celebrations in villages
-
నో ప్లాస్టిక్.. సేవ్ ఎన్విరాన్మెంట్
జీడిమెట్ల: భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతను తగ్గించాలంటే మొక్కలను నాటడమే మార్గమని జీడిమెట్ల ఐలా మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్ఎమ్ఐఏ సర్వీస్ సొసైటీ, టీఎస్ఐఐసీ, ఐలా ఆధ్వర్యంలో 500మందితో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి పీసీబీ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ కుమార్ పాఠక్, జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, టీఎస్ఐఐసీ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విజయరెడ్డి, ఐలా చైర్మన్ సదాశివరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న చెట్లను నరికివేయవద్దని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి భూమిని కాపాడుకోవాలని అన్నారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే డిశ్చార్జ్ చేయాలని వారు సూచించారు. కలిసికట్టుగా కార్యక్రమాలు భేష్ ప్రతి సంవత్సరం జీడిమెట్లలోని అన్ని సొసైటీలు కలిసికట్టుగా నెలరోజుల పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం భేష్ అని మేడ్చల్ జిల్లా ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కుమార్ పాఠక్ అన్నారు. ప్రతి సంవత్సరం మొక్కలను నాటి వాటిని పెంచడంలో తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయని ఈ సందర్భంగా ఆయన వారిని కొనియాడారు. కార్యక్రమంలో ఐలా కార్యవర్గ సెక్రటరీ సాయికిషోర్, ఎ.ఎల్.ఎన్.రెడ్డి, ఫేజ్–3 ప్రోగ్రాం ఇంచార్జ్ విజయ కుమార్ నంగానగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పూల జాతర
పూల బతుకమ్మ.. బతుకునిచ్చే తల్లివమ్మా... తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు నెలవు ఎంగిలి మెతుకులతో మొదలు సద్దుల బతుకమ్మతో ముగింపు పండుగకు సిద్ధమైన పల్లెలు జగదేవ్పూర్: బతుకునిచ్చేదే బతుకమ్మ.. కలిసి బతుకమని చెప్పేదే బతుకమ్మ.. జన జీవన సౌందర్యమే బతుకమ్మ.. ఈ పండుగ వచ్చిందంటే చాలు పల్లెలు, పట్టణాలన్నీ కోలాహలంగా మారుతాయి. రంగుల రంగుల పూలు... సన్నాయిని మించిన చప్పట్లు.. కోకిలమ్మలా రాగాలు... చెమట చుక్కల పదాలు... నెమలి నాట్యాలు... తీరొక్క కొత్త బట్టలు.. పాడి పంటలు ఇంటికొచ్చే వేళ.. ఇవన్నీ కలగలిపితే బతుకమ్మ సంబరాలు.. ఈ పండుగొస్తే చాలు ఆడబిడ్డలు ఆనందంలో మునిగిపోతారు. ఏడాది గాథ బాధలను మర్చిపోయి తొమ్మిది రోజులు వైభోగంలో మునిగి తేలుతారు. ఎంగిలి మెతుకులతో మొదలై సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. శుక్రవారం ప్రారంభమై వచ్చేనెల 9న సద్దుల బతుకమ్మతో పండుగ ముగియనుంది. -
గ్రామాల్లో రాఖీ సందడి
జిన్నారం: రాఖీ పండుగ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. గురువారం రాఖీ పండుగ కావటంతో గ్రామాల్లోని దుకాణాలు వివిధ రకాల రాఖీలతో కళకళలాడుతున్నాయి. చిన్నారులు, యువతులు, మహిళలు రాఖీ దుకాణాల వద్ద బారులు తీరారు. వివిధ రకాల రాఖీలను కొనుగోలు చేసేందుకు మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాల్లోనీ స్వీటు షాపులు కూడా కళకళలాడుతున్నాయి. మండల కేంద్రమైన జిన్నారంలోని వివేకానంద పాఠశాలల్లో ప్రిన్సిపల్ కరుణాసాగర్రెడ్డి ఆధ్వర్యంలోరాఖీ పండుగను బుధవారం నిర్వహించారు. చిన్నారులకు రాఖీ పండుగ ప్రాముఖ్యను ప్రముఖ విద్యావేత్త వివరించారు. పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు కూడా తోటి ఉపాధ్యాయులకు రాఖీ కటి్్ట పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతిభా విద్యానికేతన్ పాఠశాలలో ప్రిన్సిపాల్ సార శ్రీినివాస్ ఆధ్వర్యంలో కూడా రాఖీ పండుగ ఉత్సవాలను నిర్వహించారు. విద్యార్థులకు రాఖీ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు రాఖీ ఆకారంలో ఏర్పడటం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. రాఖీప ండుగను ఘనంగానిర్వహించుకుంటామని మహిళలు, యువతులు చెబుతున్నారు.