coal block allocation
-
చిక్కుల్లో కేంద్ర మాజీ మంత్రి
న్యూఢిల్లీ: ఓ ప్రైవేటు సంస్థకు బొగ్గు బ్లాకు కేటాయింపులో ఆ శాఖ మాజీ సహాయమంత్రి సంతోశ్ బగ్రోడియా, మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో అధికారి ఎల్ఎస్ జనోతి నిబంధనలు ఉల్లంఘించారని ప్రాథమిక ఆధారాలను బట్టి నిర్ధారణైందని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం వారు నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. మహారాష్ర్టలోని బందేర్ కోల్ బ్లాకును ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీకి కట్టబెట్టడంలో కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ఆ కంపెనీకి ఇప్పటికే పలు బొగ్గు బ్లాకులను అప్పగించిన విషయం బగ్రోడియాకు తెలిసినా ఆ సంగతి వెల్లడించకుండా బందేర్ బ్లాకు ఫైలుపై సంతంకం చేసి ప్రధాని కార్యాలయానికి కావాలనే పంపించారని తప్పుబట్టింది. -
బొగ్గు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఇక పారదర్శక ప్రక్రియ బొగ్గు క్షేత్రాలున్న రాష్ట్రాలకు ఊహించని ఆదాయం న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు రద్దు చేసిన 204 బొగ్గు క్షేత్రాల పునః కేటాయింపునకు అవకాశం కల్పించే ‘బొగ్గు గనుల(ప్రత్యేక విధి, విధానాల)బిల్లు’కు శుక్రవారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అక్టోబర్ నెలలో జారీ అయిన సంబంధిత ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును రెండు రోజుల క్రితం బొగ్గు శాఖమంత్రి పీయూష్ గోయల్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లులో పలు లోపాలున్నాయని, కార్మికుల సంక్షేమం, భూసేకరణ తదితర అంశాల్లో తమకు కొన్ని ఆందోళనలున్నాయన్న విపక్షం.. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే బొగ్గు రంగం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని విమర్శించింది. బిల్లును పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించాలని డిమాండ్ చేసింది. విపక్ష డిమాండ్‌ను తోసిపుచ్చిన గోయల్.. బొగ్గు క్షేత్రాల కేటాయింపు, బొగ్గు వెలికితీత, అమ్మకం తదితరాల్లో మరింత పారదర్శకత లక్ష్యంగా బిల్లును రూపొందించామని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ వేలంపాట(ఈ ఆక్షన్) పద్ధతిలో కేటాయింపులు జరుపుతామని, గనులు పొందిన సంస్థలకు అక్కడి భూమి, మైనింగ్ వసతులపై పూర్తి హక్కులు ఉంటాయని వివరించారు. బొగ్గుక్షేత్రాలున్న బిహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు ఈ బిల్లుతో లక్షల కోట్ల రూపాయాలు ఆర్జిస్తాయన్నాయని, నిధులే నేరుగా వాటికే అందుతాయని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభిస్తూ.. బొగ్గురంగ పునర్వ్యవస్థీకరణకు వచ్చిన అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోతోందన్నారు. త్వరలో 74 బొగ్గు క్షేత్రాలకు వేలం వేయనున్నారు. కాగా, బిల్లు ఆమోదం నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి బొగ్గు కార్మిక సంఘాలు ఈ నెల 15న సమావేశం కానున్నాయి. -
కమల్ స్పాంజ్ కేసు పై వివరణ ఇవ్వండి
బొగ్గుకేసులో సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో కమల్ స్పాంజ్ స్టీల్, పవర్ లిమిటెడ్ సంస్థపై కేసు ముగిసిందన్న సీబీఐ నివేదికపై ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం సునిశితమైన ప్రశ్నలు సంధించింది. కమల్ స్పాంజ్ సంస్థపైన, సంస్థ డెరైక్టర్లపై కేసుకు తగిన ఆధారాలు లేవంటూ సీబీఐ ఇచ్చిన నివేదికపై వాదనల నేపథ్యంలో కోర్టు ఈ ప్రశ్నలు వేసింది. ఆ సంస్థపై నమోదైన ఎఫ్ఐఆర్లోని ఏ అంశానికి ఆధారాలు దొరకలేదో వివరణ ఇవ్వాలని, ప్రాథమిక విచారణ దశనుంచి, ఎఫ్ఐఆర్ స్థాయివరకూ దర్యాప్తునకు అసలు ప్రాతిపదిక ఏమిటో వివరించాలని అదనపు సెషన్స్ న్యాయమూర్తి భరత్ పరాశర్ ఆదేశించారు. ప్రాథమిక విచారణలో రికార్డుచేసిన అంశాలపై మీరు సేకరించలేకపోయిన ఆధారాలేమిటి?, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక మినహా సమీకరించిన ఆధారాలేమిటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రాథమిక స్థాయినుంచి దర్యాప్తును సాగించేందుకు మీకున్న ప్రాతిపదిక ఏమిటి? ప్రాథమిక విచారణ దశలోనే ఎందుకు ఆగలేకపోయారని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. -
సీబీఐపై ప్రత్యేక కోర్టు ఆగ్రహం
‘కోల్గేట్’ చార్జిషీట్‌ను తిప్పిపంపిన జడ్జి న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం దర్యాప్తులో సీబీఐ తీరును ప్రత్యేక కోర్టు శుక్రవారం మరోసారి తప్పుబట్టింది. కోల్‌కతాలోని ఒక కంపెనీకి సంబంధించిన కేసులో నలుగురు నిందితులను కేసుల నుం చి తప్పించడంపై సరైన వివరణ ఇవ్వలేదని పేర్కొంటూ సంబంధిత చార్జిషీట్‌ను తిప్పిపంపింది. జార్ఖండ్‌లోని రాజరా పట్టణంలోని బొగ్గు క్షేత్రాన్ని విని ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్‌కు కేటాయించడానికి సం బంధించిన కేసులో ఆ కంపెనీ డెరైక్టర్లు,పలువురు ఉన్నతాధికారులపై కోర్టుకు సమర్పిం చిన చార్జిషీట్లో నుంచి ముందుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నలుగురిని తప్పించటంపై సీబీ ఐ వివరణ ఇవ్వలేదని కోర్టు ఆక్షేపించింది. -
కోల్గేట్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు
ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం ఆదేశం ఎస్‌పీపీగా గోపాల సుబ్రమణియం నియూమకానికి సీజేఐ మొగ్గు న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటారుుంపు కుంభకోణం కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయూలని సుప్రీంకోర్టు శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. సీబీఐ, ఈడీల దర్యాప్తు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే కేసులను పరిష్కరించేందుకు వీలుగా వారంలోగా ప్రత్యేక జడ్జి పేరును ప్రకటించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దేశ రాజధానిలోని ప్రత్యేక కోర్టు ముందు విచారణ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ)గా ప్రముఖ న్యాయవాదిని నియమించాలని కూడా చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని సుప్రీం బెంచ్ నిర్ణరుుంచింది. ఢిల్లీ అత్యున్నత న్యాయ విభాగానికి చెందిన ఓ అధికారిని ప్రత్యేక జడ్జిగా నియమించేందుకు చీఫ్ జస్టిస్ నుంచి ఉత్తర్వులు పొందాల్సిందిగా సూచిస్తూ.. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాయూల్సిందిగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశిస్తున్నట్టు తెలిపింది. ఎస్‌పీపీని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు వీలుగా అందరూ కలిసి సంప్రదింపులు జరపాలని సూచించింది. ఇందుకోసం స్వేచ్ఛాయుతమైన న్యాయ ధృక్పథం, నిజారుుతీ కలిగిన వ్యక్తి కావాలనే ఆకాంక్ష వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. తమ తొలి ప్రాధాన్యతగా సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం పేరును ప్రస్తావించింది. ఈ బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన్ను ఒప్పించాల్సిన అవసరం ఉందంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే విషయంలో సుబ్రమణియం పేరును కేంద్రం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన్నే బొగ్గు కుంభకోణం కేసులకు సంబంధించి ఎస్‌పీపీగా నియమించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొగ్గు చూపడం విశేషం. -
నవభారత్ పవర్‌పై తొలి చార్జిషీటు
బొగ్గు కుంభకోణంలో దాఖలు చేసిన సీబీఐ చార్జిషీటులో కంపెనీ డెరైక్టర్లు పి.త్రివిక్రమ్ ప్రసాద్, వై.హరీశ్చంద్ర ప్రసాద్‌ల పేర్లు ఐపీసీ సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద అభియోగాలు మిగిలిన ఐదు చార్జిషీట్లు 28లోగా దాఖలు చేయూలన్న సుప్రీం న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో మొట్టమొదటి చార్జిషీటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దాఖలయింది. సోమవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ కంపెనీకి చెందిన ఇద్దరు డెరైక్టర్లు పి.త్రివిక్రమ్ ప్రసాద్, వై.హరీశ్చంద్ర ప్రసాద్‌లతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన గుర్తుతెలియని అధికారులు, ఇతరుల పేర్లను కూడా అందులో చేర్చింది. 2006-09 మధ్య బొగ్గు బ్లాకులు పొందేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం, మోసపూరితంగా వ్యవహరించడం వంటి ఆరోపణలను నవభారత్ ఎదుర్కొంటోంది. మరోవైపు ఈ కుంభకోణానికి సంబంధించి మిగిలిన ఐదు చార్జిషీట్లను ఈ నెల 28వ తేదీలోగా దాఖలు చేయూలని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది. చార్జిషీట్ల దాఖలుకు మరింత సమయం కోసం దర్యాప్తు సంస్థ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు జడ్జి మధు జైన్ ముందు నవభారత్ పవర్‌పై చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ.. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. అరుుతే అవినీతి నిరోధక చట్టం కింద ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారవర్గాల సమాచారం. 2012 సెప్టెంబర్ 3న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను మాత్రం ఈ చట్టం కింద కూడా నమోదు చేయడం గమనార్హం. 2010లో నవభారత్ పవర్‌ను భారీ లాభాలకు ఎస్సార్ పవర్ లిమిటెడ్‌కు విక్రయించినప్పటికీ చార్జిషీటులో ఎస్సార్ పేరు లేదని ఆ వర్గాలు వివరించారుు. బొగ్గు కేసుల పురోగతిపై సోమవారం సుప్రీంకోర్టులో వివరణ ఇవ్వడానికి కొన్ని గంటల ముందు సీబీఐ ఈ తొలి చార్జిషీటను దాఖలు చేసింది. గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామని సీబీఐ తన 32 పేజీల తుది నివేదికలో పేర్కొంది. కోట్లాది రూపాయల విలువైన ఈ కుంభకోణానికి సంబంధించి వివిధ సంస్థలు, ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు సహా మొత్తం 16 ఎఫ్ఐఆర్లు సీబీఐ నమోదు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్, బొగ్గు శాఖ మాజీ మంత్రి దాసరి నారాయణరావు, ఆ శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ వంటివారు కూడా ఇందులో ఉన్నారు. నవభారత్తో పాటు స్టెర్లింగ్ ఎనర్జీ లిమిటెడ్, జీఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్, ల్యాంకో గ్రూప్ లిమిటెడ్, మిట్టల్ స్టీల్ ఇండియూ లిమిటెడ్, రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్‌లకు ఒడిశాలోని బొగ్గు బ్లాకులు కేటాయించాల్సిందిగా స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. నవభారత్‌కు బొగ్గు గనులు కేటాయించాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం కూడా సిఫారసు చేసినట్లు పేర్కొంది. ఎందుకీ జాప్యం? చార్జిషీట్ల దాఖలులో జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం సీబీఐని నిలదీసింది. ఫిబ్రవరి 10న మూడువారాల్లోగా ఆరు కేసులకు సంబంధించిన చార్జిషీట్లు దాఖలు చేస్తామని చెప్పడాన్ని గుర్తుచేసింది. ఇప్పటికే నాలుగు వారాలు కావడం చాలా విచారకరమని పేర్కొంది. చార్జిషీట్ల దాఖలులో అసలు జాప్యం ఎందుకు చేయూలంటూ న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, మదన్ బి లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని సీనియర్ న్యాయవాది అమరేందర్ శరణ్ కోరిన నేపథ్యంలో.. తొలుత మూడు వారాల సమయం ఇవ్వాలని భావించిన బెంచ్ చివరకు సీబీఐ విజ్ఞప్తిని మన్నించి ఈ నెల 28 వరకు గడువిచ్చింది. అలాగే సీబీఐ హిండాల్కో నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల తనిఖీకి అనుమతించాల్సిందిగా దర్యాప్తు సంస్థను ఆదేశించాలని కోరుతూ ఐటీ విభాగం దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయూలని బెంచ్ సూచించింది. 72లో ఏర్పడిన నవభారత్ విద్యుత్ ఉత్పాదన, ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, వ్యవసాయ సంబంధిత బిజినెస్‌లను నిర్వహిస్తున్న రాష్ట్ర కంపెనీ నవభారత్ వెంచర్స్ 1972లో ఏర్పాటైంది. డి.సుబ్బారావు, పి.పున్నయ్య, ఏఎస్ చౌదరి కలసి నవభారత్ ఫెర్రో అల్లాయ్స్ పేరుతో నెలకొల్పారు. ప్రస్తుతం ఇండియా సహా ఆగ్నేయాసియా, ఆఫ్రికాల్లో కార్యకలాపాలు విస్తరించడంతోపాటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లను సైతం చేపడుతోంది. 1975లో రాష్ర్టంలోని ఖమ్మం జిల్లా పాల్వంచలో తొలి ఫెర్రోసిలికాన్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఒడిషాలోని ఖరగ్ప్రసాద్లో క్రోమియం అల్లాయ్స్ ప్లాంట్ ఉంది. డెక్కన్ షుగర్స్‌ను విలీనం చేసుకోవడం ద్వారా 1980లో చక్కెర ఉత్పత్తిలోకి ప్రవేశించింది. ఆపై సొంత అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యాన్ని విస్తరించింది. రాష్ర్టంతోపాటు, ఒడిశా, జాంబియాలోనూ విద్యుత్ ప్లాంట్లను పెట్టింది. 2006లో నవభారత్ వెంచర్స్‌గా మా రింది. కంపెనీ చైర్మన్‌గా దేవినేని అశోక్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, త్రివిక్రమ్ ప్రసాద్ ఎండీగా ఉన్నారు. సోమవారం కంపెనీ షేరు 1.7% తగ్గి రూ. 156 వద్ద ముగిసింది. -
ప్రధాని తప్పేం లేదు!
న్యూఢిల్లీ: బొగ్గు వివాదంపై ప్రధాని కార్యాలయం(పీఎంవో) ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి మసి అంటలేదని, గనుల కేటాయింపంతా సవ్యంగానే సాగిందని స్పష్టంచేసింది. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో కంపెనీకి ఒడిశాలోని తలాబిరా గనిని కేటాయించడంలో ప్రధాని మన్మోహన్సింగ్ నిజాయితీగా, నిష్పక్షికంగా వ్యవహరించారంది. ఈ మేరకు 2005లో జరిగిన ఈ కేటాయింపు పరిణామాలను వివరిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. తలాబిరా గనికి సంబంధించి అధికారులు తన ముందు ఉంచిన వివరాలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే బొగ్గు శాఖ మంత్రి హోదాలో ప్రధాని తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. హిందాల్కోకు గని కట్టబెట్టేందుకు ప్రభుత్వ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌ను పక్కనపెట్టారన్న ఆరోపణలను తోసిపుచ్చింది. కేటాయింపు పత్రాలు అందుబాటులో ఉన్నందున సీబీఐ స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోవచ్చని పేర్కొంది. తలాబిరా గని కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ ఆదిత్య బిర్లా చైర్మన్‌పై కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ కేసు పెట్టడం తెలిసిందే. తనది తప్పయితే ప్రధానిదీ తప్పే అవుతుందని పరేఖ్ ఇటీవల వ్యాఖ్యానించారు. నిర్ణయం ఎందుకు మారిందంటే బొగ్గు గని కేటాయింపుపై నిర్ణయం మారడంపై పీఎంఓ వివరణ ఇచ్చింది. బొగ్గు శాఖ నుంచి పీఎంఓకు వినతి అందిందని, దీంతో మొదట తీసుకున్న నిర్ణయం మారిందని వివరించింది. ప్రకటనలోని వివరాలు.. తలాబిరా-2, 3 గనులను హిందాల్కోకు కేటాయించాలని కోరుతూ 2005, మేలో కుమారమంగళం బిర్లా నుంచి పీఎంఓకు లేఖ అందింది. దీన్ని పరిశీలించి, నివేదిక పంపాలని బొగ్గు శాఖ అధికారులకు పీఎంఓ సూచించింది. ఆ గనులను కేటాయించాలంటూ బిర్లా నుంచి జూన్‌లో పీఎంవోకు మరో లేఖ వచ్చింది. దీన్నీ పీఎంవో బొగ్గు శాఖకు పంపింది. తర్వాత తలాబిరా-2 కోసం మూడు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ నైవేలీకి గని కేటాయించాలని నిర్ణయించిందంటూ బొగ్గుశాఖ అధికారులు పీఎంవోకు ఫైలు పంపారు. అందులో హిందాల్కోకు గని కేటాయించొద్దంటూ బొగ్గు శాఖ మూడు కారణాలను పేర్కొంది. తలాబిరా-2ను హిందాల్కోకే కేటాయించాలని కోరుతూ 2005, ఆగస్టులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానికి లేఖ రాశారు. విద్యుత్ ప్లాంట్ల కంటే అల్యూమినియం ప్రాజెక్టుల వల్లే ఎక్కువ సంపద సృష్టి జరుగుతుందని, హిందాల్కోకు గని ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో బొగ్గుశాఖ నిర్ణయాన్ని మార్చుకుంది. గనులను నెవైలీ కార్పొరేషన్‌కు కాకుండా హిందాల్కోకు కేటాయించాలనిసహేతుక కారణాలతో పీఎంవోకు చెప్పింది. దీంతో హిందాల్కోకు గనుల కేటాయింపుపై ప్రధాని తుది నిర్ణయం తీసుకున్నారని వివరించింది. దర్యాప్తును కాంగ్రెస్ నీరుగారుస్తోంది: బీజేపీ ఈ స్కాంపై సీబీఐ దర్యాప్తును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని, ప్రధానిపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. గనుల కేటాయింపులో అధికారుల నిర్ణయానికి ప్రధాని ఎలా బాధ్యుడవుతారని కేంద్రమంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. హిందాల్కోకు గని కేటాయించాలని నవీన్ ప్రధానికి లేఖ రాయడం తప్పు కాదని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. నవీన్‌పై తప్పుడు ప్రచారానికే కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తోందని విమర్శించింది. -
బొగ్గు కుంభకోణం ‘అపురూపం’
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్ల గల్లంతుపై ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సోమవారం రాజ్యసభలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జీరోఅవర్‌లో ప్రకాశ్ జవదేకర్(బీజేపీ) బొగ్గు కుంభకోణం ‘అపురూపమైన’దంటూ వ్యంగ్యంగా అభివర్ణించారు. బొగ్గు కేటాయింపుల ఫైళ్లకు తాను కాపలాదారును కాదని ఇటీవల రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన దుయ్యబట్టారు. ప్రధాని ఫైళ్లకే కాదు, దేశానికి కూడా కాపలాదారు వంటివారే. కానీ ఆయన ఈ రెంటిలో ఏ బాధ్యతనూ సక్రమంగా నిర్వర్తిం చడం లేదని జవదేకర్ అన్నారు. దీనిపై ప్రధాని సవివర ప్రకటన చేయాలని పట్టుబట్టారు.