సీపీఎస్ విధానం రద్దు చేయాల్సిందే!
రౌండ్‌టేబుల్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : సీపీఎస్ విధానం రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సనాతన బాలస్వామి, కామర్తి రాజశేఖర్‌లు మాట్లాడారు. సామాజిక భద్రతలేని సీపీఎస్ పింఛన్ విధానాన్ని, జీఓ నెం.653, 654, 655లను రద్దు చేయాలని, 2013లో అమలులోకి వచ్చిన పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు అన్ని సంఘాల నాయకులు ఏకమై ఐక్యపోరాటాలు చేస్తామని నిర్ణయించారు. సమావేశంలో టీఎన్జీఓ జిల్లా గౌరవ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, అధ్యక్షుడు రామకృష్ణారావు, ఉఐటీఓ సెక్రెటరీ జనరల్ వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రఘురాంరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, టీపీయుఎస్ హన్మంతరావు, టీపీఆర్టీయూ జిల్లా అ«ధ్యక్షుడు దుంకుడు శ్రీనివాస్, టీటీయూ చలపతిరావు, టీఎస్టీయూ ప్రపుల్చంద్ర, టీపీటీఎఫ్ నారాయణమ్మ, బీటీఏ సుదర్శన్, టీఆర్టీయూ ప్రవీణ్‌కుమార్, డీటీఎఫ్ వెంకటేష్, ఎస్‌ఎల్‌టీఏ సురేంద్రనాథ్, సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.