'జియో ధరలతో ఇండస్ట్రీ అతలాకుతలమే'
ముంబై : ప్రైమ్ ఆఫర్ మరో 15 రోజులు, రూ.303తో మరో మూడు నెలలు ఉచిత ఆఫర్లంటూ రిలయన్స్ జియో అనూహ్య ఆఫర్లు ప్రకటించడంపై మళ్లీ ఇండస్ట్రిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జియో ప్రస్తుతం అందిస్తున్న ఛార్జీలు ఇండస్ట్రీని కంటిన్యూగా అంతలాకుతలం చేస్తాయని సెల్యులార్ ఆపరేటర్ బాడీ కోయ్ ఆందోళన వ్యక్తంచేసింది. టెలికాం ఇండస్ట్రీలో అసోసియేట్ అయ్యే బ్యాంకులపై, ఇతరులపై ఈ ప్రమాద ప్రభావం ఎక్కువగా పొంచి ఉన్నదని పేర్కొంది. అయితే తక్కువ ధరలతో సర్వీసులు అందించడం కస్టమర్లకు మంచిదే, కానీ అవి టారిఫ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదోననేదే అతిపెద్ద ప్రశ్నగా మారిందని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని కోర్టులు, టెలికాం ట్రిబ్యునలే తేల్చాల్సి ఉందన్నారు.
టెలికాం ఇండస్ట్రి రూ.4.60 లక్షల కోట్లు వివిధ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు, బ్యాంకులకు రుణపడి ఉంది. జియో ప్రస్తుతం అందిస్తున్న ఈ ధరలు కంటిన్యూగా ఇండస్ట్రీని దెబ్బతీయనున్నాయని, ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ పేమెంట్లు, బ్యాంకుల రుణాల విషయంలో ప్రమాదం పొంచి ఉన్నాయని కోయ్ డైరెక్టర్ రాజన్ మ్యాథ్యూ చెప్పారు. కానీ ప్రత్యేకంగా రిలయన్స్ జియో టారిఫ్స్ పై స్పందించడానికి ఆయన తిరస్కరించారు. జియో మరింత కొంతమంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముందస్తుగా ప్రకటించిన ప్రైమ్ ఆఫర్ ను మరో 15 పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ 15 రోజుల లోపట ప్రైమ్ ఆఫర్ తో పాటు రూ.303తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలల పాటు ఉచితంగా సేవలందించనున్నట్టు జియో ప్రకటించింది.