cash delivery
-
ఆర్కేనగర్ ఉచ్చు
► ‘కేసు’ మోత మోగేనా? ► సీఈసీ సిఫారస్సు ► ఇరకాటంలో సీఎం సహా ఆరుగురు ► నేడు కోర్టుకు విచారణ ఆర్కేనగర్లో నగదు బట్వాడా వ్యవహారం సీఎం పళని స్వామితో పాటు పలువురు మంత్రులు, అభ్యర్థి దినకరన్ మెడకు ఉచ్చుగా మారేనా.. అన్న ప్రశ్న బయలుదేరింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో పరిణామాలు సాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు కేసుల మోత మోగేనా అన్న ఉత్కంఠ బయలుదేరింది. ఇందుకు తగ్గ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజక వర్గంలో ఖాళీ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ స్థానం భర్తీకి ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం హోరెత్తింది. గెలుపు లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం దినకరన్, పురట్చి తలైవి శిబిరం మధుసూదనన్, ఎంజీయార్, అమ్మ దీప పేరవై దీప, డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్, బీజేపీ అభ్యర్థి గంగై అమరన్..ఇలా 63 మంది తీవ్రంగానే కుస్తీ పట్టారు. అయితే, దినకరన్ తన అధికార, ధన బలాన్ని ప్రయోగించడం కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఆగ్రహాన్ని రేపింది. ఐటీ దాడుల్లో లభించిన ఆధారాలు సీఈసీ టేబుల్‌కు చేరాయి. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టుగా ఆధారాలతో నిరూపితం కావడంతో రాత్రికి రాత్రే ఉప ఎన్నిక రద్దయ్యింది. ఇంతవరకు అన్నీ బాగానే సాగినా, తదుపరి పరిణామాలతో దినకరన్ ఓ జట్టుగా, సీఎం పళనిస్వామి మరో జట్టుగా అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో కొనసాగే పరిస్థితి నెలకొంది. అలాగే, రెండాకుల చిహ్నం కోసం లంచం ఇవ్వడానికి ప్రయత్నించి కటకటాల్లోకి సైతం దినకరన్ వెళ్లి రాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్కేనగర్ నగదు బట్వాడా ఉచ్చు ప్రస్తుతం అందరి మెడకు ఉచ్చుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న తప్పడం లేదు. ఇందుకు తగ్గ పరిణామాలు చక చకా సాగుతున్నాయి. కేసు మోత మోగేనా చెన్నైకు చెందిన న్యాయవాది వైరకన్ను సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్కే నగర్ నగదు బట్వాడాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారోనని సీఈసీని వివరాలు రాబట్టే యత్నం చేశారు. ఇప్పటికే ఆయన హైకోర్టులో నగదు బట్వాడాపై పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. సమాచార హక్కు చట్టం మేరకు ఆయన కోరిన సమాచారాన్ని సీఈసీ అందజేసింది. ఇందులో పేర్కొన్న వివరాల మేరకు సీఎం పళనిస్వామి, మంత్రులు సెంగోట్టయన్, విజయభాస్కర్, సెల్లూరు రాజు, తంగమణి, వేలుమణి, అభ్యర్థి దినకరన్ మీద కేసు నమోదుకు సిఫారసు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇందుకు తగ్గ అధికారిక సమాచారం ఏ అధికారికి సీఈసీ నుంచి రానట్టు తెలిసింది. ఒకవేళ సీఈసీ సిఫారసు చేసి ఉన్నా, దానిని తుంగలో తొక్కినట్టు స్పష్టం అవుతోంది. న్యాయవాది వైరకన్నుకు మాత్రం తమ సమాచారంలో పూర్తి వివరాలను అందజేసి ఉండడం గమనార్హం. సోమవారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానున్న దృష్ట్యా, సమగ్ర వివరాలను బెంచ్ ముందు ఉంచే అవకాశాలున్నాయి. సీఈసీ సిఫారసు సమాచారంతో సీఎంతో పాటు మంత్రులు, దినకరన్‌పై కేసుల్ని నమోదు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టే పనిలో ఉండడం గమనార్హం. ఈ విషయంగా డీఎంకే కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు కేసుల్ని నమోదు చేయాల్సిందేని, అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పురట్చి తలైవి శిబిరం ఎమ్మెల్యే పాండిరాజన్ పేర్కొంటూ, సీఈసీ కేసు నమోదుకు సిఫారసు చేయడం ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, హైకోర్టులో సాగే విచారణ మేరకు కేసుల మోత మోగేనా లేదా, వాయిదాల పర్వం సాగేనా..అన్నది వేచి చూడాల్సి ఉంది. -
నేటితో నామినేషన్లకు తెర
► ఓటర్ల బ్యాంకు అకౌంట్లపై డేగకన్ను ► నగదు బట్వాడాకు అడ్డుకట్ట సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల సమయాల్లో అక్రమాలకు పాల్పడకుండా అభ్యర్థులపై నిఘా పెట్టడం మామూలే. అయితే తమిళనాడులో తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏకంగా ఓటరుపైనే నిఘాపెట్టేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఓటుకు నోటు ప్రలోభాన్ని అడ్డుకునేందుకు ఓటర్లపైనా, వారి బ్యాంకు ఖాతాలపైనా నిఘాపెట్టి కొత్త సంప్రదాయానికి తెరదీసింది. మధురై జిల్లా అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో నగదు బట్వాడా సాగినట్లు కోర్టు భావించడం వల్ల గతంలో రద్దయ్యాయి. ఎమ్మెల్యే శీనివేల్ మృతి వల్ల తిరుప్పరగున్రం నియోజవర్గంతోపాటు తంజావూరు, అరవకురిచ్చిలో ఈనెల 19వ తేదీన పోలింగ్ జరుగనుంది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే పార్టీలు తమ అభ్యర్దులను రంగంలోకి దింపాయి. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే మినహా అన్ని పార్టీలూ అన్నాడీఎంకే చేతిలో డిపాజిట్టు కోల్పోయి భారీ ఓటమితో మట్టికరిచాయి. ఈసారి ఉప ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కకున్నా కనీసం మెరుగైన ఓట్లు రాబట్టుకునేందుకు కొన్ని పార్టీలు పాటుపడుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నగదు బట్వాడా ఆరోపణలు ఎదుర్కొన్నందున ఉప ఎన్నికల్లో ఈ అపప్రధ నుండి తప్పించుకునేందుకు ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ఉప ఎన్నికల్లో నిఘా చర్యలపై ఒక అధికారి మాట్లాడుతూ, ఓటర్లకు నగదు బట్వాడా జరుగకుండా మూడు నియోజకవర్గాల్లో ఐదు కంపెనీల కేంద్ర భద్రతాదళాలు, ఫ్లయింగ్ స్వ్క్డాడ్లు రంగంలో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మరే రాష్ట్రంలోనూ ఎన్నికలు లేనందున ఈ మూడు నియోజకవర్గాలపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అదనపు బలగాలు వస్తున్నాయని తెలిపారు. మూడు నియోజకవర్గాల్లోని అభ్యర్దులు ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కినట్లుగాా వ్యవహరిస్తే మరోసారి ఎన్నికలను వాయిదావేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. తంజావూరు, అరవకురిచ్చీల్లో వాహనాల తనిఖీల్లో రూ.7.12 కోట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఓటర్లకు నగదు పంచేందుకు వీలులేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ పరిస్థితిల్లో అధికారుల కళ్లుగప్పి ఓటర్ల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని ఆయన అన్నారు. అందుకే ఓటర్ల బ్యాంకు ఖాతాలపై కూడా నిఘాపెట్టామని తెలిపారు. ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున సొమ్ము జమ చేయడం, డ్రా చేయడం జరుగుతోందాని ప్రతిరోజూ వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అనుమానం వస్తే నియోజకవర్గాల్లోని ఓటర్ల ఇళ్లను కూడా తనిఖీ చేస్తామని అన్నారు.ఎన్నికల అధికారులతోపాటూ ఆదాయపు పన్నుశాఖ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారు. అన్నాడీఎంకే అభ్యర్థికి చుక్కెదురు తిరుప్పరగున్రం అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోస్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఉదయకుమార్తోపాటూ కల్లంబల్ అనే గ్రామానికి వెళ్లారు. 2006 నుంచి 2011 వరకు ఏకే బోస్ ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పిస్తామని గడిచిన రెండు ఎన్నికల్లోనూ హామీ ఇచ్చి ప్రజలను వంచించారని దుయ్యబడుతూ ప్రచారానికి వచ్చిన బోస్‌ను, మంత్రిని గ్రామస్తులు ముట్టడించారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో మంత్రి ఉదయకుమార్, అభ్యర్థి బోస్ వెనుదిరిగారు. పుదుచ్చేరీ నెల్లితోప్పు కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి నారాయణస్వామికి మద్దతుగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఈనెల 13వ తేదీన పుదుచ్చేరీలో ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు, పుదుచ్చేరీల్లో ఉప ఎన్నికలు జరగుతున్న నాలుగు కేంద్రాల్లో నామినేషన్లకు బుధవారం తెరపడనుంది.