Catering worker
-
బెజవాడ పాతబస్తీలో దారుణ ఘటన! క్యాటరింగ్ బాయ్..
విజయవాడ: పాతబస్తీలో గురువారం సాయంత్రం దారుణహత్య చోటు చేసుకుంది. రద్దీగా ఉండే ప్రాంతంలో అనూహ్యంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గుగ్గిలం ఏసుబాబు (వాసు) (45) క్యాటరింగ్ పనులు చేస్తూ జీవిస్తుంటాడు. ఈయన పలువురికి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాడు. అతని వద్ద నాగార్జున అలియాస్ గణేష్ అనే యువకుడు క్యాటరింగ్ పనులు చేస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా రూ.5 వేల నగదుకు సంబంధించి గొడవ జరుగుతోంది. క్యాటరింగ్ పనులు చేసేవారంతా రమణయ్య కూల్‌డ్రింక్ షాప్ సెంటర్ కేరాఫ్ అడ్రస్‌గా తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో నాగార్జున ఏసుబాబుతో గొడవకు దిగినట్లు తెలిసింది. ఆ క్రమంలో ఏసుబాబు నాగార్జునను గట్టిగా అరవటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ క్రమంలో క్యాటరింగ్ సామగ్రిలోని మటన్ కొట్టే కత్తితో నాగార్జున ఏసుబాబుపై దాడి చేయటంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సురేష్‌బాబు తెలిపారు. -
ఇంటికో నలభీముడు.. జిల్లాలో ఏ ఫంక్షన్ అయినా ఆ ఊరి నుంచే..
ఆ ఊరులో ఇంటికో నలభీముడు తయారయ్యారు. వంటల తయారీలో చేయి తిరిగిన నైపుణ్యం ఆ ఊరి వారికే సొంతమైంది. భూస్వామి ఇంట.. వంటలో మెళకువలు నేర్చుకున్న సుబ్బయ్య కీర్తి జిల్లా అంతటా పాకింది. జిల్లాలో తొలి క్యాటరింగ్ ఏర్పాటుకు బీజం వేసింది. వంటలంటే.. వేగూరే అని పేరు తెచ్చి పెట్టింది. ఆ ఊరి వంటల రుచి ఎందరికో బతుకు దారి చూపింది. సాక్షి, నెల్లూరు: ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా.. షడ్రుచుల భోజనాలు వేగూరు నుంచే వెళ్తాయి. దిగువ మధ్య తరగతి నుంచి ధనవంతుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్ ఏదైనా వేగూరు రుచులు నోరూరిస్తాయి. క్యాటరింగ్ అంటే గుర్తొచ్చేది జిల్లాలోని కోవూరు మండలం వేగూరు. ఆ గ్రామానికి చెందిన సుబ్బయ్య తన చిన్నతనంలో మోడేగుంటకు చెందిన దేవెళ్ల సుబ్బరామిరెడ్డి అనే భూస్వామి వద్ద పశువుల కాపరిగా చేరారు. ఆ రోజుల్లో ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు, పని వాళ్లతో కలిపి సుమారు 60 నుంచి 70 మంది ఉండేవారు. వారందరికీ వంట చేయడం ఆ ఇంటి ఇల్లాలు తులశమ్మకు కష్టమైంది. దీంతో సుబ్బయ్యను వంట పనుల్లో సహాయకారిగా నియమించుకున్నారు. ఆమె వద్ద వంట చేయడంలో సుబ్బయ్య మెళకువలను నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన వంటల రుచుల కీర్తి జిల్లా అంతటా పాకింది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కుటుంబాలు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వంట చేసేందుకు సుబ్బయ్యను తీసుకెళ్లే వారు. జిల్లాకు చెందిన దివంగతులు మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, నెల్లూరు నర్తకీ సినిమాహాలు యజమానులు గుండా రాజమ్మ, ఆనం కుటుంబీకులు ఇలా పలువురు ప్రముఖులు వారిళ్లలో జరిగే కార్యక్రమాలకు వంటలు చేసేందుకు సుబ్బయ్యనే పిలిపించుకునేవారు. ఆయనతో వంటలు చేయించుకునేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో ఉన్న తమ వారి కోసం తీసుకు వెళ్లే వారని స్థానికులు చెబుతున్నారు. 30 రకాల వంటలు వెజ్, నాన్ వెజ్ వంటల వెరైటీల తయారీలో వేగూరు వంట మాస్టార్లది చేయితిరిగిన నైపుణ్యం.. వారికే సొంతం. వేగూరులో తమ స్వగృహాల సముదాయాల్లోనే వంటలు తయారు చేసి జిల్లా నలుమూలలకు వాహనాల్లో పంపడం ఇక్కడి ప్రత్యేకత. శాఖాహార, మాంసాహార వంటలతో పాటు బిరియానీ, పాయ, చిల్లీ చికెన్, మటన్ బిరియానీ, వడ, పాయసం, జాంగ్రీ, లడ్డూ తదితర సుమారు 30 రకాలను తయారు చేయడం సిద్ధహస్తులు. క్యాటరింగ్ సెంటర్ వంట గది తొలి క్యాటరింగ్ ఇక్కడే జిల్లాలో తొలి క్యాటరింగ్ ఈ ఊరి నుంచే ప్రారంభమైంది. వంట మాస్టార్ సుబ్బయ్య వద్ద సహాయకారిగా ఉన్న పసుపులేటి వెంకటసుబ్బయ్య ఇళ్లలో, హోటళ్లలో వంట మనిషిగా పనులు చేయడంతో వేగూరు వంటగాళ్లకు పేరొచ్చింది. ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో ఆలోచనలో పడ్డారు. వచ్చిన పనినే నమ్ముకుని ఆదాయం పెంచుకునేందుకు పాతికేళ్ల కిందట సొంతంగా గ్రామంలోనే క్యాటరింగ్ ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆదాయం పెరగ్గా, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువత అదే బాట పట్టారు. ఈ గ్రామంలో సుమారు 120 క్యాటరింగ్ కేంద్రాలు నిర్వహిస్తుండగా ఒక్కో దానిలో పది నుంచి 30 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఊరి యువత కొందరు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ తదితర నగరాల్లో క్యాటరింగ్ కేంద్రాలు హోటళ్లను ఏర్పాటు చేసుకుని రాణిస్తున్నారు. బిరియానీ తయారు చేస్తున్న మాస్టర్ ప్రతి ఇంట్లో నలభీముడున్నాడు మా గ్రామంలో ప్రతి ఇంట్లో నలభీముడు తయారయ్యారు. మా నాన్న సుబ్బయ్య ఎంతో ఇష్టంగా వంటలు చేయడాన్ని గమనించి నేనూ నేర్చుకున్నా. కొందరు నాతో పచ్చళ్లు చేయించుకుని లండన్‌లోని తమ పిల్లలకు పంపుతున్నారు. నాకు ఫోన్లు చేసి మీ రుచులు బ్రహ్మాండం అని చెబుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. గతంలో కోటలో వంటలు చేసేందుకు ఇక్కడి నుంచి మేము బాండిళ్లు, వంట సామగ్రితో ఆర్టీసీ బస్సులు ఎక్కబోతే కొందరు కండక్టర్లు తక్కువగా చూసేవారు. బస్సుల్లో సైతం ఎక్కించుకోలేదు. ఇప్పుడు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని వెళ్లి చేసి వస్తున్నాం. – రామిశెట్టి వెంకటేశ్వర్లు, వేగూరు -
మద్యం షాపు వద్దే వివాహం.. కారణం అదే!
తిరువనంతపురం: సాధారణంగా చాలా జంటలు తమ పెళ్లి వేడుకను కళ్యాణ మండపంలో గానీ గుడిలో గానీ చేసుకోవడానికి ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ జంట కాస్త వెరైటీగా ఆలోచించారు. తమ వివాహ వేడుకను వైన్‌షాపు ముందర చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు.. ఈ సంఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటుచేసుకుంది. అయితే, కోజికోడ్‌కు చెందిన ప్రమోద్, ధన్యాలు మద్యం దుకాణం ముందు దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరు గత కొంత కాలంగా క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా వివాహ వేడుకలకు 50 మందికి మాత్రమే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రమోద్, ధన్యాలు తెలిపారు. అందుకే తాము, ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ విధంగా మద్యం దుకాణం ముందు పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న కోజికోడ్ ఎంపీ ఎంకె రాఘవన్ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. మద్యం షాపుల దగ్గర,లిక్కర్ కోసం వందల మంది ఎగబడుతున్నారని విమర్షించారు. అయితే, అక్కడ పాటించని కరోనా నిబంధనలు వివాహ వేడుకలకు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాటరర్స్‌ను ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం, తాజా సడలింపులలో భాగంగా పెళ్లి వేడుకలకు 100 మంది పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేరళలో దాదాపు, 2000 కుటుంబాలు క్యాటరింగ్ వ్యాపారంపై ఆధారపడ్డాయి. వీరందరు పెళ్లిళ్లకు ఆహారాన్నిసప్లైచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. కాగా, గత కొంత కాలంగా వీరికి ఎలాంటి ఆర్డర్లు లేక తీవ్రంగా నష్టపోతున్నామని కేరళ క్యాటరర్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రేమ్ చంద్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. వారిని ఆదుకోవాలి..’, ‘భలే ఉంది.. మీ ఐడియా..’, ‘ జాగ్రత్త సుమా.. తాగుబోతులు పక్కనే ఉన్నారు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
వివాహ వేడుకలో పీపీఈ కిట్లతో..
-
పెళ్లి వేడుకలో పీపీఈ కిట్లతో..
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం వివాహ, ఇతర శుభకార్యాలను అతి తక్కువ మందితో నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాజిల్లాలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలో క్యాటరింగ్ సిబ్బంది వినూత్నంగా భోజనాలు వడ్డించారు. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వివాహానికి వచ్చిన బంధువులు, అతిధులకు క్యాటరింగ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి భోజనాలు వడ్డించారు. భౌతిక దూరం పాటిస్తూ క్యాటరింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పెళ్లివారమండీ... ‘విందు’ తెచ్చినామండీ..) ఈ వివాహ వేడుక కృష్ణా జిల్లా ముదినేపల్లిలో జరిగింది. గుడివాడకు చెందిన కోటి క్యాటర్స్ కరోనా కాలంలో ఇలా ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణమాసం ప్రారంభం కావటంతో పరిమిత సంఖ్యలో పలు శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పీపీఈ కిట్లు ధరించి వివాహ కార్యక్రమాల్లో భోజనం అందిస్తున్నామని కోటి క్యాటర్స్ తెలిపారు. ఇక రాష్ట్రంలో వివాహం, పలు శుభకార్యాలు నిర్వహించుకోవాడానికి స్థానిక తహశీల్దార్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. (‘‘పెళ్లయ్యే వరకూ ఆగండి’’ ) -
విషాదం : ఆటోలో సీటు కోసం ప్రాణం తీసేశారు
-
విషాదం : ఆటోలో సీటు కోసం ప్రాణం తీసేశారు
జైపూర్ : ఆటోలో సీటు కోసం గొడవ పడి ఒక కశ్మీరీ యువకుడు తన ప్రాణం పోగొట్టుకొన్న విషాద ఘటన జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌కు చెందిన 18 ఏళ్ల బసిత్ జైపూర్ ప్రాంతంలో క్యాటరింగ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బసిత్ ఫిబ్రవరి 5న అర్ధరాత్రి సమయంలో తన పని ముగించుకొని రూంకు వెళ్లేందుకు కోవర్కర్లతో కలిసి బయలుదేరాడు. కొద్దిసేపటికి రూంకు వచ్చిన బసిత్‌ను గాయాలతో చూసిన అతని స్నేహితులు జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే బసిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆసుపత్రిలో మృతి చెందాడు. బసిత్ మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ అతని స్నేహితులు జైపూర్‌లోని హర్మదా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బసిత్ మృతి వెనుక గల కారణాలను 24గంటల్లోనే చేధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 'కశ్మీర్‌కు చెందిన బసిత్ జైపూర్‌లో క్యాటరింగ్ బాయ్‌గా పనిచేసేవాడు. ఎప్పటిలాగే ఫిబ్రవరి 5వ తేదీన తన పని ముగించుకొని రూంకు వెళ్లేందుకని సిద్ధమయ్యాడు. ఇంతలో అతనితో పాటు పనిచేసే కోవర్కర్లు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో అక్కడికి ఒక ఆటో రావడంతో బసిత్ ఆటో ఎక్కేందుకు ప్రయత్నించగా అతన్ని నెట్టివేసి మిగతావారు కూర్చున్నారు. ఆటోను నేను ఆపితే మీరు ఎక్కడమేంటని, పైగా నాకు సీటు ఇవ్వకుండా తోసేస్తారా అని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బసిత్‌ను తీవ్రంగా కొట్టి కింద పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. తర్వాత కాసేపటికి బసిత్ తన రూంకు వచ్చి తన స్నేహితులకు విషయం చెప్పి సృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రికి తరలించారని, కానీ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడని' స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు.ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఇద్దరు నిందితుల్లో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, అతని పేరు ఆదిత్య అని, స్వస్థలం ఢిల్లీ అని పోలీసులు తెలిపారు. కాగా మరొకరి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. బసిత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అతని బంధువులకు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
మహానాడులో కేటరింగ్ కార్మికుడు మృతి
తిరుపతి: తిరుపతి మహానాడులో కేటరింగ్ కోసం వచ్చిన ఓ కార్మికుడు మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ వాసిగా గుర్తించారు. అమర్నాథ్ అనే వ్యక్తి గతకొంతకాలంగా విజయవాడలో కేటరింగ్ పనిచేస్తున్నాడు. తిరుపతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో కేటరింగ్ చేయడానికి అక్కడి బృందంతో కలిసివచ్చాడు. వంట పనుల్లో ఉండగా ఉన్నట్టుండి అమర్నాథ్ కుప్పకూలిపోయాడు. అతన్ని రుయా ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతిచెందినట్టు సమాచారం.