కాంగ్రెస్ నేత పేరు బయటపెడతా: సుష్మ
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ సహాయ మంత్రి సంతోశ్ బాగ్రోడియాకు దౌత్యవీసా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడొకరు తనపై ఒత్తిడి తెచ్చారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఆ నాయకుడు పేరు పార్లమెంట్ లో వెల్లడిస్తానని ఆమె ట్విటర్ లో పేర్కొన్నారు.
కాగా 'లలిత్ గేట్'లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ స్వరాజ్ మంత్రి పదవికి రాజీనామా చేసేవరకు పార్లమెంట్ సమావేశాలు అడ్డుకుంటామని కాంగ్రెస్ సహా విపక్షాలు స్పష్టం చేశాయి. 'లలిత్ గేట్'పై చర్చించేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. ముందు రాజీనామా, తర్వాతే చర్చ జరగాలని అంటున్నాయి.
I will disclose name of the leader on the floor of the House.@imTejasBarot
— Sushma Swaraj (@SushmaSwaraj) July 22, 2015