హైఫూ : హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అనే మాటకు హైఫూ సంక్షిప్త రూపం. దీన్ని వివిధ తీవ్రతలతో వాడుతూ, సాగిన చర్మాన్ని బిగుతుగా చేయడానికి, డబుల్‌చిన్ తొలగించడానికి ఉపయోగిస్తుంటారు. హైలూరానిక్ యాసిడ్ ట్రీట్మెంట్ : శరీరంపైన పూసే క్రీములు, ఆయింట్మెంట్ల రూపంలోనూ, ఇంజెక్షన్ల రూపంలోనూ, అలాగే స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్స్ ఇస్తారు. దీని వల్ల చర్మానికి మంచి హైడ్రేషన్ సమకూరి, ఏజింగ్ ఆలస్యం అవుతుంది. రెడ్ లైట్ థెరపీ : చర్మాన్ని ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో కూడిన ఎరుపురంగులో ఉండే కాంతి కిరణాలకు ఎక్స్పోజ్ చేయడం వల్ల చర్మంలో, దేహంలో కొలాజెన్ కొంత ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఇదే ప్రధాన థెరపీలాగా కాకుండా... మిగతా చికిత్సలతో టు దీని ఓ అదనపు చికిత్సగానే పరిగణించాలి. ఓరల్ కొలాజెన్ పౌడర్స్ ఎన్రిచ్డ్ విత్ వైటమిన్ సి అండ్ యాంటీఆక్సిడెంట్స్ : ఇవి నోటి ద్వారా తీసుకునే పౌడర్లు. ఇవే గాక ఇలాంటి ఇంజెక్షన్లూ లభ్యమవుతాయి. చేయకూడనివి... లేత ఎండకు ఎక్స్పోజ్ కావడం పరవాలేదు. అది చర్మానికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ తీవ్రమైన ఎర్రటి ఎండ, దేహం కమిలిపోతున్నంత ఎండ వేడిమికి ఎక్స్పోజ్ కాకుండా కాడుకోవాలి. గమనిక : ఎప్పుడైనా, ఎక్కడైనా స్వాభావికాలే మేలు. వైద్య ప్రక్రియలను ఆచరించాలను కుంటే స్వాభావికమైన ఆహారాలనే తీసు కుంటూ, ఈ ప్రక్రియల్నీ తీసుకుంటేనే ఉపయోగం ఉంటుంది. అంతేతప్ప పూర్తిగా వైద్యపరమైన చికిత్సలే కొలాజెన్ పెరుగుదలకు ప్రామాణికాలు కావు. ఒకవేళ కొలాజెన్ వృద్ధి కోసం వైద్యపరమైన ప్రక్రియలను తీసుకోవాల్సి వస్తే పూర్తిగా క్వాలిఫైడ్ డర్మటాలజిస్టుల నేతృత్వంలోనే తీసుకోవాలి. - డాక్టర్ స్వప్నప్రియ సీనియర్ డర్మటాలజిస్ట్ -
కుండీల్లో కమ్మని ఆకుకూరలకు హాయ్.. చెబుదామా?
విషపు రసాయనాలు, రసాయనిక ఎరువులు, కలుషిత నీరు వాడకుండా ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచీ!.. కానీ ఇప్పుడలా పండిస్తున్నదెవరు? అయినా.. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామాల్లో అయినా ప్రకృతిసిద్ధంగా పెంచిన ఆహారం ఎక్కడ దొరుకుతాయిలెద్దూ.. అని నిరుత్సాహపడుతున్నారా? ఎక్కడి దాకో ఎందుకు చెప్పండి? ఆసక్తి ఉంటే మీరే.. మీ ఇంటిపట్టునే నిక్షేపంగా పండించుకోవచ్చు. ఇంటిపట్టున కాస్త ఖాళీ స్థలం ఉంటే సరేసరి. లేదంటే కుండీలు, మడుల్లో సులువుగానే ఇంటిపంటలు సాగు చేసుకోవచ్చు. ఉదయపు నీరెండలో ఇంటిపంటల పనులు చేస్తుంటే.. అలసిన మనసుకు ఎంత గొప్ప రిలీఫో కదండీ..? దీన్నే ‘హార్టీకల్చర్ థెరపీ’ అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కమ్మని ఆకుకూరలు, కూరగాయలకు ఇది బోనస్ అన్నమాట. కంపోస్టు+కొబ్బరిపొట్టు+మట్టి,, ఒకటి లేదా రెండు కుండీలతో ఆకుకూరల సాగు సరదాగా మొదలు పెట్టొచ్చు. ఆకుకూరలకు ఆరు అంగుళాల కన్నా లోతు మట్టి అవసరం లేదు. కుండీలు/ ట్రేలు/ మడుల్లో ఆకుకూరలను ఎంచక్కా పెంచుకోవచ్చు. కంపోస్టు (చివికిన పశువుల ఎరువు / వర్మీకంపోస్టు/ ఎండిన పేడ/ ఏదైనా ఇతర కంపోస్టు)+ కొబ్బరిపొట్టు సమపాళ్లలో కలిపి.. దానికి కొద్దిమొత్తంలో ఎర్రమట్టిని కలిపితే చాలు. కుండీలు, మడుల్లో ఆకుకూరలు, కూరగాయల సాగుకు మట్టి మిశ్రమం సిద్ధమైనట్లే. వేపపిండి ఉంటే కొంచెం కలిపితే ఇంకా మంచిది. కంపోస్టు టీ, వర్మీవాష్, జీవామృతం.. వంటివి వాడుకోవడం అవసరం. కుండీ అడుగున బెజ్జం మీద కుండ పెంకులు లేదా రాళ్లతో కప్పండి(ఈ బెజ్జం పూడిపోకుండా ఉంటేనే.. అదనపు నీరు బయటకుపోతుంది. కుండీలో నీరు నిలబడితే మొక్కకు నష్టం). ఆ తర్వాత కుండీ అడుగున అంగుళం మందాన ఎండు ఆకులు వేసి.. పైన మట్టి మిశ్రమం పోయండి. మట్టి నింపిన రోజే విత్తనాలు చల్లకండి. నీరు పోస్తూ ఒకటి, రెండు రోజులు కుండీ సాగుకు సిద్ధమయ్యాక.. విత్తనాలు చల్లండి లేదా మొక్కలు నాటండి. పది రోజుల్లో ముచ్చటైన బేబీ మెంతి కూర! విత్తనాలు లేవా? పర్లేదు. పోపు డబ్బాలో మెంతులు ఉన్నాయి కదా? మెంతి కూర ఎంత ఆరోగ్యమో మీకు తెలుసు కదా! గుప్పెడు మెంతులు తీసుకొని కుండీలో చల్లండి. వాటిపైన పల్చగా మట్టి వేసి.. నెమ్మదిగా నీటిని చిలకరించండి. మొక్కలు మొలిచే వరకూ తడి ఆరకుండా చూడండి. మొలకలొచ్చే వరకు పైన ఎండు ఆకులు కప్పితే మరీ మంచిది. గుర్తుపెట్టుకోండి. కుండీలో/ట్రేలో మట్టి ఏకాలంలోనైనా తడీపొడిగా ఉండాలి. నీరు నిలవ కూడదు.. అంతే! పది రోజుల్లో ముచ్చటైన బేబీ మెంతి కూర పచ్చగా పలకరిస్తుంది! అప్పటికప్పుడు కత్తిరించి తాజాగా పప్పులో వేయండి. ఆహా.. ఈ మెంతి కూర పప్పు రుచే వేరండోయ్.. అని మీరే అంటారు! మెంతికూర ఒక్కటేనా? పాలకూర, చుక్కకూర.. ఒకటేమిటి ఆకుకూరలేవైనా.. ఏ కాలంలోనైనా సాగు చేయొచ్చు. వంగ, టమాటా, బీర, బెండ, దొండ, ఆనప, దోస, కాకర.. ఇలాంటి కూరగాయలను సైతం ఇప్పుడు పెంచవచ్చు. డ్రిప్ సదుపాయం పెట్టుకుంటే నీటి వృథాతోపాటు శ్రమ కూడా తగ్గుతుంది. - ‘ఇంటిపంట’ డెస్క్ , intipanta@sakshi.com -
..ఇప్పటి ట్రెండ్!
నేడు‘అంతర్జాతీయ ఇంటిపంటల దినోత్సవం’ సందర్భంగా.. పట్టణాలు, నగరాల్లోనూ ఎవరికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలను వారే పండించుకోవడం తాజా ట్రెండ్‌గా మారింది. వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కంటెయినర్లలో కూరగాయల పెంపకం సంపన్న నగరం న్యూయార్క్ లేదా మనీలాలోని మురికి వాడల దగ్గరి నుంచి.. లండన్‌లోని సంపన్నులు నివసించే ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ల వరకు పట్టణ ప్రాంతాల్లో ఎవరి ఆహారాన్ని వాళ్లే ఉన్నంతలో పండించుకోవడం అలవాటుగా మారుతోంది... పొలాల్లో భారీ స్థాయిలో జరిగే ఆహారోత్పత్తి పరిమాణంతో పోల్చితే వీళ్లు ఇంటిపంటలతో పండించేది కొంచెమే కావచ్చు. కానీ విషర సాయనాల అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరల కోసం మధ్య/ఉన్నత వర్గాల ప్రజలతోపాటు.. కొనుగోలు శక్తిలేని పేదలు సైతం వీలైనంతలో ఇంటిపంటలు పండిస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టులో ఆఖరి ఆదివారాన్ని ప్రపంచ ఇంటిపంటల దినోత్సవంగా ఎక్కడి వాళ్లు అక్కడ జరుపుకుంటున్నారు. ఆరోగ్యపరిరక్షణ దృష్ట్యా సేంద్రియ ఇంటిపంటల మేలు గురించి ప్రచారం చేయడం.. స్థానికంగా పండే ఆహారాన్నే ఎక్కువగా తినడం ద్వారా సుదూర ప్రాంతాల నుంచి ఆహారాన్ని తరలించడానికయ్యే వ్యయాన్ని/కాలుష్యాన్ని తగ్గించడం.. ఇంటిపంటల పెంపకం, పోషకాలు నష్టపోని విధంగా వంట చేయడాన్ని ప్రపంపవ్యాప్తంగా ప్రచారంలోకి తేవడం.. ఇవీ అంతర్జాతీయ ఇంటిపంటల దినోత్సవం లక్ష్యాలు. మన దేశంలోనూ పట్టణాలు, నగరాల్లో నివసించే అన్ని వర్గాల ప్రజలకు ఇంటిపంటలు అనువైనవే. ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా అన్నివర్గాల ప్రజలకూ ఇంటిపంటల అవసరముంది. పట్టణ నిరుపేదలకు ఇంటి వద్ద చోటుండదు కాబట్టి ప్రభుత్వం కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి, అందులో ప్రతి పేద కుటుంబానికి కొద్దిపాటి స్థలాన్ని కేటాయించాలి. మేడల మీద, ఇళ్ల ముందు, వెనుక ఖాళీ స్థలాల్లో ఇంటిపంటలు పండించుకునేందుకు మధ్యతరగతి ప్రజలను సబ్సిడీ కిట్ల ద్వారా ప్రోత్సహించాలి. అన్ని జిల్లా, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నమూనా కిచెన్ గార్డెన్లను ఉద్యాన శాఖలు నిర్వహిస్తూ.. ప్రజలకు కొత్త మెలకువలను నేర్పేందుకు శిక్షణనివ్వాలి. ఉపకరణాలను అందుబాటులోకి తేవాలి. పోషకాహార లోపాన్ని, తీవ్ర పేదరికాన్ని పారదోలడానికి ఇంటిపంటలు చక్కటి మార్గమని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకటించిన విషయాన్ని పాలకులు గుర్తించాలి. ‘ఇంటిపంట’లకు సబ్సిడీ.. అన్ని చోట్లా ఇవ్వొచ్చుగా! ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి ‘సాక్షి’ స్వచ్ఛంద సంస్థల తోడ్పాడుతో ప్రారంభించిన కృషి ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. తత్ఫలితంగానే ఇంటిపంట కిట్లకు సబ్సిడీ ఇచ్చే పథకం ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యాన శాఖ సబ్సిడీపై ‘ఇంటిపంట’ ఉపకరణాల పంపిణీకి హైదరాబాద్‌లో గత ఏడాది మార్చిలో శ్రీకారం చుట్టింది. ఆర్కేవీవై నిధులతో 50% సబ్సిడీపై సిల్పాలిన్ మడులు, వేపపిండి, వేపనూనె, స్ప్రేయర్, సూటిరకం విత్తనాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌లో వచ్చే నెల నుంచి ఈ పథకం పునఃప్రారంభం కానుంది. పాలకులు ఇంటిపంటల ప్రాధాన్యాన్ని పెద్ద మనసుతో పట్టించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలకు ఇంటిపంట కిట్లు అందు బాటులోకి తేవాలని ‘సాక్షి’ కాంక్షిస్తోంది.