Cash-strapped
-
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్..వాటిని పునరుద్ధరించమని యూఎస్‌కి విజ్క్షప్తి!
అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగినప్పటి నుంచి పాక్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల సంబంధాలు సుదీర్ఘకాలం అనిశ్చితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగదు కొరతతో సతమవుతున్న పాక్ మిలటరీ ఫైనాన్సింగ్ సేల్స్‌ను పునరుద్ధరించాలని అమెరికాని కోరింది. వాస్తవానికి దీన్ని యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్లో జరిగిన సెమినార్లో అమెరికాకు చెందిన పాకిస్తాన్ రాయబారి మసూద్ ఖాన్ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వం సస్పెండ్ చేసిన దానిని పునరుద్ధరించాలన్నారు. విదేశీ మిలిటరీ ఫైనాన్సింగ్, ఫారిన్ మిలటరీ సేల్స్‌ను పునరుద్ధరించడం పాక్‌కి చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ మధ్య ఆసియా యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఎలిజబెత్ హూర్ట్స్ సమస్యత్మకంగా మారిన పాక్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో సహాయం చేయాల్సిన అవసరంపై దృష్టి సారించారు. ఐతే ముందు పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు ఎలిజబెత్. పాక్ ఐఎంఎఫ్‌తో అంగీకరించిన కఠినమైన సంస్కరణలు అంత తేలికైనవి కాదన్నారు. కానీ పాక్ తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలన్న, మరింత అప్పుల ఊబిలో చిక్కుకోకుండా తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పాక్‌కి ఈ చర్యలు తీసుకోవడం చాలా కీలకమని చెప్పారు. అందువల్ల ఐఎంఎఫ్‌తో అంగీకరించిన సంస్కరణలను పాక్ ముందుగా అమలు చేయాలని యూఎస్ కోరింది. ఈ మేరకు పాక్ అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవడంపై దృష్టి సారించింది. ఆ సమావేశంలో రాయబారి ఖాన్ రష్యా చమురు కోసం పాక్ తన మొదటి ఆర్డర్ ఇచ్చిందని కానీ యూఎస్‌తో సంప్రదించి వెనక్కి తగ్గినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఖాన్ అఫ్ఘనిస్తాన్‌లో సుస్థిరత తీసుకురావడంలో పాక్ పోషించిన కీలక పాత గురించి మాట్లాడారు. గత నాలుగు దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘాన్‌లోని ప్రజలకు స్థిరత్వం చాలా అవసరం అని ఖాన్ పేర్కొన్నారు. అలాగే అఫ్ఘనిస్తాన్‌లో వృద్ధి చెందుతున్న ఉగ్రవాదంపై అమెరికా, చైనాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఈ రోజు అది పాక్, అఫ్ఘాన్లకు ముప్పుగా ఉండోచ్చు కానీ దీన్ని అదుపు చేయకపోతే మరింతగా విస్తరిస్తుందని హెచ్చరించారు. ఈ ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం అని రాయబారి ఖాన్ పిలుపునిచ్చారు. (చదవండి: సూడాన్ నుంచి మరో 754 మంది రాక) -
జెట్ క్రాష్ ల్యాండింగ్!
న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో కఠిన పరిస్థితులను ప్రతిబింబిస్తూ మరో విమానయాన సంస్థ మూసివేత అంచులకు చేరింది. రుణభారం, నిధుల కొరతతో నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కార్యకలాపాలను కొనసాగించేందుకు అత్యవసరంగా కావాల్సిన రూ. 400 కోట్లను సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ‘రుణదాతల నుంచి గానీ మరే ఇతర మార్గాల ద్వారా గానీ అత్యవసరంగా కావాల్సిన నిధులు లభించే భరోసా లేదు. దీంతో కార్యకలాపాలు కొనసాగించే క్రమంలో ఇంధన విక్రేతలకు, ఇతరత్రా సేవలందించే వారికి చెల్లింపులు జరపలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం. దేశీయంగాను, విదేశీ రూట్లలోనూ నడిపే ఫ్లయిట్స్ అన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సి వస్తోంది. బుధవారం రాత్రి అమృత్సర్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి రాత్రి 10.30 గం.లకు వెళ్లే ఫ్లయిట్ ఆఖరుది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు జెట్ ఎయిర్వేస్ బుధవారం తెలిపింది. దీంతో 20 వేల మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రయాణికులు, బ్యాంకులు, రుణదాతలకు వేల కోట్ల రూపాయల బాకీల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది. నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి జెట్ పరిష్కార ప్రణాళికకు తోడ్పాటునిస్తామని పేర్కొంది. మే 10 దాకా నిరీక్షణ .. సంస్థలో వాటాలను విక్రయిస్తున్న రుణదాతలు .. బిడ్లను ఖరారు చేసే ప్రక్రియ పూర్తయ్యే దాకా వేచి చూడనున్నట్లు జెట్ తెలిపింది. నాలుగు సంస్థలు అర్హత పొందాయని, ఇవి తుది బిడ్లను దాఖలు చేసేందుకు మే 10 దాకా గడువుందని పేర్కొంది. ఎతిహాద్ ఎయిర్వేస్, జాతీయ పెట్టుబడి నిధి ఎన్ఐఐఎఫ్, ప్రైవేట్ సంస్థ టీపీజీ, మరో ఫండ్ హౌస్ ఇండిగో పార్ట్నర్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు, జెట్ కార్యకలాపాల నిలిపివేతపై పౌర విమానయాన శాఖ స్పందించింది. సంస్థ సమస్యల పరిష్కారమార్గాన్ని కనుగొనేందుకు సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నామని ఉద్యోగులకు పంపిన లేఖలో జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే తెలిపారు. ‘అయితే, విక్రయ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందన్న సంగతి అంతా దృష్టిలో ఉంచుకోవాలి. ఈలోగా మరిన్ని సవాళ్లు ఎదురవ్వొచ్చు. వీటికి సంబంధించి ప్రస్తుతానిౖMðతే మన దగ్గర సమాధానాలు లేవు‘ అని ఆయన తెలిపారు. మంగళవారం సమావేశంలో ఆఖరు ప్రయత్నంగా రూ. 400 కోట్లయినా సమకూర్చాలని బ్యాంకులను కోరాలంటూ సీఈవో వినయ్ దూబేకి జెట్ బోర్డు సూచించింది. బ్యాంకులు దానికి అంగీకరించకపోతే, సంస్థ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అయితే, అత్యవసరంగా నిధులను సమకూర్చాలన్న విజ్ఞప్తిని అంగీకరించడం లేదంటూ రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మంగళవారం రాత్రి పొద్దుపోయాక జెట్ ఎయిర్వేస్కు తెలిపింది. ఈ పరిణామాల దరిమిలా సర్వీసులను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు జెట్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీ ఎయిర్‌లైన్స్ కష్టాలకు కారణాలు.. విమానయాన సంస్థల కష్టాలకు పలు కారణాలు ఉంటున్నాయి. ప్రధానంగా దేశీ విమాన సర్వీసులకు ఉపయోగించే ఇంధనంపై అధిక పన్నుల పోటు, విమానాశ్రయాల్లో ఇన్ఫ్రా సమస్యలతో మరిన్ని ప్లేన్స్‌ను చేర్చే పరిస్థితి లేకపోవడం, తీవ్రమైన పోటీ కారణంగా చౌక చార్జీలతో కొనసాగాల్సి వస్తుండటం, నష్టాల్లో ఉన్న సంస్థలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతుండటం మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి. జెట్ పాతికేళ్ల ప్రస్థానమిదీ.. ►1992లో సంస్థ ఏర్పాటు. 1993లో ఎయిర్ ట్యాక్సీ ఆపరేటర్‌గా కార్యకలాపాలు ప్రారంభం. 1995లో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా కార్యకలాపాలు. 2004లో విదేశీ రూట్లలో ఫ్లయిట్స్. ►2005లో పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ). ► 2007లో రూ. 2,050 కోట్లతో ఎయిర్ సహారా కొనుగోలు. ► 2010 – 2012 దాకా ప్యాసింజర్ మార్కెట్లో అత్యధిక వాటాతో అగ్రస్థానం. ► 2011–12లో సంక్షోభ పరిస్థితులు. 2013లో ఎతిహాద్‌కు 24 శాతం వాటాల విక్రయం. డీల్ విలువ 379 మిలియన్ డాలర్లు. ► గడిచిన పదేళ్లలో ఎనిమిది సంవత్సరాలు నష్టాలు. 2015లో 22.5 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 2018 నాటికి 15.5 శాతానికి పడిపోయింది. ►2018 మార్చి నుంచి తాజాగా మరో సంక్షోభం మొదలు. ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జాప్యాలు, టాప్ మేనేజ్మెంట్ జీతభత్యాల్లో 25 శాతం దాకా కట్. గడిచిన ఏడాది కాలంగా సంస్థ మార్కెట్ విలువ 60 శాతం పైగా హరించుకుపోయింది. రుణదాతలకు దాదాపు రూ. 8,000 కోట్లకు పైగా బాకీపడింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో మరింత ముదిరిన సంక్షోభం. 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి. ►ఈ ఏడాది తొలినాళ్ల నుంచి ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారాయి. కంపెనీ బోర్డు నుంచి వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ తప్పుకున్నారు. బ్యాంకు యాజమాన్యాన్ని బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సంస్థలో 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్స్ ఆహ్వానించాయి. కార్యకలాపాలు కొనసాగించేందుకు రూ. 1,500 కోట్లు సమకూర్చే ప్రతిపాదనలు చేశాయి. వీటిని అందించడంపైనే మల్లగుల్లాలు పడిన బ్యాంకులు చివరికి అత్యవసరంగా కావాల్సిన నిధులను ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. ప్రస్తుతం కంపెనీలో ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు 51 శాతం, నరేష్ గోయల్‌కు 24 శాతం, ఎతిహాద్ ఎయిర్వేస్కు 12 శాతం వాటాలు ఉన్నాయి. ►ఒకప్పుడు 120 పైగా విమానాలు ఉండేవి. కానీ అద్దెలు కట్టకపోవడంతో లీజుకిచ్చిన సంస్థలు పలు విమానాలను నిలిపివేయడంతో ప్లేన్స్ సంఖ్య 5కి పడిపోయింది. ఉద్యోగులకు జీతభత్యాలు నిల్చిపోయాయి. జెట్ సంక్షోభంతో విమాన చార్జీలు భారీగా పెరుగుతున్నాయి. స్వయంగా ప్రధాని కార్యాలయం, పౌర విమానయాన శాఖ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అయిదేళ్లలో ఏడో సంస్థ.. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఆర్థిక సంక్షోభం, తీవ్ర పోటీ ధాటికి పలు విమానయాన సంస్థలు కుప్పకూలుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో ఎయిర్ పెగాసస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిశా, జూమ్ ఎయిర్ మూతబడ్డాయి. తాజాగా ఈ జాబితాలో ఏడో సంస్థగా జెట్ ఎయిర్వేస్ కూడా చేరుతోంది. అంతక్రితం 1987లో వాయుదూత్, 1996లో ఈస్ట్ వెస్ట్ ఎయిర్‌లైన్స్.. మోదీలుఫ్త్, 1997లో దమానియా ఎయిర్వేస్, ఎన్ఈపీ, 2000లో అర్చనా ఎయిర్వేస్ మూతబడ్డాయి. ఎయిర్‌లైన్ కర్మ: మాల్యా.. జెట్ ఎయిర్వేస్ పరిస్థితిపై మూతబడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ప్రమోటర్ విజయ్ మాల్యా స్పందించారు. కంపెనీకి సంఘీభావం ప్రకటించారు. ప్రైవేట్ విమానయాన సంస్థల కష్టాలకు కేంద్రమే కారణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు వేల కోట్ల ప్రజాధనమిచ్చి గట్టెక్కిస్తోంది కానీ .. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌పై మాత్రం పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. ‘కింగ్ఫిషర్కు జెట్ ఎయిర్వేస్ ప్రధాన పోటీదారు అయినప్పటికీ.. అంత పెద్ద సంస్థ మూసివేత పరిస్థితుల్లోకి జారిపోవడం చూస్తే నాకు బాధేస్తోంది. ఎయిరిండియాను కాపాడేందుకు కేంద్రం రూ. 35,000 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. ప్రైవేట్ రంగ సంస్థలను మాత్రం వదిలేస్తోంది. అప్పట్లో నేను భారీ పెట్టుబడులు పెట్టిన కింగ్‌ఫిషర్ దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగింది. అవార్డులూ అందుకుంది. బ్యాంకుల నుంచి కూడా కింగ్‌ఫిషర్ రుణాలు తీసుకున్న సంగతి వాస్తవమే. నేను 100 శాతం చెల్లించేస్తానంటున్నా నాపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఇదంతా ఎయిర్‌లైన్ కర్మ అనుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి‘ అని మాల్యా వ్యాఖ్యానించారు. -
క్యాష్ కష్టాలు
మళ్లీ బ్యాంకుల్లో నగదు కొరత ఆర్బీఐ నుంచి జిల్లాకు అరకొర సరఫరా రూ.100 నోట్లతో నెట్టుకొస్తున్న బ్యాంకర్లు మళ్లీ నగదు కొరత సమస్య తలెత్తింది. వారం రోజులుగా జిల్లాలో ఉన్న ఏటీఎంలు 50 శాతం ‘నో క్యాష్ బోర్డు’లతో దర్శనమిస్తున్నాయి. అవసరమైన మేరకు ఆర్బీఐ నుంచి నగదు రాకపోవడంతేనే ఈ సమస్య తలెత్తింది. దీంతో సామా న్య, మధ్యతరగతి జనం మళ్లీ అవస్థల పాలవుతున్నారు. తిరుపతి (అలిపిరి) : పెద్దనోట్ల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో బ్యాంకుల్లో తీవ్ర నగదు కొరత నెలకొంది. నెలన్నరగా బ్యాంకుల లావాదేవీలు పూర్తిస్థాయిలో పుంజుకున్నాయి. అయితే గత వారం రోజులుగా ఆర్బీఐ జిల్లా అవసరాలకు సరిపడా నగదు కేటాయించకపోవడంతో జాతీయ బ్యాంకుల్లో నగదు కష్టాలు ప్రారంభమయ్యాయి. నగదు నిల్వలు లేకపోవడంతో రూ.100 నోట్లతో బ్యాంకర్లు నెట్టుకొస్తున్నారు. వారానికి రూ.250 కోట్లు అవసరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో జాతీయ బ్యాంకు శాఖలకు మోస్తరు లావాదేవీలు కొనసాగించాలంటే వారానికి రూ.250 కోట్ల మేర నగదు అవసరం. అంత మొత్తంలో నగదు అందకపోతే లావాదేవీలు కొనసాగించాలంటే సమస్యలు తప్పవు. కనీసం అందులో సగభాగం కూడా ఆర్బీఐ జిల్లా బ్యాంకులకు నగదు బదిలీ చేయడం లేదు. జిల్లాలో 593 జాతీయ బ్యాంకు శాఖలున్నాయి. ఏటీఎంలు మొదలుకుని, బ్యాంకు శాఖల లావాదేవీలు జరపాలంటే రోజుకు రూ.20నుంచి రూ.40 కోట్లమేర అవసరం. అయితే అంత మొత్తంలో ఆర్బీఐ జిల్లాకు పంపే పరిస్థితులు లేవు. మొదటి వారంలో.. ప్రతి నెలాటి వారంలో బ్యాంకు శాఖలు లావాదేవీలు కొనసాగించాలంటే కనీసం రూ.వెయ్యి కోట్ల నగదు అవసరమవుతుంది. జిల్లాలో 38వేల మంది ఉద్యోగులకు వేతనాల కింద రూ.400 కోట్లు, 26వేల మంది విశ్రాంత ఉద్యోగులకు రూ.250 కోట్లు, ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పొందుతున్న 3,90,728 మందికి రూ.42 కోట్లు అవసరం. ఇవి కాకుండా ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు పొందిన వారికి నగదును చెల్లించాలి. ఇలా ప్రతి నెలా మొదటి వారంలో రూ.వెయ్యి కోట్ల మేర నగదు జిల్లాకు అవసరం. అయితే ఆర్బీఐ మాత్రం నగదు రహితం పేరుతో అరకొర నగదును కేటాయిస్తుండడంతో అటు బ్యాంకర్లు, ఇటు ఖాతాదారులకు అవస్థలు తప్పడం లేదు. ఏటీఎంలలో నో క్యాష్ జిల్లాలో 709 ఏటీఎం కేంద్రాలున్నాయి. అందులో కనీసం 50 శాతం కూడా పనిచేయడం లేదు. పలు ఏటీఎం ముందు నో క్యాష్ బోర్డులు, ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లాకు సకాలంలో ఆర్బీఐ నుంచి బదిలీ కాకపోవడంతో ఏటీఎం కేంద్రాల నిర్వహణపై బ్యాంకర్లు దృష్టి సారించడం లేదు. దీంతో ఖాతాదారులు అత్యవసర పరిస్థితుల్లో నగదు కోసం అవస్థలు పడక తప్పడం లేదు. నగదు కొరత నిజమే బ్యాంకుల్లో నగదు కొరత ఉన్న మాట నిజమే.. ఆర్బీఐ నుంచి అధిక మొత్తంలో నగదు బదిలీ అయితేనే పూర్తిస్థాయిలో లావాదేవీలు జరుగుతాయి. అప్పుడే ఏటీఎంలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఆర్బీఐ నుంచి జిల్లాకు నగదు రావాల్సి ఉంది. –లక్ష్మీనారాయణ, డీజీఎం, ఇండియన్ బ్యాంక్, తిరుపతి జోనల్ కార్యాలయం -
నగదు కష్టాలు: ఏటీఎంలు మళ్లీ ఖాళీ!
