రోజులు గడుస్తున్నా నో ఛేంజ్ | Day passes, no change | Sakshi
Sakshi News home page

రోజులు గడుస్తున్నా నో ఛేంజ్

Published Wed, Nov 16 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

రోజులు గడుస్తున్నా నో ఛేంజ్

రోజులు గడుస్తున్నా నో ఛేంజ్

తెరుచుకోని ఏటీఎం కేంద్రాలు  బ్యాంకుల వద్ద క్యూలు నిత్యకృత్యం
6వ రోజూ తప్పని నోటు పాట్లు  జిల్లాకు తక్షణమే వెరుు్య కోట్లు అవసరం
ఆర్బీఐకి నివేదిక పంపిన అధికారులు

జిల్లా ప్రజలను నోటు కష్టాలు వీడడం లేదు. రోజులు గడుస్తున్నా ఏటీఎంలు తెరుచుకున్న జాడలేదు. బ్యాంకుల దగ్గర క్యూలు మాత్రం పెరుగుతున్నారుు. కొద్ది బ్యాంకుల్లోనే నగదు మార్పిడి జరుగుతుండడంతో నిత్యం ఘర్షణలు జరుగుతున్నారుు. బ్యాంకులన్నీ సేవలను కొనసాగించాలన్న ఆర్బీఐ ఆదేశాలు అమలు కావడం లేదు. నగదు కొరతతో బ్యాంకులు చేతులెత్తేశారుు. ఐదు రోజులుగా 10 శాతం ఏటీఎంలు అరకొరగా పనిచేసినా ఆరో రోజు అవికూడా పనిచేయకుండా పోయారుు. దీంతో ప్రజలకు నోట్ల పాట్లు తప్పడం లేదు. జిల్లాలో నగదు కొరత తాత్కాలికంగా తీరాలంటే  వందనోట్లు రూ.1000 కోట్లు అవసరమంటూ జిల్లా బ్యాంకు అధికారులు ఆర్బీఐకి నివేదిక పంపారు.

తిరుపతి (అలిపిరి):పెద్ద నోట్ల రద్దు జిల్లా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రూ.500, రూ.1000 నోట్లు రద్దయి ఎనిమిది రోజులవుతున్నా కష్టాలు వెన్నంటే వున్నారుు. జిల్లాలో 594 బ్యాంకులు నగదు మార్పిడి సేవలందించాల్సి ఉంది. 50 శాతం శాఖలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నారుు. అన్ని బ్యాంకులు పూర్తి స్థారుు సేవలందించాలన్న ఆర్బీఐ ఆదేశాలు అమలు కావడం లేదు. దీంతో ప్రజలకు నగదు మార్పిడి తలకు మించిన భారంగా మారింది. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్ వంటి ప్రధాన శాఖల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. ఏటీఎంలలో నగదు పరిమితి రూ.2వేల నుంచి రూ.2,500 వరకు పెంచినా ఏటీఎం కేంద్రాలు తెరుచుకోకపోవడంతో ఖాతాదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజులుగా ఏటీఎంలు గంట పాటు తెరుచుకున్నా మంగళవారం ఏటీఎం కేంద్రాలన్నీ మూతపడ్డారుు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె వంటి ప్రాంతాల్లో ఒకటి రెండు ఏటీఎంలు తెరుచుకున్నా అందులో నగదు లేకపోవడంతో ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. తిరుపతి ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఎదుట ఉదయం అధిక సంఖ్యలో ప్రజలు నగదు మార్పిడికి తరలివచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది ప్రజలను కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడాల్సివచ్చింది.

180 కోట్ల లావాదేవీలు
జిల్లా వ్యాప్తంగా మంగళవారం బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రూ.180 కోట్లు నగదు మార్పిడి లావాదేవీలు జరిగారుు. ప్రజల సంఖ్య పెరుగుతున్నా నగదు లేకపోవడంతో బ్యాంకుల వద్ద వెతలు వర్ణనాతీతంగా మారారుు. జిల్లాలో నగదు కొరత తీరాలంటే వంద నోట్లు రూ.1000 కోట్లు అవసరమని జిల్లా బ్యాంకు అధికారులు లెక్కలు తేల్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదికను పంపారు. ఆర్బీఐ నుంచి సానుకూల స్పందన వస్తే ఐదు రోజుల పాటు జిల్లా ప్రజలకు నోటు కష్టాలు తీరనున్నారుు.

కాంగ్రెస్ మహిళా విభాగం ధర్నా
రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులో వుంచాలంటూ తిరుపతి ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఎదుట మంగళవారం కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షరాలు శ్రీదేవి మాట్లాడుతూ రూ.500, రూ.1000 నోట్ల రద్దు వల్ల సమాన్య ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయన్నారు. వారం రోజులుగా ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నా వారికి అవసరమైన నగదు మార్పిడి చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధాని అర్థం లేని నిర్ణయం వల్ల పలు వివాహ కార్యక్రమాల తేదీలను మార్చుకోవాల్సిన దుస్థితి నెలకుందన్నారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సావిత్రి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement