cat meat
-
ఆకలికి తాళలేక పిల్లిని తినేశాడు..చివరికి మానసిక వైద్యశాలలో..
ఓ వ్యక్తి ఆకలికి తాళ్లలేక చనిపోయిన పిల్లిని తినేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన కేరళలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అతను సైక్రియాట్రిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎందువల్ల ఈ జుగుప్సా కరమైన చర్యకు దిగాడు?. ఇలా పచ్చిమాంసం తినడం ఎంతవరకు మంచిది అంటే.. ఈ భయానక ఘటన కేరళలోని కుట్టిపురంలో చోటు చేసుకుది. 27 ఏళ్ల వ్యక్తి కుట్టిపురంలోని బస్టాండ్‌లో చనిపోయిన పిల్లి మాంసాన్ని తింటూ కనిపించాడు. దీంతో షాక్‌కి గురయ్యిన స్థానికలు పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లి పలు పరీక్షలు చేయించారు. ప్రాథమిక పరీక్షల్లో అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని మానసిక వైద్యశాలలో అడ్మిట్ చేశారు. అతడు గత ఐదు రోజుల నుంచి భోజనం చేయకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఏదీఏమైనా వండకుండా ఇలా పచ్చి మాంసం తినడం మంచిదేనా? ఏవైనా సమస్యలు వస్తాయా? అంటే.. చాలా దేశాల్లో పచ్చిగా మాంసాన్ని తినేసే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్లు చాలా వరకు పచ్చిగా తినేందుకే ఇష్టపడతారు. ఐతే ఇలా తినడం ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆరోగ్యం చెడిపోతుందని అన్నారు. పచ్చి మాంసంలో బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్న జీవులు లేదా టాక్సిన్లతో చాలా విషపూరితంగా ఉంటుంది. వాటి ప్రేగులు కత్తిరించబడితే మరింత ప్రమాదం అని చెబుతున్నారు. ఒక వేళ ఆ మాంసానికి హానికరమైన వ్యాధికారకాలు వ్యాపిస్తే వధ సమయంలో ఆహార కాలుష్యం ఏర్పడుతుంది. అదీగాక సాల్మోనెల్లా, క్లోస్ట్రిడియా పెర్ఫ్రింజెన్స్, ఇ కోలి లిస్టేరియా మోనోసైటోజెన్‌లు క్యాంపిలోబాక్టర్ వంటి వ్యాధి కారకాలు పచ్చి మాంసలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. ఇలా తింటే వచ్చే సమస్యలు.. వికారంతో వాంతులు అవ్వడం అతిసారం తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి తీవ్రమైన జ్వరం తీవ్రమైన తలనొప్పి ఈ లక్షణాలు తిన్న 24 గంటల్లో కనిపిస్తాయి. వ్యాధికారకాన్ని బట్టి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్‌కి చికిత్స చేయగలిగనప్పటికీ పలు సందర్భాల్లో ప్రాణాంతకం అయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందువల ఉడికించి తింటే వ్యాదికారక క్రిములు నాశనంమయ్యి తినేందుకు సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఈ పచ్చి మాంసంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని చెప్పారు. కొన్ని దేశాల్లో పచ్చిగా తినే సంప్రదాయం ఉంది. ఇలా తినడం ఎంత మాత్ర సురక్షితం కానప్పటికీ అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించే మార్గాలు కొన్ని ఉన్నాయన్నారు. అవి అనుసరిస్తే ప్రమాదం ఉండదని సూచించారు. పచ్చిగా తినాలనుకుంటే తాజా మాంసాన్ని, అదికూడా ముక్కలుగా ఉన్నదాన్ని ఎంచుకోమని చెబుతున్నారు. (చదవండి: ఆయుష్షు పెంచే డ్రగ్ ట్రయల్!..ఏకంగా వెయ్యి కుక్కలపై..) -
పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!
వాషింగ్టన్: పెంపుడు జంతువులను సొంత బిడ్డల్లా చూసుకునే యజమానులు చాలా మందే ఉంటారు. ముద్దుపేర్లతో పిలుచుకుంటూ చంటిపాపల్లా సాకుతూ వాటికి సపర్యలు కూడా చేస్తారు. ఇక ఏకంగా పెట్స్ పేరిట కోట్ల విలువ చేసే ఆస్తులు రాసిన వాళ్ల గురించి కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మూగ జీవాలపై వారికి ఉన్న ప్రేమ అలాంటిది మరి. కానీ అమెరికన్ రాపర్ అజీలియా బ్యాంక్స్ మాత్రం ఇలాంటి వారికి పూర్తి విరుద్ధం. చనిపోయిన తన పెంపుడు జంతువు పట్ల ఆమె అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. విగతజీవిని వండుకుని తినేందుకు సిద్ధపడింది. (చదవండి: నువ్వు కొరికితే నేను కూడా కొరుకుతా) అంతేగాక ఈ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రోలింగ్‌కు గురవుతోంది. వివరాలు.. అజీలియా రాపర్ అయినప్పటికీ తన సంచలన వ్యాఖ్యలు, చేష్టలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరున్నర లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమె.. తాను మంత్రగత్తెనని, తన తల్లి నుంచి ఈ విద్య నేర్చుకున్నట్లు 2015లో ప్రకటించింది. జంతువుల పట్ల ఆమె ప్రవర్తించే తీరు కూడా విచిత్రంగా ఉండేది. ఈ క్రమంలో మంగళవారం ఆమె షేర్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ‘‘మీలో చాలా మందికి తెలియదు కదా. లూసిఫర్(2009-2020). నా పెంపుడు పిల్లి. మూడు నెలల క్రితం చనిపోయింది. దానిని పాతిపెట్టాం. ఇదిగో ఇప్పుడే మళ్లీ బయటకు తీయడం. తనకు జీవం పోశాం. డియర్ కిట్టీ థాంక్యూ. నువ్వొక లెజెండ్. ఐకాన్. సర్వ్ చేయడానికి సిద్ధం చేస్తా’’అంటూ మట్టిలో పాతిపెట్టిన ఓ కవర్‌ను బయటకు తీయడం ఇందులో కనబడింది. ఆ తర్వాత దానిని ఉడకించినట్లు కనిపించింది. ఈ వీడియోపై జంతుప్రేమికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘‘మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా. అసలు మీరు మనిషేనా. చచ్చిపోయిన పిల్లిని కూడా వదలరా. ఛీఛీ.. ఇంతటి ఘోరాన్ని మేం చూడలేం’’ అంటూ బ్యాంక్స్‌కు చురకలు అంటించారు. ఈ క్రమంలో ఆమె వీడియోను డిలీట్ చేసింది. -
పిల్లి మాంసంతో బిర్యానీ
టీ.నగర్(చెన్నై): హోటళ్లలో సాధారణంగా చికెన్, మటన్ బిర్యానీ అందుబాటులో ఉంటుంది. కానీ, చెన్నైలో ఫుట్‌పాత్ దుకాణాల్లో పిల్లిమాంసంతో బిర్యానీ విక్రయిస్తున్న విషయం బట్టబయలైంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో పెంచుకుంటున్న పిల్లులు తరచూ కనిపించకుండా పోతున్నాయి. తాము పెంచే పిల్లులను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారనే ఫిర్యాదులు పోలీసులకు తలనొప్పిగా మారింది. వాటి ఆచూకీ కనుగొనడం పోలీసులకు చికాకు కలిగించింది. దీంతో పిల్లులు పోగొట్టుకున్న వారు గత నెలలో పోలీసు కమిషనర్ విశ్వనాథన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. నక్కలవాళ్లు కొందరు పిల్లులను పట్టుకుని వెళుతున్నట్లు, వారిని పట్టుకుని విచారణ జరిపితే వాస్తవాలు తెలుస్తాయని కమిషనర్‌కు విన్నవించారు. దీంతో నక్కలవాళ్లు అధికంగా జీవించే ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విచారణలో పిల్లులను నక్కలవాళ్లు అపహరించిన విషయం వెలుగుచూసింది. చెన్నై, శివారు ప్రాంతాల్లో అనేక ఏళ్లుగా పిల్లులను పట్టుకుని, ఫుట్‌పాత్‌పై బిర్యానీ తయారు చేసే దుకాణయజమానులకు రూ.50కు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అమెరికాలోనూ కుక్క మాంసం నిషేధం!
న్యూయార్క్: చైనాలోని యూలిన్ నగరంలో 2013లో జరిగిన కుక్క మాంసం పండుగకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించడంతో యావత్ ప్రపంచం నాడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మానవులకు అత్యంత విశ్వాసంగా బతికే కుక్క పిల్లలను ఇంత దారుణంగా హత్య చేస్తారా? కుక్క మాంసాన్ని కాల్చుకొని రాక్షసంగా ఎలా తింటారంటూ ముక్కున వేలేసుకున్న యూరోపియన్లు ఉన్నారు. ఆసియా దేశాల్లో కొనసాగుతున్న ఈ క్రూర సంస్కృతికి తిలోదకాలివ్వాలంటూ ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆందోళన కూడా చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కుక్క మాంసం ఫెస్టివల్ యథాతథంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఫెస్టివల్ సందర్భంగా ఆ మాంసం భక్షకులు తమకు ఇష్టమైన కుక్కలను ఎంపిక చేసుకునేందుకు వీలుగా ప్రదర్శనలు జరపరాదంటూ ఆంక్షలు మాత్రం విధించారు. ప్రపంచంలో చైనా, దక్షిణ కొరియాతోపాటు థాయ్‌లాండ్, తైవాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కుక్కలు, పిల్లులను ఎక్కువగా తింటారు. జంతు ప్రేమికుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, తైవాన్ దేశాల్లో ఇటీవలనే కుక్క, పిల్లి మాంసం అమ్మకాలను నిషేధించారు. చైనాలో కుక్క మాంసం ఫెస్టివల్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికాలో ఆరు రాష్ట్రాల్లో మినహా మిగతా 44 రాష్ట్రాల్లో కుక్క మాంసం విక్రయం పట్ల ఎలాంటి నిషేధం లేదు. వర్జీనియా, కాలిఫోర్నియా, హవాయి, న్యూయార్క్, జార్జియా, మిచిగాన్ రాష్ట్రాల్లో కుక్క మాంసాన్ని నిషేధిస్తూ చట్టాలున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు లేనందున కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ మాంసం పట్ల స్థానికుల్లో చాలా మందికి వ్యతిరేకత ఉండడం వల్ల మరీ అంత బహిరంగంగా కుక్క మాంసాన్ని విక్రయించరు. చైనా, ఫిలీప్పీన్స్, థాయ్‌లాండ్ దేశస్థులు నివసించే ప్రాంతాల్లోనే కుక్క మాంసాన్ని బహిరంగంగా విక్రయిస్తున్నారు. కుక్క బరువును బట్టి 25 డాలర్ల నుంచి 75 డాలర్ల వరకు విక్రయిస్తున్నారు. అమెరికాలోని మిగతా 44 రాష్ట్రాల్లో కూడా కుక్క, పిల్లి మాంసాన్ని నిషేధించాలనే ప్రతిపాదనలు ఇప్పుడు ముందుకు వచ్చాయి. ఫ్లోరిడాకు చెందిన డెమోక్రట్ సభ్యుడు అల్సీ ఎల్ హాస్టింగ్స్, అదే ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు వెర్న్ బుచానన్, మిచిగాన్కు చెందిన రిపబ్లికన్ సభ్యుడు డేవ్ ట్రాట్, పెన్సిల్వేనియాకు చెందిన బ్రెందెన్ బోయెల్లు ‘హెచ్ఆర్ 1406, కుక్క, పిల్లి మాంసం నిషేధ చట్టాన్ని’ మార్చి 7న అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉన్నందున త్వరలోనే చట్టం వస్తుందని జంతు ప్రేమికులు భావిస్తున్నారు.