సెలబ్రిటీల ఈ-మెయిల్స్ హ్యాకింగ్
న్యూయార్క్: సెలబ్రిటీల ఈ-మెయిల్స్ హ్యాక్ చేసి స్క్రిప్ట్ లు, సెక్స్ వీడియోలు చోరీ చేసిన 23 ఏళ్ల యువకుడిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బహమానా ప్రాంతానికి చెందిన ఆలొంజో నోవెల్స్ గా గుర్తించారు. కాపీ రైట్ అతిక్రమణ, వ్యక్తిగత వివరాల చోరీ కింద అతడిపై అభియోగాలు నమోదు చేశారు.
అతడిపై నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. అతడికి బెయిల్ లభించలేదు. బాధితుల పేర్లు విచారణాధికారులు వెల్లడించలేదు. 15 చిత్రాలు, టెలివిజన్ స్క్రిప్ట్ లు అమ్మేందుకు ప్రయత్నించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.