సీసీ కెమెరాల కోసం 50 వేలు విరాళం | for cc cameras police deopt donation | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాల కోసం 50 వేలు విరాళం

Published Thu, Jul 21 2016 6:36 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

సీసీ కెమెరాల కోసం 50 వేలు విరాళం - Sakshi

సీసీ కెమెరాల కోసం 50 వేలు విరాళం

కోదాడ: పట్టణంలో రక్షణ ఏర్పాట్లను మరింత పటిష్టం చేసే కార్యక్రమంలో బాగంగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చెయడానికి పట్టణ పోలీసులు ముందుకు వచ్చారు. తమ ఒక్క రోజు వేతనం రూ. 50 వేలను పట్టణ రక్షణ కమిటీకి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రజితారెడ్డి మాట్లాడుతూ కోదాడ పట్టణాన్ని మొత్తం నిఘా నీడలో తీసుకొచ్చి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. దీనికి చేయూతనిచ్చిన పోలీసు సిబ్బందిని ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్‌ సభ్యులు ముడియాల భరత్‌రెడ్డి, శ్రీపతిరెడ్డి, మేళ్లచెరువు కోటేశ్వరరావు, కొమరగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement