Cement bags
-
స్కూటర్ని ఇలా కూడా వాడేయొచ్చా!: మహీంద్రా మెచ్చిన ఆవిష్కరణ
మనసు పెడితే దేన్నైనా మనకు సహాయకారిగా ఉపయోగించవచ్చు. కొంచెం కామెన్సెన్స్ ఉంటే దానికి కాస్త తెలివి తోడైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అందుకు ఉదాహరణ ఇక్కడొక వ్యక్తి నిర్మాణ పనులకు స్కూటర్ని ఉపయోగిస్తున్న విధానమే నిదర్శనం. ఇలా కూడా స్కూటర్ని వాడేయొచ్చా అని ఆశ్చర్యం కలిగించేలా ఉపయోగించాడు. వివరాల్లోకెళ్తే...ఇది వరకు 90లలో ఉపయోగించే స్కూటర్ని సిమ్మెంట్ బస్తాలను చేరవేసే సాధనంగా ఉపయోగించాడు ఒక వ్యక్తి . స్కూటర్ మోటారుకి తాడు చివర భాగాన్ని ఇంజన్‌కి జోడించడంతో..దాని సాయంతో సిమ్మెంట్ బస్తాలను నిర్మాణంలో ఉన్న భవనంపైకి తరలిస్తున్నారు. స్కూటర్ హ్యాండిల్‌ని రైజ్ చేయగానే బస్తా పైకెళ్లుతుంది. ఎంచక్కా మనుషుల సంఖ్య, ఖర్చు తగ్గుతుంది కూడా. పని కూడా ఎంతో సులభంగా అయిపోతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేగాదు ఈ సరికొత్త ఆవిష్కరణను ఆనంద్ మహీంద్ర మెచ్చుకుంటూ ట్విట్టర్లో... వీటిని పవర్ రైళ్లు అని పిలుస్తాం. ఇంజన్ల శక్తిని ఉపయోగించడానికి అనేక మార్గాలు. ఈ స్కూటర్ మెరుగ్గా ఉంటుంది. నిశబ్దంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇవి సెక్హ్యాండ్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు మహీంద్ర. 👏🏽👏🏽👏🏽 I guess that’s why we call them ‘power’trains. Many ways to utilise the power of vehicle engines. This would be even better ( and quieter!) with an e-scooter, once their cost is brought down or they are available second-hand. pic.twitter.com/Xo6WuIKEMV — anand mahindra (@anandmahindra) December 6, 2022 (చదవండి: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్: వీడియో వైరల్) -
సిమెంట్ స్టాక్స్- కాంక్రీట్ లాభాలు
లాక్‌డవున్ నిబంధనలను సడలించడం మొదలుపెట్టాక ఈ నెలలో సిమెంటుకు డిమాండ్ ఊపందుకున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా మౌలిక రంగ కార్యకలాపాలు పెరిగినట్లు తెలియజేశాయి. జాతీయ రహదారుల అభివృద్ధి పనులు వేగమందుకున్నట్లు తెలియజేశాయి. అంతేకాకుండా నైరుతి రుతుపవనాల కంటే ముందుగానే నిర్మాణపనులు పూర్తిచేసే యోచనలో గ్రామ ప్రాంతాలలోనూ పనులు ప్రారంభమైనట్లు వివరించాయి. దీంతో పలు కంపెనీలు 60-70 శాతంమేర సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలలో సిమెంటుకు అంచనాలకు మించి డిమాండ్ కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాలలో రిటైల్ మార్కెట్లో సిమెంట్ బ్యాగ్‌పై రూ. 20-90 మధ్య ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర, పశ్చిమ, మధ్య భారతాల్లో రూ. 20-30 మధ్య, తూర్పు ప్రాంతాల్లో రూ. 20-50 మధ్య ధరలు బలపడగా.. దక్షిణాదిన మరింత అధికంగా రూ. 40-90 పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో పలు కంపెనీలు ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించడం కూడా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సిమెంట్ రంగ కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతున్నట్లు పేర్కొన్నారు. వారం రోజులుగా గత వారం రోజులుగా పలు సిమెంట్ కౌంటర్లు బలపడుతూ వస్తున్నాయి. బిర్లా కార్పొరేషన్, జేకే లక్ష్మీ సిమెంట్, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంజనీ పోర్ట్లాండ్, కాకతీయ తదితరాలు 8-20 శాతం మధ్య ర్యాలీ చేశాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అల్ట్రాటెక్ నికర లాభం రూ. 1085 కోట్ల నుంచి రూ. 3239 కోట్లకు ఎగసింది. ఇందుకు ప్రధానంగా పన్ను లాభాలు సహకరించాయి. ఇక బిర్లా కార్పొరేషన్ నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 195 కోట్లను తాకింది. అయితే లాజిస్టిక్స్ సమస్యలతో ఆదాయం 9 శాతం క్షీణించి రూ. 1718 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జేకే లక్ష్మీ సిమెంట్ రూ. 99 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది రెట్టింపునకుపైగా వృద్ధికాగా.. వ్యయాల కట్టడి లాభదాయకతకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. షేర్లు జూమ్ ఆకర్షణీయ ఫలితాల కారణంగా ప్రస్తుతం మరోసారి బిర్లా కార్పొరేషన్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో 8.6 శాతం దూసుకెళ్లి రూ. 530 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 538 వరకూ ఎగసింది. ఇక జేకే లక్ష్మీ సిమెంట్ 3.6 శాతం ఎగసి రూ. 243 వద్ద కదులుతుంటే.. అంజనీ పోర్ట్‌ల్యాండ్ 6.3 శాతం జంప్‌చేసి రూ. 134 వద్ద ట్రేడవుతోంది. ర్యాలీ నిలవకపోవచ్చు గతేడాది క్యూ4లో పటిష్ట ఫలితాలు, ఇటీవల సిమెంట్ బ్యాగుపై పెరిగిన ధరలు సిమెంట్ రంగ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. చమురు ధరల పతనం సైతం ముడివ్యయాలు తగ్గేందుకు దోహదం చేయనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా సిమెంట్ కంపెనీల లాభదాయకత మెరుగుపడే వీలున్నదని అంచనా వేశారు. అయితే కోవిడ్-19 విస్తృతి కారణంగా ఆర్థిక వ్యవస్థ కొంతకాలం మందగించనుందని, ఫలితంగా సిమెంట్ కౌంటర్లలో ర్యాలీ కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. -
సిమెంట్ బస్తాలతో పెళ్లిగౌను.. వైరల్!
జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. మరి పేదోడు ఫ్యాషన్ డిజైనర్‌ను భరించగలడా? కాస్త మెదడుకు పని పెడితే మనలోనూ ఫ్యాషన్ డిజైనర్ పుడతాడు. చైనాలోని ఓ మహిళా రైతే దీనికి నిదర్శనం. పేరు లిలీతాన్. గంగ్సూ ప్రావిన్స్‌లో ఓ కుగ్రామంలో నివాసం. రోజూ పొలం పనుల్లో బిజీగా ఉంటుంది. ఓ రోజు వర్షం పడుతుండటంతో ఇంట్లోనే ఉండిపోయింది. ఆ రోజు ఏం చేయాలో తోచలేదామెకు. ఒకప్పుడు ఓ మేగజీన్‌లో చూసిన అందమైన వెడ్డింగ్ గౌన్ గుర్తొచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న 40 సిమెంట్ బస్తాలను తీసుకుని.. 3 గంటల్లో అచ్చం అలాంటి వెడ్డింగ్ డ్రెస్‌నే కుట్టేసింది. సిమెంట్ బస్తాల గౌన్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో లక్షల మంది చూశారు. దీంతో ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఫొటో తెగ హల్చల్ చేస్తోంది. పాపం ఈ గౌనును తన పెళ్లికి ధరించలేకపోయినందుకు తెగ బాధ పడుతోంది. ఎందుకంటే 2012లోనే ఆమె పెళ్లి జరిగింది. -
సిమెంట్ బస్తాల్లో ఇసుక అక్రమరవాణా
రాత్రి వేళల్లో కొనసాగుతున్న దందా! యాలాల: కాగ్నానది నుంచి ఇసుక తరలించకుండా కళ్లెం వేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజూ ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి రాత్రి సమయంలో ఆటోలు,జీపుల్లో అక్రమ రవాణా నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త ఇసుక అక్రమ రవాణా తగ్గిందని భావిస్తున్నప్పటికీ రాత్రివేళల్లో జోరుగా కొనసాగుతోంది. మండల పరిధిలోని కోకట్, విశ్వనాథ్‌పూర్, బెన్నూరు తదితర గ్రామాల శివారులో ఉన్న కాగ్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం అక్రమార్కులకు సహాయంగా ఆటో, జీపు డ్రైవర్ల యజమానులు కాగ్నానది నుంచి సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒక్కో ఆటోలో 10 నుంచి 20 బస్తాల్లో ఇసుక నింపి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఈ దందా కొనసాగుతోంది. ఒక్కో ఆటోకు రూ.600 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. విశ్వనాథ్‌పూర్ సమీపంలోని శివసాగర్ ప్రాజెక్టు దిగువన కాగ్నానదిలో ఇసుకను సిమెంట్ బస్తాల్లో నింపి రాత్రివేళల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు అగ్గనూరు, సంగెం నుంచి కూడా ట్రాక్టర్లలో ఇసుక అక్రమ కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు వికారాబాద్ సబ్‌కలెక్టర్ వర్షిణి, తాండూరు ఏఎస్పీ చందనదీప్తి కఠిన చర్యలకు దిగుతున్నప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు.