cccamera
-
ఏపీలో కుట్రలకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ
సాక్షి, విజయవాడ: మత సామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కుట్రపూరిత చర్యలకు పాలడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతాచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశామని తెలిపారు గౌతం సవాంగ్. (చదవండి: తప్పుడు ఆరోపణలు ఉపేక్షించం) రాజకీయ లబ్ధి కోసమే గుడివాడ ఘటన: రవీంద్రనాథ్ బాబు నిరాదరణ ఆరోపణలతో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు హెచ్చరించారు. గుడివాడలో జరిగిన సంఘటన రాజకీయ లబ్ధి కోసమే జరిగింది అన్నారు. నిరాదరణ ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాగుడుకి బానిసలైన ఇద్దరు వ్యక్తులు మద్యం కొనడానికి అవసరమైన డబ్బుల కోసం హుండీని బద్దలు కొట్టారని విచారణలో వెల్లడించారన్నారు. హుండీలో 600 రూపాయలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలిపారు. జిల్లాలో ఉన్న మతాలకు సంబంధించిన అన్ని ప్రార్థనామందిరాల దగ్గర తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలని సూచించామన్నారు. ప్రశాంతంగా ఉన్న మతాల మధ్య వివాదాలు రాజేసి వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే చర్యలు తప్పవని రవీంద్రనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. -
పోలింగ్ బూత్‌లలో వెబ్ కాస్టింగ్
వేములవాడ: అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 54 సమస్యాత్మక బూత్‌లను అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సమస్యాత్మక బూత్‌లతోపాటు సాధారణ బూత్‌లలో సైతం ఇలాంటి చర్యలు చేపట్టాలని సూచిస్తే తప్పకుండా నియోజకవర్గంలోని 235 కేంద్రాల్లో వెబ్‌క్యాస్ట్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులచే వెబ్ క్యాస్టింగ్‌కు నియమిస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని, ల్యాప్‌టాప్ కలిగిన యవతరం వెబ్ క్యాస్టింగ్‌కు అర్హులని ఆయన తెలిపారు. అలాగే బూత్‌ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికే ప్రతీ బూత్‌ల వద్ద ర్యాంప్‌ల నిర్మాణం చేపట్టాలని, అనేక ప్రాంతాల్లో ర్యాంప్‌ల నిర్మాణాలు దాదాపు పూర్తయినట్లు ఆయన తెలిపారు. అలాగే విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, వృద్ధులు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు, సిబ్బంది గ్రామగ్రామాన ప్రతీ పోలింగ్ స్టేషన్లో సరైన ఏర్పాట్లు చేసేందుకు పనులు ప్రారంభించారు. పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రిటర్నింగ్ అధికారిని సంప్రదించవచ్చని, లేదా వేములవాడ నియోజకవర్గం టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 3465 కాల్ చేసి చెప్పవచ్చన్నారు. ఆదివారం నామినేషన్లకు సెలవు... ఈనెల 12న నోటిఫికేషన్ వెలువడటంతోపాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈనెల 19 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. అయితే మధ్యలో ఆదివారం సెలవు దినం రావడంతో ఆ రోజు నామినేషన్లు వేసేందుకు లేదని ఆయన తెలిపారు. 19తో ముగియనున్న నామినేషన్ల పర్వం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 12 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభించిన రిటర్నింగ్ అధికారులు ఈనెల 19 మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేసే వాళ్లు తమ కార్యాలయానికి రావచ్చని, ఎన్నికల నిబంధనల మేరకు తమ నామినేషన్ పత్రాలు అందజేయవచ్చని సూచించారు. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు విత్‌డ్రాలు, వచ్చేనెల 7న ఉదయం 7 గంటల నుచి సాయంత్రం 8 గంటల వరకు పోలింగ్,11న సిరిసిల్ల మండలం బద్దెనపల్లిలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వచ్చేనెల 13తో ఎన్నికల బాధ్యతలు పూర్తవుతాయని ఆయన తెలిపారు. -
సీసీ కెమెరాల కోసం 50 వేలు విరాళం
కోదాడ: పట్టణంలో రక్షణ ఏర్పాట్లను మరింత పటిష్టం చేసే కార్యక్రమంలో బాగంగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చెయడానికి పట్టణ పోలీసులు ముందుకు వచ్చారు. తమ ఒక్క రోజు వేతనం రూ. 50 వేలను పట్టణ రక్షణ కమిటీకి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రజితారెడ్డి మాట్లాడుతూ కోదాడ పట్టణాన్ని మొత్తం నిఘా నీడలో తీసుకొచ్చి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. దీనికి చేయూతనిచ్చిన పోలీసు సిబ్బందిని ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు ముడియాల భరత్‌రెడ్డి, శ్రీపతిరెడ్డి, మేళ్లచెరువు కోటేశ్వరరావు, కొమరగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు.