జగన్ కేసు విచారణ 19కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆడిటర్ విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్తలు పెన్నా ప్రతాపరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్సింగ్, ఆదిత్యనాథ్ దాస్, శాంబాబు తదితరులు కూడా హాజరయ్యారు.
మాజీ మంత్రులు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్తలు నిత్యానందరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, అయోధ్యరామిరెడ్డి తదితరులకు హాజరు నుంచి కోర్టు మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఇక ఓఎంసీ కేసులో నిందితులుగా ఉన్న గాలి జనార ్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్ రిమాండ్‌ను వచ్చే నెల 19 వరకు కోర్టు పొడిగించింది.