-
పండుగకు పైసలెట్లా..!
బ్యాంకుల వద్ద అవే బారులు రెండు నెలలు గడిచినా తీరని వ్యథ వేతన జీవులకు తప్పని కష్టాలు విత్‌డ్రా పెంచినా.. పనిచేయని ఏటీఎంలు మంచిర్యాల అగ్రికల్చర్ :గంటలు, రోజులు, నెలలు గడుస్తున్నాయి.. నగదు కొరత మాత్రం తీరడం లేదు. కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేసి నేటితో రెండు నెలలు గడిచినా బ్యాంకుల ఎదుట అవే బారులు కనిపిస్తున్నాయి. శనివారం జిల్లాలో పలు బ్యాంకులు, ఏటీఎంల ఎదుట పెద్ద ఎత్తున ప్రజలు క్యూలైన్లు కట్టారు. సంక్రాంతి – మిగతా 2లోu పండుగకు పైసలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పండుగ వారం, పది రోజుల ముందు నుంచే పలు పట్టణాలు, గ్రామాల్లో గృహిణులు పిండి తినుబండరాలు తయారు చేస్తుంటారు. ముఖ్యంగా సంక్రాతి పండుగకు పెట్టింది పేరైన సకినాలు ఇప్పటికే తయారు చేస్తుండేవారు. కానీ.. ఈ ఏడాది పెద్ద నోట్ల రద్దు, నగదు కొరతతో ఆ సందడే కనిపించడం లేదు. సామాన్య జనాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి కార్మికుల వేతనాలు పడి వారం గడుస్తోంది. ఇటు పింఛన్‌దారులు ఈ నెల 1వ తేదీ నుంచి బ్యాంకుల వద్ద బారులు తీరుతూనే ఉన్నారు. ఏటీఎంలో నగదు విత్‌డ్రా రూ.4500లకు పెంచినా నగదు పెట్టడమే లేదు. గతంలో రూ.2 వేలు వచ్చిన ఏటీఎంలు ఇప్పుడు మొత్తానికే పనిచేయడం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నగదు కొరత ఇబ్బంది 50 రోజుల్లో తొలగిపోతాయని ప్రకటించినా.. 60 రోజులు గడుస్తున్నా ఆ ఇబ్బందులు మాత్రం అదే విధంగా కొనసాగుతున్నాయి. ‘సంకురాత్రి పండుగ వచ్చిందంటే పదిరోజుల ముందు నుంచే బియ్యం పిండి పట్టించి సకినాలు, గారెలు చేసుకునేటోళ్లం. ఈ ఏడాది నోట్లు రద్దుతో వడ్లు అమ్మినా పైసలు ఇత్తలేరు. వాయిదా పెడతండ్రు. అటు బ్యాంకుల పైసలు అత్తలెవ్వు. పండుగ చేసుకునేటట్లు లేదు. రోజంతా బ్యాంకు ముందు లైను కడితే రెండు వేలు ఇత్తండ్రు.’ అని హాజీపూర్‌కు చెందిన నాత మల్లమ్మ వాపోయింది. సొంత ఖాతాదారులకే.. : బ్యాంకులు సొంత ఖాతాదారులకు మాత్రమే నగదు అందిస్తున్నాయి. దీంతో ఇటీవల జిల్లాల ఆవిర్భావంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులకు ఖాతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో బదిలీలపై వచ్చిన పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు స్థానికంగా బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకులో ఉన్న జీతం డబ్బు ఏ ఏటీఎంలోనైనా తీసుకునే అవకాశం ఉండటంతో చాలా మంది బ్యాంకు ఖాతాలు మార్చుకోలేదు. ప్రస్తుతం అలాంటి వారు బ్యాంకు శాఖల వద్దకు వెళ్తే తమ బ్రాంచిలో ఉండే ఖతాదారులకు మాత్రమే డబ్బులు ఇస్తామని స్పష్టంగా చెబుతుండటంతో పలువురు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జాతీయ బ్యాంకుల్లో నగదు కొరత
