సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం వివాహ, ఇతర శుభకార్యాలను అతి తక్కువ మందితో నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాజిల్లాలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలో క్యాటరింగ్ సిబ్బంది వినూత్నంగా భోజనాలు వడ్డించారు. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వివాహానికి వచ్చిన బంధువులు, అతిధులకు క్యాటరింగ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి భోజనాలు వడ్డించారు. భౌతిక దూరం పాటిస్తూ క్యాటరింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పెళ్లివారమండీ... ‘విందు’ తెచ్చినామండీ..)
ఈ వివాహ వేడుక కృష్ణా జిల్లా ముదినేపల్లిలో జరిగింది. గుడివాడకు చెందిన కోటి క్యాటర్స్ కరోనా కాలంలో ఇలా ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణమాసం ప్రారంభం కావటంతో పరిమిత సంఖ్యలో పలు శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పీపీఈ కిట్లు ధరించి వివాహ కార్యక్రమాల్లో భోజనం అందిస్తున్నామని కోటి క్యాటర్స్ తెలిపారు. ఇక రాష్ట్రంలో వివాహం, పలు శుభకార్యాలు నిర్వహించుకోవాడానికి స్థానిక తహశీల్దార్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. (‘‘పెళ్లయ్యే వరకూ ఆగండి’’ )
Comments
Please login to add a commentAdd a comment