చిక్కుల్లో కేంద్ర మాజీ మంత్రి
న్యూఢిల్లీ: ఓ ప్రైవేటు సంస్థకు బొగ్గు బ్లాకు కేటాయింపులో ఆ శాఖ మాజీ సహాయమంత్రి సంతోశ్ బగ్రోడియా, మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో అధికారి ఎల్‌ఎస్ జనోతి నిబంధనలు ఉల్లంఘించారని ప్రాథమిక ఆధారాలను బట్టి నిర్ధారణైందని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం వారు నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. మహారాష్ర్టలోని బందేర్ కోల్ బ్లాకును ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీకి కట్టబెట్టడంలో కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ఆ కంపెనీకి ఇప్పటికే పలు బొగ్గు బ్లాకులను అప్పగించిన విషయం బగ్రోడియాకు తెలిసినా ఆ సంగతి వెల్లడించకుండా బందేర్ బ్లాకు ఫైలుపై సంతంకం చేసి ప్రధాని కార్యాలయానికి కావాలనే పంపించారని తప్పుబట్టింది.