స్తంభించిన లావాదేవీలు ఖాతాదారుల ఆగ్రహం నేడు అందుబాటులోకి కొత్త రూ.500 నోట్లు జాతీయ బ్యాంకుల్లో నగదు కొరత నెలకొంది. దీంతో జిల్లాలోని పలు శాఖల్లో లావాదేవీలు పూర్తిగా స్తంభించారుు. గంటల తరబడి బ్యాంకుల ముందు బారులు తీరిన ఖాతాదారులకు నగదు అందకపోవడంతో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నారుు. అధికారులను నిలదీశారు. నగదు లేకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ మండిపడ్డారు. తిరుపతి (అలిపిరి): జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఆర్బీఐ నుంచి నగదు అందడం లేదు. దీంతో బ్యాంకు శాఖల్లో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. చిత్తూరు, తిరుపతి, మదనపల్లె వంటి ప్రధాన ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలకు సకాలంలో నగదు రాలేదు. బుధవారం ఉదయం 10 గంటలకు బ్యాంకుల వద్దకు చేరుకున్న ఖాతాదారులు మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి వున్నా నగదు అందలేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్యాంకుల్లో నగదు లేకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ మండిపడ్డారు. చివరికి చేసేది లేక వెనుదిరగాల్సివచ్చింది. జిల్లాకు అందిన అరకొర నగదు జిల్లా అవసరాల రీత్యా రూ.1800 కోట్లు అవసరమైతే ఆర్బీఐ నుంచి రూ.109 కోట్లు మాత్రమే అందారుు. అందులో రూ.9 కోట్లు మాత్రమే రూ.500 నోట్లు వున్నాయని జిల్లా అధికారులు ప్రకటించారు. బుధవారం కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రావాల్సి వున్నా.. వాటిని బ్యాంకులకు చేరవేయడానికి ఎక్కవ సమయం పట్టడంతో గురువారం ప్రధాన బ్యాంకు శాఖల్లో కొత్త రూ.500 నోట్లు ఖాతాదారులకు అందుబాటులోకి రానున్నారుు. ఏటీఎంలలో నో క్యాష్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాలు చాలావరకు పూర్తిస్థారుులో పనిచేయడం లేదు. తిరుపతి నగరంలో తిలక్ రోడ్డు, మదనపల్లెలో ఆర్టీసీ బస్టాండు ప్రాంతం, చిత్తూరులో జిల్లా కలెక్టరేట్లోని ఏటీఎంలు మినహా మరే ఇతర ప్రాంతాల్లో పూర్తిస్థారుులో పనిచేయలేదు. పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, పుంగనూరు వంటి ప్రాంతాల్లో ఏటీఎంలు అడపాదడపా పనిచేసినా నిమిషాల వ్యవధిలో క్యాష్ ఖాళీ కావడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు. -
రోజులు గడుస్తున్నా నో ఛేంజ్
తెరుచుకోని ఏటీఎం కేంద్రాలు బ్యాంకుల వద్ద క్యూలు నిత్యకృత్యం 6వ రోజూ తప్పని నోటు పాట్లు జిల్లాకు తక్షణమే వెరుు్య కోట్లు అవసరం ఆర్బీఐకి నివేదిక పంపిన అధికారులు జిల్లా ప్రజలను నోటు కష్టాలు వీడడం లేదు. రోజులు గడుస్తున్నా ఏటీఎంలు తెరుచుకున్న జాడలేదు. బ్యాంకుల దగ్గర క్యూలు మాత్రం పెరుగుతున్నారుు. కొద్ది బ్యాంకుల్లోనే నగదు మార్పిడి జరుగుతుండడంతో నిత్యం ఘర్షణలు జరుగుతున్నారుు. బ్యాంకులన్నీ సేవలను కొనసాగించాలన్న ఆర్బీఐ ఆదేశాలు అమలు కావడం లేదు. నగదు కొరతతో బ్యాంకులు చేతులెత్తేశారుు. ఐదు రోజులుగా 10 శాతం ఏటీఎంలు అరకొరగా పనిచేసినా ఆరో రోజు అవికూడా పనిచేయకుండా పోయారుు. దీంతో ప్రజలకు నోట్ల పాట్లు తప్పడం లేదు. జిల్లాలో నగదు కొరత తాత్కాలికంగా తీరాలంటే వందనోట్లు రూ.1000 కోట్లు అవసరమంటూ జిల్లా బ్యాంకు అధికారులు ఆర్బీఐకి నివేదిక పంపారు. తిరుపతి (అలిపిరి):పెద్ద నోట్ల రద్దు జిల్లా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రూ.500, రూ.1000 నోట్లు రద్దయి ఎనిమిది రోజులవుతున్నా కష్టాలు వెన్నంటే వున్నారుు. జిల్లాలో 594 బ్యాంకులు నగదు మార్పిడి సేవలందించాల్సి ఉంది. 50 శాతం శాఖలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నారుు. అన్ని బ్యాంకులు పూర్తి స్థారుు సేవలందించాలన్న ఆర్బీఐ ఆదేశాలు అమలు కావడం లేదు. దీంతో ప్రజలకు నగదు మార్పిడి తలకు మించిన భారంగా మారింది. ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్ వంటి ప్రధాన శాఖల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. ఏటీఎంలలో నగదు పరిమితి రూ.2వేల నుంచి రూ.2,500 వరకు పెంచినా ఏటీఎం కేంద్రాలు తెరుచుకోకపోవడంతో ఖాతాదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజులుగా ఏటీఎంలు గంట పాటు తెరుచుకున్నా మంగళవారం ఏటీఎం కేంద్రాలన్నీ మూతపడ్డారుు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె వంటి ప్రాంతాల్లో ఒకటి రెండు ఏటీఎంలు తెరుచుకున్నా అందులో నగదు లేకపోవడంతో ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. తిరుపతి ఎస్బీఐ ప్రధాన శాఖ ఎదుట ఉదయం అధిక సంఖ్యలో ప్రజలు నగదు మార్పిడికి తరలివచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది ప్రజలను కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడాల్సివచ్చింది. 180 కోట్ల లావాదేవీలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రూ.180 కోట్లు నగదు మార్పిడి లావాదేవీలు జరిగారుు. ప్రజల సంఖ్య పెరుగుతున్నా నగదు లేకపోవడంతో బ్యాంకుల వద్ద వెతలు వర్ణనాతీతంగా మారారుు. జిల్లాలో నగదు కొరత తీరాలంటే వంద నోట్లు రూ.1000 కోట్లు అవసరమని జిల్లా బ్యాంకు అధికారులు లెక్కలు తేల్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదికను పంపారు. ఆర్బీఐ నుంచి సానుకూల స్పందన వస్తే ఐదు రోజుల పాటు జిల్లా ప్రజలకు నోటు కష్టాలు తీరనున్నారుు. కాంగ్రెస్ మహిళా విభాగం ధర్నా రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులో వుంచాలంటూ తిరుపతి ఎస్బీఐ ప్రధాన శాఖ ఎదుట మంగళవారం కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షరాలు శ్రీదేవి మాట్లాడుతూ రూ.500, రూ.1000 నోట్ల రద్దు వల్ల సమాన్య ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయన్నారు. వారం రోజులుగా ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నా వారికి అవసరమైన నగదు మార్పిడి చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధాని అర్థం లేని నిర్ణయం వల్ల పలు వివాహ కార్యక్రమాల తేదీలను మార్చుకోవాల్సిన దుస్థితి నెలకుందన్నారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సావిత్రి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.