సిమెంట్‌ బస్తాలతో పెళ్లిగౌను.. వైరల్‌! | Marriage Dress Made With Cement Bags | Sakshi
Sakshi News home page

సిమెంట్‌ బస్తాలతో పెళ్లిగౌను

Published Sun, Sep 30 2018 1:31 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Marriage Dress Made With Cement Bags - Sakshi

జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్‌ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. మరి పేదోడు ఫ్యాషన్‌ డిజైనర్‌ను భరించగలడా? కాస్త మెదడుకు పని పెడితే మనలోనూ ఫ్యాషన్‌ డిజైనర్‌ పుడతాడు. చైనాలోని ఓ మహిళా రైతే దీనికి నిదర్శనం. పేరు లిలీతాన్‌. గంగ్సూ ప్రావిన్స్‌లో ఓ కుగ్రామంలో నివాసం. రోజూ పొలం పనుల్లో బిజీగా ఉంటుంది.

ఓ రోజు వర్షం పడుతుండటంతో ఇంట్లోనే ఉండిపోయింది. ఆ రోజు ఏం చేయాలో తోచలేదామెకు. ఒకప్పుడు ఓ మేగజీన్‌లో చూసిన అందమైన వెడ్డింగ్‌ గౌన్‌ గుర్తొచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న 40 సిమెంట్‌ బస్తాలను తీసుకుని.. 3 గంటల్లో అచ్చం అలాంటి వెడ్డింగ్‌ డ్రెస్‌నే కుట్టేసింది. సిమెంట్‌ బస్తాల గౌన్‌తో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో లక్షల మంది చూశారు. దీంతో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ ఫొటో తెగ హల్‌చల్‌ చేస్తోంది. పాపం ఈ గౌనును తన పెళ్లికి ధరించలేకపోయినందుకు తెగ బాధ పడుతోంది. ఎందుకంటే 2012లోనే ఆమె పెళ్లి జరిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement