celebraties attended
-
Yoga Day 2024: యోగా డేలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ప్రముఖులు
Live Updates..👉 నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.👉కశ్మీర్లో యోగా డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.👉ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయి. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి అని తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi leads Yoga session at Sher-i-Kashmir International Conference Centre (SKICC) in Srinagar on J&K, on International Day of Yoga. pic.twitter.com/N34howYGzy— ANI (@ANI) June 21, 2024👉బషీర్‌బాగ్‌లో యోగా వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. #WATCH | Telangana: Union Minister and state BJP chief G Kishan Reddy, and others participate in a Yoga session at Nizam College Grounds, Basheer Bagh in Hyderabad. #InternationalYogaDay pic.twitter.com/bSI3g11tQz— ANI (@ANI) June 21, 2024 #WATCH | Defence Minister Rajnath Singh, Army chief Gen Manoj Pande and others perform Yoga in Mathura, Uttar Pradesh on the occasion of International Day of Yoga. pic.twitter.com/ke7DgB80ld— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Pangong Tso in Leh, on the 10th International Yoga Day.(Video source - ITBP) pic.twitter.com/6LCV406hla— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Karzok in Leh, on the 10th International Yoga Day. pic.twitter.com/ZaLsW9Fldd— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Muguthang Sub Sector in North Sikkim at an altitude of more than 15,000 feet, on the 10th International Yoga Day.#InternationalYogaDay2024(Source: ITBP) pic.twitter.com/oBY9Xuznb8— ANI (@ANI) June 21, 2024 👉ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై యోగా డే సెలబ్రేషన్స్.. #WATCH | Yoga onboard aircraft carrier INS Vikramaditya #InternationalYogaDay pic.twitter.com/ROBw82yvph— ANI (@ANI) June 21, 2024 👉యోగా డే పాల్గొన్న జైశంకర్..#WATCH | EAM Dr S Jaishankar and other diplomats perform Yoga in Delhi, on the International Day of Yoga. pic.twitter.com/MSbucUs40x— ANI (@ANI) June 21, 2024 👉 యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. #WATCH | Gujarat CM Bhupendra Patel performs Yoga, along with others, in Nadabet, Banaskantha on International Day of Yoga. pic.twitter.com/Ick5HCm6By— ANI (@ANI) June 21, 2024 -
రన్ రాజా రన్ ! హాఫ్ మారథాన్ !!
మెదక్: ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా సిద్దిపేట ముందుకు సాగుతోంది. మనిషి జీవన ప్రమాణాలతోపాటు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయి. బిజీ ప్రపంచంలో శారీరక శ్రమలేక ఎన్నో అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం సిద్దిపేట వేదిక అవుతోంది. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, జిల్లా పోలీస్ శాఖ సమన్వయంతో ఆగస్టు 6న హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. అందులో 5, 10, 21 కిలో మీటర్ల విభాగాలు ఏర్పాటు చేశారు. అందుకోసం ఇప్పటికే ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హాఫ్ మారథాన్ అంటే.. మారథాన్ అంటే 42.195 కిలో మీటర్లు(26.385 మైళ్లు), హాఫ్ మారథాన్ అంటే 21.0975 కిలో మీటర్లు(13.192 మైళ్లు) అంటారు. ఇలాంటి రన్లను అరుదుగా నిర్వహిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరంలో సుమారుగా 800 పైగా జరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో ఉగాండాకు చెందిన జాకబ్ కిప్లిమో హాఫ్ మారథాన్‌ను 57.31నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించగా, మహిళల విభాగంలో 1.02గంటలో హాఫ్ మారథాన్‌ను ఇథియోపియాకు చెందిన లెటెన్బెట్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. రంగనాయకసాగర్ వేదికగా.. హాఫ్ మారథాన్‌కు సిద్దిపేటలోని రంగనాయకసాగర్ వేదిక కాబోతుంది. ఆగస్టు 6(ఆదివారం)న ఉదయం 5.30గంటలకు హాఫ్ మారథాన్(21.0975 కిలో మీటర్లు) సిద్దిపేట పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ప్రారంభమై రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పైన రన్ సాగనుంది. అదే రోజు ఉదయం 5:30 గంటలకు 5, 10 కిలో మీటర్ల పరుగు పందెం రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పై జరగనుంది. ఈ రన్లో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సినీ నటులు, ప్రముఖ క్రీడాకారులు పాల్గొననున్నారు. గెలుపొందిన వారికి నగదు పురస్కారాలు హాఫ్ మారథాన్‌లో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలు అందించనున్నారు. పురుషులు, మహిళలకు వేరువేరు విభాగాలుగా విభజించి అందించనున్నారు. హాఫ్ మారథాన్ విజేతలకు ప్రథమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ రూ.25వేలు, తృతీయ రూ.10వేల నగదును, పది కిలోమీటర్ల పందెంలో ప్రథమ రూ.25వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ బహుమతి రూ.10వేలు, 5కిలోమీటర్లలో ప్రథమ రూ.15వేలు, ద్వితీయ రూ.10వేలు, తృతీయ రూ.5వేల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికను అందించనున్నారు. ఇలా మొత్తంగా నగదు పురస్కారాలు రూ3.30లక్షలను అందించనున్నారు. ఈ నెల 25తో ముగియనున్న ఎంట్రీలు హాఫ్ మారథాన్ రన్లో పాల్గొనే వారు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 5కిలోమీటర్ల రన్‌కు సంబంధించిన ఎంట్రీ గడువు ముగిసింది. జ్ట్టి ఞట://టజిఝ23.జ్ఞీ301.ఛిౌఝ లింక్‌ను ఓపెన్ చేసి వివరాలను నమోదు చేయాలి. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు హాఫ్ మారథాన్, 10 కిలో మీటర్ల రన్‌కు 14 సంవత్సరాలు నిండిన వారు అర్హులు, 5కిలో మీటర్ల రన్లో 10 సంవత్సరాలు నిండిన వారు పాల్గొనేందుకు అర్హులు. పోస్టర్ ఆవిష్కరణ చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో హాఫ్ మారథాన్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం సిద్దిపేట ఏసీపీ సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ చార్జీలు 5కే రన్‌కు రూ.200, 10కే రన్‌కు రూ.300, 21కే రన్‌కు రూ.500 చెల్లించి ఆన్లైన్లో పేరు నమోదు చేయించుకోవాలన్నారు. -
నీళ్లు.. నిధులు
మెతుకుసీమ సౌభాగ్యం జిల్లాకు 3 నీటిపారుదల ప్రాజెక్టులు రాజధాని తాగునీటికి ప్రత్యామ్నాయం సింగూరు నీరు మనమే వాడుకుందాం! ‘మెదక్’.. 3 జిల్లాలు కాబోతోంది విద్య, వైద్యం, రోడ్ల మెరుగుకు పుష్కలంగా నిధులు 60 టీఎంసీల సామర్ధ్యంతో మూడు ప్రాజెక్టులు మెదక్‌లోనే హైదరాబాద్ తాగునీళ్ల నీటి అవసరాలకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నాం సింగూరు నీళ్లు కూడా మనమే ఉపయోగించుకుందాం మెదక్‌ను మూడు జిల్లాలుగా పునర్విభజన 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘గోదావరి పారాలి.. బీడు భూములు తడవాలి. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేశారు. 50 టీఎంసీలతో మల్లన్నసాగర్, 7 టీఎంసీలతో కొండ పోచమ్మ, 3 టీఎంసీలతో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక సింగూరు నీళ్లు కూడా మనకే ఉపయోగపడతాయి’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన 70వ స్వాతంత్ర దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పుష్కలంగా నీళ్లు, నిధులతో మెతుకుసీమను సౌభాగ్యసీమగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. కొత్తగా మూడు జిల్లాలు ‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో శుభవార్త కూడా పంచుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా సంగారెడ్డితో పాటు మెదక్, సిద్దిపేట ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు హరితహారంలో భాగం పంచుకోవటం సంతప్తి నిచ్చింది. ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటాలనే చైతన్యం రావటం సంతోషకరం. జిల్లాలో ఈ ఏడాది 3.43 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యమైతే.. ఇప్పటికి 2.25 కోట్ల మొక్కలు నాటాం. నాటిన మొక్కలను సంరక్షించుకోవటమూ ముఖ్యమే. బతకటానికి మనిషికి నీళ్లెంత అవసరమో, మొక్కలకూ అంతే అవసరం. అధికారులు ఎండాకాలంలో ప్రజల గొంతు ఎండకుండా ఎలాగైతే చర్యలు తీసుకున్నారో.. మొక్కల సంరక్షణకూ అలాంటి ఏర్పాట్లే చేయాలి. రాష్ట్ర స్థాయి హరితమిత్ర అవార్డుకు ఎంపికైన సిద్దిపేట మున్సిపల్ పాలవర్గానికి అభినందనలు. విద్యుత్తు మెరుగుకు రూ.800 కోట్లు నీటిపారుదల, విద్యుత్తు రంగాల్లో పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు బాగా సహకరిస్తున్నాయి. సంక్షేమ రంగంలో మనం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మెదక్ జిల్లాలో పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఈ రెండేళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసి విద్యుత్తు అభివృద్ధి పనులు చేపట్టాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ములుగులో హర్టీకల్చర్ యూనివర్సిటి, ఫారెస్టు కాలేజిలకు శంకుస్థాపన చేశాం. జిల్లాలో 11 మైనాన్టీ గురుకులాలను ఏర్పాటు చేశాం. అత్యంత వెనుకబడిన ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గానికే 4 ఎస్టీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. మిషన్ కాకతీయ కింద మొదటి దశలో రూ.364 కోట్లతో 1,684 చెరువులను, రూ.454 కోట్లతో 1,679 చెరువులను బాగు చేసుకోబోతున్నట్లు ఆయన వివరించారు. వైద్యం, రహదారుల బాగు.. ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో మన జిల్లా నెంబర్‌వన్‌గా నిలిచింది. జిల్లాలో 7 కొత్త సిమాంక్ కేం ద్రాలను, 3 రక్తనిధి కేంద్రాలను, 4 రక్త నిలువ కేంద్రాలను ఏర్పాటు చేశాం. రూ.3 కోట్లతో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఆధునిక వైద్య పరికరాలు అందించాం. రూ 1,500 కోట్లు ఖర్చు చేసి 1,600 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్డు, రూ.611 కోట్లు ఖర్చు చేసి 2,493 కిలో మీటర్ల పంచాయితీరాజ్ రోడ్లను బాగు చేసుకున్నాం. జిల్లాలో మూడు విడతల్లో 3.96 లక్షల మంది రైతులకు రూ.1,622 కోట్ల రుణమాఫీ జరిగింది’అని హరీశ్‌రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబుమోహన్, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.