తెయూకు మరో ప్రతిష్టాత్మక ఎంఓయూ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మరో ప్రతిష్టాత్మక ఒప్పంద పత్రం కుదుర్చుకుంది. ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌తో బయోటెక్నాలజీ, బోటనీ విభాగాలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూ ఈ నెల 21న జరిగినప్పటికీ, సోమవారం ఉదయం సెక్రటేరియట్‌లోని వీసీ సి పార్థసారథి ఛాంబర్లో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సెంటర్ ఫర్ అగ్రికల్చర్ (క్రిడ) తరపున ప్రిన్సిపాల్ సైంటిస్ట్‌లు డాక్టర్ ఒస్మాన్, డాక్టర్ మహేశ్వరి, తెయూ తరపున వీసీ పార్థసారథి, బయోటెక్నాలజీ హెచ్‌వోడీ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, బోటనీ విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ బి.విద్యావర్థిని ఈ ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందంతో బయోటెక్నాలజీ విద్యార్థులు జెనెటిక్ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుందని వీసీ తెలిపారు. ఎమ్మెస్సీ, పీహెచ్డీ విద్యార్థులు, అధ్యాపకుల ఎక్సేS్చంజ్ ఉంటుందని ప్రవీణ్ తెలిపారు. క్రిడ అనేది ప్రతిష్టాత్మక సంస్థ అని ఆయన తెలిపారు.